Naa Autograph Movie: ‘నా ఆటోగ్రాఫీ స్వీట్ మెమొరీస్’ హీరోయిన్ విమల ఇప్పుడెలా మారిందో చూశారా.. ? ఫోటోస్ వైరల్..
మాస్ మాహరాజా రవితేజ నటించిన 'నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్' సినిమాలో నటించిన వన్ ఆఫ్ ది హీరోయిన్ విమల అలియాస్ మల్లిక. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్. 2004లో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ స్కూల్ డేస్ జీవితంలోని స్నేహితురాలు విమల పాత్రలో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.
తెలుగు సినీ పరిశ్రమలో చాలామంది తారలు ఒక్క సినిమాతోనే అడియన్స్ హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. అందం.. అభినయంతోపాటు అంతకు మించిన అమాయకత్వంతో ప్రేక్షకులను మెప్పించారు. ఫస్ట్ మూవీ హిట్ కావడంతో ఆ తర్వాత టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ అందుకోవడం ఖాయం అనుకున్న సమయంలో హఠత్తుగా సినిమాలకు దూరమయ్యారు. ఇక మరికొందరు మాత్రం టాలెంట్ ఉన్నప్పటికీ అదృష్టం కలిసిరాలేదు. ఇప్పటికే ఫస్ట్ మూవీ తర్వాత ఒకటి రెండు చిత్రాల్లో అలరించి ఇండస్ట్రీకి దూరమైన హీరోయిన్స్ గురించి చెప్పక్కర్లేదు. కెరీర్ మంచి ఫాంలో ఉన్నప్పుడే పెళ్లి చేసుకుని సినిమాలకు గుడ్ బై చెప్పిన తారలు.. ఇప్పుడు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. మరికొందరు ఇప్పుడిప్పుడే సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి మరోసారి వెండితెరపై సందడి చేస్తున్నారు. సోషల్ మీడియాలో పలువురు తారలు యాక్టివ్ గా ఉంటూ తమకు సంబంధించిన ప్రతి విషయాన్ని షేర్ చేసుకుంటుండగా.. మరికొందరు అసలు జాడే లేరు. అందులో విమల ఒకరు. అదేనండి.. మన మాస్ మాహరాజా రవితేజ నటించిన ‘నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్’ సినిమాలో నటించిన వన్ ఆఫ్ ది హీరోయిన్ విమల అలియాస్ మల్లిక. ఈ సినిమా అప్పట్లో మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్. 2004లో విడుదలైన ఈ మూవీకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇందులో రవితేజ స్కూల్ డేస్ జీవితంలోని స్నేహితురాలు విమల పాత్రలో నటించింది. ఆ తర్వాత మరో సినిమాలో కనిపించలేదు.
విమల.. అలియాస్ మల్లిక కేరళకు చెందిన నటి.. 2002లో మలయాళ చిత్రం షయోత కూతుతో సినీరంగ ప్రవేశం చేశారు. ఆ సినిమాలో ఆమె నటనకు ఫిదా అయిన డైరెక్టర్ నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ చిత్రంలో ఛాన్స్ ఇచ్చారు. ఈ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యింది. ఈ సినిమా తర్వాత విజయ్ దళపతి నటించిన తిరుపాచి చిత్రంలో దళపతి చెల్లిగా కనిపించింది. ఈ మూవీతో తమిళ్ ఇండస్ట్రీలో పాపులారిటీ సంపాదించుకుంది. ఆ తర్వాత తమిళంలో వరుస సినిమాలు చేసింది కానీ తెలుగులో నటించలేదు.
తమిళంలో గుండక్క మందక్క, తిరుపతి, తుంకుం నకుముమ్, తోట, చెన్నైయిల్ ఒరునార్ వంటి చిత్రాల్లో నటించిన ఆమె.. అటు మలయాళంలోనూ మలయాళంలోనూ పలు చిత్రాల్లో నటించి మెప్పించారు. తమిళంలో పలు సీరియల్లో బుల్లితెరపై సందడి చేసిన ఆమె.. పెళ్లితర్వాత సినిమాలకు దూరమయ్యారు. ప్రస్తుతం ఆమె సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. తాజాగా ఆమె ఫ్యామిలీకి సంబంధించిన ఫోటోస్ వైరలవుతున్నాయి.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.