Tollywood: ఒకప్పుడు కూరగాయలు అమ్మాడు.. ఇప్పుడు స్టార్ యాక్టర్.. ఆస్తులు 200 కోట్లకు పైగానే.. ఎవరో తెలుసా?
ఒకప్పుడు ఈ నటుడు వాచ్‌మెన్‌గా పని చేశాడు. కెమిస్ట్‌గా నూ వర్క్ చేశాడు. కానీ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. సినిమాకు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటూ బాలీవుడ్ లో సంపన్న నటుల్లో ఒకరిగా మారిపోయాడు.

సినిమా ఇండస్ట్రీలో చాలా మంది నటులు తమ నటనతో ప్రేక్షకుల హృదయాల్లో స్థానం సంపాదించుకున్నారు. వీరిలో చాలా మంది బ్యాక్ గ్రౌండ్ లేకుండా వచ్చిన వారే. తమ స్వయం కృషితో సినిమా ఇండడస్ట్రీలో స్టార్స్ గా వెలుగొందిన వారే. ఈ ప్రముఖ నటుడు కూడా సరిగ్గా ఇదే కోవకు చెందుతాడు. ఈ నటుడు ఒకప్పుడు వాచ్‌మెన్‌గా పని చేశాడు. కెమిస్ట్‌గా పనిచేశాడు. కూరగాయలు అమ్మాడు.. ఇలా ఎన్నో రకాల పనులు చేశాడు. అదే సమయంలో సినిమా ఆడిషన్స్ కు హాజరయ్యాడు. మొదట అన్నింటా తిరస్కరణలే. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నించాడు. మొదట చిన్న చిన్న సినిమాల్లో అవకాశం వచ్చింది. ఎలాంటి మొహమాటం లేకుండా అన్ని పాత్రలు చేసుకుంటూ వెళ్లిపోయాడు. ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ క్రమంగా స్టార్ నటుడిగా తనను తాను నిరూపించుకున్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో ది మోస్ట్ ట్యాలెంటెడ్ అండ్ వెర్స టైల్ యాక్టర్లలో ఒకడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యాక్టర్ బాలీవుడ్ తో పాటు తెలుగు, తమిళ్ భాషల్లోనూ సినిమాలు చేస్తోన్నాడు. తన డిమాండ్, క్రేజ్ కు తగ్గట్టుగానే సినిమాకు కోట్లాది రూపాయలు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం ఈ నటుడి ఆస్తి సుమారు రూ. 200 కోట్లకు పైగానే ఉంటోంది. ఇక రాజభవనం లాంటి ఇల్ల, లగ్జరీ కార్లు ఇలా తన పడిన కష్టానికి ఇప్పుడు లగ్జరీ లైఫ్ ను ఆస్వాదిస్తున్నాడీ స్టార్ యాక్టర్. అతను మరెవరో కాదు బాలీవుడ్ నటుడు నవాజుద్దీన్ సిద్ధిఖీ.
ఆ మధ్యన విక్టరీ వెంకటేష్ నటించిన సైంధవ్ సినిమాలో విలన్ గా నటించాడు నవాజుద్దీన్ సిద్దిఖీ. అలాగే ఈ మధ్యన పలు దక్షిణాది సినిమాల్లోనూ మెరుస్తున్నాడు. ఇటీవల ఓ సందర్భంగా మాట్లాడిన నవాజుద్దీన్ తన సినిమా ప్రయాణం గురించి తన అనుభవాలను పంచుకున్నాడు. ‘వడోదరలో ఒక నాటకం చూసినప్పుడు నాకు తొలిసారి నటనా అభిరుచి కలిగింది. ‘మేము మా కుటుంబంతో కలిసి రాంలీలా నాటకం చూసే వాళ్లం. అదే నాకు నటనతో తొలి పరిచయం. నా స్నేహితుడు ఒకరు రామ్ పాత్ర పోషించాడు. వేదికపై అతన్ని చూసి నేను ఆశ్చర్యపోయాను. అప్పుడు రాముడి పాత్రలో నన్ను నేను ఊహించుకునేవాడిని’ అని నవాజుద్దీన్ అప్పటి తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నాడు.
కాగా కళాశాల చదువు పూర్తి చేసిన తర్వాత, నవాజుద్దీన్ వడోదరలో కెమిస్ట్ గా పనిచేశాడు. అతను అక్కడ ఒక నాటకం కూడా చూశాడు. ఆ రాత్రి, నటుడు కావాలనే కల అతని మనసులో బలంగా నాటుకుంది.ఆ తరువాత, నవాజుద్దీన్ నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామాలో అడ్మిషన్ పొందాడు. దీంతో అతని ప్రయాణం ముంబై చేరుకుంది. ‘ నేను ముంబైకి వచ్చినప్పుడు, ప్రతిదీ ఎంత వేగంగా జరుగుతుందో చూసి నేను ఆశ్చర్యపోయాను. ఈ నగరం వేగానికి అలవాటు పడటానికి నాకు ఒక నెల సమయం పట్టింది. నేను ఈ వేగానికి ఎప్పటికీ అలవాటు పడలేనని అనుకున్నాను’ అని అప్పటి అనుభవాలను గుర్తు తెచ్చుకున్నాడు నవాజుద్దీన్.
నవాజుద్దీన్ సిద్దిఖీ లేటెస్ట్ ఫొటోస్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి








