AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: పాత్రకు ప్రాణం పోస్తుంది.. నాగ్ అశ్విన్ ప్రతి సినిమాల్లో ఈ బ్యూటీ ఉండాల్సిందే..

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఓ టాలీవుడ్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో తెగ వైరలవుతుంది. ఈ చిన్నారి ఇప్పుడు క్రేజీ బ్యూటీ. చిన్న వయసులోనే సినీరంగంలోకి అడుగుపెట్టి తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. డైరెక్టర్ నాగ్ అశ్విన్ ప్రతి సినిమాలో ఆమె ఉండాల్సిందే. ఇంతకీ ఈ హీరోయిన్ ఎవరో తెలుసా.. ?

Tollywood: పాత్రకు ప్రాణం పోస్తుంది.. నాగ్ అశ్విన్ ప్రతి సినిమాల్లో ఈ బ్యూటీ ఉండాల్సిందే..
Malvika Nair
Rajitha Chanti
|

Updated on: May 08, 2025 | 7:51 AM

Share

సోషల్ మీడియా ప్రపంచంలో సినీతారలకు సంబంధించిన ప్రతి చిన్న విషయం క్షణాల్లో వైరలవుతుంటాయి. తాజాగా టాలీవుడ్ హీరోయిన్ చైల్డ్ హుడ్ ఫోటో ఇప్పుడు నెటిజన్స్ దృష్టిని ఆకర్షి్స్తుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న చిన్నారి ఇప్పుడు తెలుగులో క్రేజీ హీరోయిన్. చిన్న వయసులోనే సినీరంగంలోకి నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ వయ్యారి.. మొదటి సినిమాతోనే నటిగా ప్రశంసలు అందుకుంది. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను మెప్పించి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాదు.. మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ నాగ్ అశ్వి్న్ తెరకెక్కించిన ప్రతి సినిమాలో ఈ ముద్దుగుమ్మ ఉండాల్సిందే. ఇప్పటివరకు ఆయన రూపొందించిన ప్రతి సినిమాలో ఈ వయ్యారి కనిపిస్తుంది. ఇంతకీ ఆమె ఎవరో తెలుసా..? ఈ హీరోయిన్ మరెవరో కాదు.. మాళవిక నాయర్.

మాళవిక నాయర్.. మలయాళీ ఫ్యామిలీకి చెందిన ఈ ముద్దుగుమ్మ ఢిల్లీలో జన్మించింది. కేరళ, హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో చదువులు పూర్తి చేసింది. ఆ తర్వాత నటనపై ఆసక్తితో సినీరంగంలోకి అడుగుపెట్టింది. 2012లో మలయాళంలో ఓ చిత్రంలో నటించింది. ఆ తర్వాత 2015లో వచ్చిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది. ఇందులో నాని, విజయ్ దేవరకొండ ప్రధాన పాత్రలు పోషించిన సంగతి తెలిసిందే. ఫస్ట్ మూవీతోనే సూపర్ హిట్ అందుకుంది మాళవిక. ఈ చిత్రానికి డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహించారు.

ఇప్పటివరకు నాగ్ అశ్విన్ మూడు సినిమాలను రూపొందించగా.. ప్రతి సినిమాలోనూ మాళవిక నాయర్ కీలక పాత్రలు పోషించింది. నాగ్ అశ్విన్ రూపొందించిన ఎవడే సుబ్రమణ్యం సినిమాతో నటిగా ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు.. ఆ తర్వాత మహానటి సినిమాలో అలమేలు పాత్రలో కనిపించింది. అలాగే ప్రభాస్, నాగ్ అశ్విన్ కాంబోలో వచ్చిన కల్కి 2898 ఏడీ చిత్రంలో ఉత్తర పాత్రలో కనిపించింది. అయితే మాళవికకు ఇప్పటివరకు సరైన బ్రేక్ రాలేదు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ అమ్మడు చాలా యాక్టివ్ గా ఉంటుంది.

ఇవి కూడా చదవండి :  

Mirchi Movie: ఈ హీరోయిన్ ఇంత మారిపోయిందేంటి ?.. మిర్చి మూవీ బ్యూటీ ఫ్యామిలీని చూశారా.. ?

Tollywood: సినిమాలు వదిలేసి వాచ్‏మెన్‏గా మారిన నటుడు.. ఒకప్పుడు స్టార్ హీరోల సినిమాల్లో తోపు యాక్టర్..

Tollywood: సీనియర్ హీరోలతో నటించేందుకు నాకు ఎలాంటి సమస్య లేదు.. హీరోయిన్ ఓపెన్ కామెంట్స్..

Tollywood: ఒకప్పుడు తినడానికి తిండి లేక నీళ్లు తాగి బతికింది.. ఇప్పుడు ఇండస్ట్రీనే షేక్ చేస్తోన్న హీరోయిన్..