Chiranjeevi-Krishna: నేటి యంగ్ జనరేష్ నటీనటులకు అభిమాన హీరో మెగాస్టార్ కూడా ఓ హీరోకి అభిమాని అంటూ పాంప్లెట్ వైరల్..

Chiranjeevi-Krishna:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. చిరుకి నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు, మెగా అభిమానులు పుట్టినరోజు విశేష్ ను చెప్పారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన..

Chiranjeevi-Krishna: నేటి యంగ్ జనరేష్ నటీనటులకు అభిమాన హీరో మెగాస్టార్ కూడా ఓ హీరోకి అభిమాని అంటూ పాంప్లెట్ వైరల్..
Chiru Krishna
Follow us
Surya Kala

|

Updated on: Aug 23, 2021 | 8:31 PM

Chiranjeevi-Krishna:మెగాస్టార్ చిరంజీవి పుట్టిన రోజు వేడుకలు నిన్న ఘనంగా జరిగాయి. చిరుకి నటీనటులతో పాటు దర్శక, నిర్మాతలు, మెగా అభిమానులు పుట్టినరోజు విశేష్ ను చెప్పారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియాలో ఓ ఆసక్తికరమైన వార్త చక్కర్లు కొడుతోంది. చిరంజీవికి సంబంధించిన ఓ ఫోటో షేర్ చేస్తూ.. సందడి చేస్తున్నారు కొంతమంది అభిమానులు

మెగాస్టార్ చిరంజీవి సినీ పరిశ్రమలో అడుగు పెట్టినప్పుడు.. హీరోగా పునాదిరాళ్ళు సినిమాతో ఎంట్రీ ఇచ్చినా.. కెరీర్ లో సెటిల్ అవ్వడానికి తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని అందిపుచ్చుకున్నారు. కెరీర్ మొదట్లో చిన్న పాత్రల్లో కూడా నటిస్తూ.. వాటిల్లో తనదైన ముద్రను వేసి.. చిత్ర పరిశ్రమను తనవైపు దృష్టి మరల్చేలా చేశారు. విలన్, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, నలుగురు హీరోల్లో ఒకరిగా అనేక సినిమాల్లో నటించారు చిరంజీవి. అదే సమయంలో డ్యాన్సులతో, ఫైట్స్ తో చిత్ర పరిశ్రమలో తనదైన ఒరవడిని సృష్టించుకున్నారు. ఇక చిరంజీవి కెరీర్ మొదట్లో ఎన్టీఆర్, కృష్ణంరాజు, కృష్ణ, రజనీకాంత్ , చంద్రమోహన్ వంటి హీరోలతో మల్టీస్టారర్ మూవీస్ లో నటించారు.

సూపర్ కృష్ణ, మెగాస్టార్ చిరంజీవిలు కలిసి తోడుదొంగలు అనే సినిమాలో నటించారు. అప్పుడప్పుడే చిరంజీవి హీరోగా ఎదుగుతున్న సమయం.. అప్పటికే కృష్ణ ..విభిన్న రకాల సినిమాతో సూపర్ స్టార్ కృష్ణగా ఖ్యాతిగాంచిన సమయం.. ఇంకా చెప్పాలంటే కృష్ణ.. ఒకానొక సమయంలో ఎన్టీఆర్ కు పోటీ ఇచ్చారు కూడా.. కృష్ణ సినిమా వస్తుంది అంటే అప్పట్లో యూత్ లో ఓ రేంజ్ లో క్రేజ్. థియేటర్స్ వద్ద సందడి నెలకొనేది. హీరోగా , నిర్మాతగా, దర్శకుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కృష్ణ తెలుగు చిత్ర పరిశ్రమని కొన్నేళ్ల పాటు తిరుగులేని హీరోగాఏలారు. దర్శక, నిర్మతలపాలిట కల్పవృక్షంగా పేరుపొందిన కృష్ణకు అప్పట్లో సినిమా నటులు సైతం అభిమానులు ఉండేవారు. అంటే ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవికి ఎలా యంగ్ హీరోలు అభిమానులుగా ఉన్నారో అదే విధంగా కృష్ణకు ఫ్యాన్స్ ఉండేవారు.

ఇక నెక్స్ట్ జనరేషన్ లో హీరోగా వచ్చి.. తెలుగు చలన చిత్ర పరిశ్రమలో ఎవరెస్టు రెంజ్ లో క్రేజ్ ను సొంతం చేసుకున్న హీరో మెగాస్టార్ చిరంజీవి.. అయితే చిరు కూడా ఒకప్పుడు సూపర్ స్టార్ కృష్ణకు పెద్ద ఫ్యాన్. అప్పట్లో పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ ప్రెసిడెంట్ గా చిరంజీవి వ్యవహరించడం విశేషమని అంటున్నారు కొంతమంది సినీ అభిమానులు.

1981లో కృష్ణ,చిరంజీవి కలిసి తోడుదొంగలు మూవీలో నటించారు. ఆ సినిమా రిలీజ్ సమయంలోని పాంప్లెట్ ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది. తనకు సూపర్ స్టార్ ఎంతో ఇష్టం, అభిమానం అంటూ మెగాస్టార్ మాట్లాడిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ విధంగా నాటి సూపర్ స్టార్ కి నేటి మెగాస్టార్ అభిమాని అయితే.. నెక్స్ట్ జనరేషన్ లో ఇరువురి హీరోల తనయుడు మహేష్ బాబు, రామ్ చరణ్ లు మంచి స్నేహితులు.. అంతేకాదు వారి భార్యలు నమ్రత, ఉపాసన మధ్య కూడా మంచి స్నేహ బంధం ఉన్న సంగతిని గుర్తు చేసుకుంటున్నారు..సూపర్ స్టార్, మెగాస్టార్ అభిమానులు.

Also Read: శ్రీవారి భక్తులకు అలెర్ట్.. రేపు రూ. 300 టికెట్ కోటాను రిలీజ్ చేయనున్న టీటీడీ.. ఏ సమయంలోనంటే

బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
బంపర్ ఆఫర్..! క్లిక్ కొట్టు.. బాలయ్యను కలిసే లక్కు పట్టు.!
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
అల్లు అర్జున్ జాతకాన్ని చెప్పిన వేణుస్వామి.! మార్చి 29 వరకు..
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
పుష్ప2 కోసం వెళ్లిన ప్రేక్షకులకు థియేటర్లో దిమ్మతిరిగే షాక్.!
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
నాన్న చివరి కోరిక తీర్చలేకపోయా.! కన్నీళ్లు పెట్టుకున్న వెంకీ..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
బాబాయ్ ఆ సినిమా చేసుంటే.. అబ్బాయి కెరీర్ కష్టమయ్యేదా.? వీడియో..
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
ఆ ఫెయిల్యూరే నన్ను ఇక్కడి వరకు తీసుకొచ్చింది.! వీడియో.
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
బాధతో సల్మాన్ కీలక నిర్ణయం.! కానీ ఆ తర్వాత సూపర్ రెస్పాన్స్..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
దేశంలోనే అతిపెద్ద కటౌట్‌ దటీజ్ చరణ్‌ క్రేజ్‌! | ఎంత దారుణానికి..
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
మరణించిన తండ్రిపై మమకారంతో పిల్లలు ఏంచేశారంటే..?
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.
గుడ్‌న్యూస్‌.. గుడ్‌న్యూస్‌.! రూ.27 వేలకే iPhone-15.. వీడియో.