Aparichitudu: విక్రమ్ అపరిచితుడు సినిమాను రిజెక్ట్ చేసిన స్టార్ హీరో ఎవరో తెలుసా? ఫస్ట్ హీరోయిన్ కూడా సదా కాదా?
కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్, విలక్షణ నటుడు విక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన చిత్రం అపరిచితుడు. 2005లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పెద్ద సంచలనమే సృష్టించింది. విక్రమ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది. అయితే ఈ మూవీకి అనుకున్న మొదటి హీరో విక్రమ్ కాదు.

కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ శంకర్ తెరకెక్కించిన సూపర్ హిట్ సినిమాల్లో అపరిచితుడు ఒకటి. 2005లో రిలీజైన ఈ సినిమాలో విక్రమ్, సదా హీరో, హీరోయిన్లుగా నటించారు. దాదాపు రూ.26.38 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు రాబట్టింది. నిర్మాతలకు కాసుల వర్షం కురిపించింది. దక్షిణాదిన అన్ని భాషల్లో రిలీజైన (హిందీతో పాటు) ఈ మూవీ ఏకంగా 37 సెంటర్లలో వంద రోజులు ఆడింది. లంచం, నిర్లక్ష్యం లేని సమాజాన్ని నిర్మించడం కోసం విక్రమ్ ఇందులో ముగ్గురిలా (రామానుజం, రెమో, అపరిచితుడు)లా కనిపించి అభిమానులను అలరించాడు. అలాగే కథ, కథనాలు, దర్శకుడు శంకర్ స్టైలిష్ మేకింగ్ ఆడియెన్స్ ను విపరీతంగా ఆకట్టుకున్నాయి.ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ప్రశంసలు ఈ అపరిచితుడు సినిమాకు వచ్చాయి. అంతేకాదు ఫ్రెంచ్ భాషలోకి డబ్ అయిన తొలి ఇండియన్ చిత్రం అపరిచితుడు కావడం విశేషం. గతేడాది ఈ సినిమాను రీ రిలీజ్ చేయగా అప్పుడు కూడా అపరిచితుడు సినిమాకు ఆడియెన్స్ నుంచి ఊహించని స్పందన వచ్చింది. ఇలా ఎన్నో విశేషాలున్న అపరిచితుడు సినిమా రిలీజై ఇటీవలే 20 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా ఈ సినిమా గురించి ఎవరికీ తెలియని కొన్ని ఆసక్తికర విశేషాలు తెలుసుకుందాం రండి.
కాగా డైరెక్టర్ శంకర్ అపరిచితుడు సినిమా కథను మొదటగా కోలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్‌కు వినిపించాడట. అయితే సమయం దొరకలేదో ఏమో తెలియదు కానీ రజనీ పెద్దగా ఈ సినిమాపై ఆసక్తి చూపించలేదట. దీంతో శంకర్ విక్రమ్ దగ్గరకు వెళ్లాడట. అతను కథ విన్న వెంటనే ఓకే చెప్పడంతో అపరిచితుడు పట్టాలెక్కిందట. ఇక హీరోయిన్‌గా కూడా నీలికళ్ల సుందరి ఐశ్వర్యరాయ్‌ను అనుకున్నారట. కానీ బాలీవుడ్‌లో బిజీ అవడంతో కుదర్లేదట. సిమ్రాన్‌ను కూడా అడగ్గా అప్పుడే పెళ్లి పిక్స్ అవడంతో తనూ అపరిచితుడు సినిమా ఛాన్స్ ను చేజార్చుకుందట. దీంతో చివరకు జయంతోపెద్ద హిట్ కొట్టిన సదాకు ఈ సినిమాలో హీరోయిన్ అవకాశం వరించిందట.
రజనీకాంత్ సారీ చెప్పడంతో..
View this post on Instagram
కాగా శంకర్ సినిమాలన్నింటికీ దాదాపు ఏ ఆర్ రెహమానే స్వరాలు అందిస్తారు. అయితే అపరిచితుడు సినిమాకు మాత్రం రెహమాన్ శిష్యుడు హారిస్ జయరాజ్ ను తీసుకున్నారు శంకర్.
కేన్స్ లో ఐశ్వర్యా రాయ్..
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.








