AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతఃపురంలో సౌందర్య కొడుకు గుర్తున్నాడా.! ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరో అతను..

ఇండస్ట్రీలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కుతాయి. కొన్ని సినిమాలు ప్రేక్షకుల మనసులో ఎప్పటికీ నిలిచిపోతాయి. అలాంటి సినిమాల్లో అంతఃపురం సినిమా ఒకటి.. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమాలో సౌందర్య నటన ప్రేక్షకులను కట్టిపడేసింది.

అంతఃపురంలో సౌందర్య కొడుకు గుర్తున్నాడా.! ఇప్పుడు టాలీవుడ్ లో యంగ్ హీరో అతను..
Anthapuram Movie
Rajeev Rayala
|

Updated on: Jun 20, 2025 | 12:45 PM

Share

టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు వచ్చాయి. గులాబి, నిన్నే పెళ్ళాడుతా, సింధూరం, చంద్రలేఖ, ఖడ్గం,మురారి ఇలా ఎన్నో గొప్ప సినిమాలను తెరకెక్కించాడు దర్శకుడు కృష్ణవంశీ. ఆయన తెరకెక్కించిన సినిమాల్లో అంతఃపురం సినిమా ఒకటి. ప్రకాష్ రాజ్ ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాలో సౌందర్య తన నటనతో ఆకట్టుకున్నారు. అంతఃపురం సినిమాలో సౌందర్య నటనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నంది పురస్కారాన్ని ప్రకటించింది. జగపతి బాబుకు ఉత్తమ సహాయ నటుడి పురస్కారం లభించింది. అలాగే ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ కూడా తన నటనతో మెప్పించారు. ప్రకాష్ రాజ్ కు స్పెషల్ మెన్షన్ కేటగిరీలో నేషనల్ ఫిల్మ్ అవార్డ్ దక్కింది. కృష్ణవంశీకి బెస్ట్ డైరెక్టర్ గా, సౌందర్యకు ఉత్తమ నటిగా ఫిల్మ్ ఫేర్ అవార్డులు దక్కాయి.

ఈ సినిమాకు లయ రాజు ఇళయరాజా సంగీతం అందించారు. ఈ సినిమాలోని పాటలన్ని సూపర్ హిట్ గా నిలిచాయి. ఇక ఈ సినిమా హిందీలోనూ రీమేక్ చేశారు. 2003 లో షారుఖ్ ఖాన్, కరిష్మా కపూర్ ముఖ్య పాత్రల్లో శక్తి అనే టైటిల్ తో ఈ సినిమాను తెరకెక్కించారు. ఈ సినిమాలో సౌందర్య కొడుకుగా నటించిన చిన్నోడు గుర్తున్నాడా.? ఈ బుడ్డోడి కోసమే సినిమా కథ అంతా జరుగుతుంది.

ఇవి కూడా చదవండి

చిన్నోడి పేరు కృష్ణ ప్రదీప్. కేవలం రెండేళ్ల వయసులోనే ఈ చిన్నోడు నటనతో ఆకట్టుకున్నాడు.ఈ సినిమా మొత్తం సౌందర్యతో పాటు ఈ చిన్న బాబు ఉంటాడు. అంతఃపురంలో సౌందర్య స్పృహ కోల్పోయిన సమయంలో కర్చీఫ్ నీటిలో తడిపి తుడిచే సీన్ లో తన నటనతో మెప్పించాడు కృష్ణ ప్రదీప్. ఈ సినిమా తర్వాత కృష్ణ ప్రదీప్ సినిమాల్లో నటించలేదు. చదువు నిర్లక్ష్యం కాకూడదని పేరెంట్స్ సినిమాలకి దూరం పెట్టారు. ఇప్పుడు ఈ బుడతడు కుర్రాడిగా ఎదిగాడు. ఇప్పుడు హీరో లుక్ లోకి మారిపోయాడు కృష్ణ ప్రదీప్. హీరోలకు ధీటుగా మంచి ఫిజిక్ తో ఆకట్టుకునేలా ఉన్నాడు ఈ చిన్నోడు. ప్రస్తుతం ది ఇండియా హౌస్ అనే సినిమాలో నటిస్తున్నాడు.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
మహాలక్ష్మీ వ్రతం అందరూ చేయవచ్చా? ఈ 4 మంది మాత్రం ఉపవాసం చేయకూడదట!
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
శ్రాద్ధ భోజనం తినడానికి కాకి రాకపోతే ఏం చేయాలి? ఈ పరిహారాలు..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
పరివర్తిని ఏకాదశి నాడు గుడికి వెళ్లలేకపోతే.. ఇంట్లోనే ఇలా పూజ..
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
ఏడాది పాటు చెక్కుచెదరకుండా ఉండే దబ్బకాయ నిల్వ పచ్చడి
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
మీ అరచేతిలో వివాహ రేఖ ఇలా ఉందా? పెళ్లి ఆలస్యమవుతుందనే సంకేతమట!
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఆ కండిషన్‌తోనే బిగ్ బాస్ కు వెళ్ళా.. ఒక్క రూపాయి కూడా రాలేదు..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఇంట్లో పితృ దోషం ఉందా? ఈ 3 సులభమైన పరిహారాలు పాటిస్తే..
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
ఈ తేదీల్లో పుట్టినవారికి డబ్బు విషయంలో అదృష్టం కలిసొస్తుందట!
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
టాయిలెట్‌లోకి పాములు ఎలా వస్తాయి..?
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్
కమ్మని దోసకాయ కొబ్బరి పచ్చడి.. తాలింపు లేకపోయినా అదిరిపోయే టేస్ట్