Actress Pakeezah Vasuki: దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న అలనాటి నటి పాకీజా..

ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీన స్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా మరో నటి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. ఆమె ఎవరో కాదు అలనాటి నటి పాకీజా.

Actress Pakeezah Vasuki: దీన స్థితిలో సాయం కోసం ఎదురుచూస్తున్న అలనాటి నటి పాకీజా..
Pakija
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 11, 2023 | 11:39 AM

చాలా మంది నటీ నటులు ఇప్పుడు సినిమాలు లేక చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కొంతమంది ఆర్థిక పరిస్థితి బాలేక రోడ్డుమీద పడిన ఘటనలు చాలా ఉన్నాయి. ఇప్పటికే పలువురు మీడియా ముందుకు వచ్చి తమ దీన స్థితి గురించి ఆవేదన వ్యక్తం చేసిన ఘటనలు ఉన్నాయి. తాజాగా మరో నటి కూడా అలాంటి పరిస్థితినే ఎదుర్కొంటుంది. ఆమె ఎవరో కాదు అలనాటి నటి పాకీజా. ఒకప్పుడు కామెడీ నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు పాకీజా. ఆమె అసలు పేరు పాకీజా వాసుకి. అప్పట్లో పాకీజా డేట్స్ కూడా దొరికేవి కావట.. సినిమాలతో, వరుస షూటింగ్ లతో అంత బిజీగా గడిపేవారు ఆమె. మోహన్ బాబు నటించిన అసెంబ్లీ రౌడీ సినిమాతో పాకీజాకు మంచి గుర్తింపు వచ్చింది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించి మెప్పించింది.

ముఖ్యంగా హాస్య బ్రహ్మ బ్రహ్మానందం, పాకీజా కాంబినేషన్ లో వచ్చే కామెడీ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకునేవి. రౌడీ ఇన్స్పెక్టర్, పెదరాయుడు వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది పాకీజా. తెలుగులో ఆమె 50సినిమాల వరకు చేసిందట. అయితే ప్రస్తుతం ఆమె దీన స్థితిలో ఉన్నారని తెలుస్తోంది.

సినిమాలు మానేశాక నా సొంత ఊరు అయిన కారైకుడికి వెళ్లిపోయారు ఆమె. ఆ తర్వాత ఇప్పుడు ఇక్కడకు తిరిగి వచ్చేశారు. అయితే ఇన్ని సినిమాల్లో నటించినప్పటికీ పాకీజా కు సొంత ఇల్లుకూడా లేదట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. తన ఆర్ధిక పరిస్థితి బాలేదని.. సాయం చేయమని చాలా మంది సినిమా వాళ్ళను అడిగానని.. కానీ ఎవ్వరు కనికరించడం లేదు అని ఆవేదన వ్యక్తం చేశారు పాకీజా. తెలుగు తమిళ్ కలుపుకొని 150 సినిమాలు చేసినా కానీ చెన్నైలో సొంత ఇల్లు కట్టుకోలేకపోయాను అన్నారు. సాయం కోసం తమిళ్ నడిగర్ సంఘంతో పాటు అందరు హీరోలనూ సంప్రదించాను. అలాగే తమిళనాడు సీఎం కుమారుడు ఉదయనిధి స్టాలిన్ ను కూడా కలిసి తన పరిస్థితి వివరించిన కూడా ఎవ్వరు సాయం చేయడం లేదని అన్నారు.

ఇవి కూడా చదవండి
Pakeezah

Pakeezah

ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఈ ముగ్గురు అక్కాచెల్లెళ్ళతో ఆడిపాడిన హీరో ఎవరో తెల్సా...
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ఢిల్లీలో అంత్యక్రియలకు నోచుకుని ప్రధానమంత్రులు..!
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
ముగిసిన మూడో రోజు.. ఆసక్తిగా మారిన ఎంసీజీ ఫలితం
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
బ్రేక్ ఫాస్ట్ స్కీప్ చేసి ఎన్ని వ్యాధులకు వెల్కం చెబుతున్నారంటే..
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
నడుము అందాలతో మతిపోగొడుతున్న ఈ బ్యూటీ ఎవరో గుర్తుపట్టారా.?
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఏపీ ప్రయాణీకులకు పండుగలాంటి వార్త..
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
ఫ్రెండ్ పెళ్లి కోసం ఖమ్మం వచ్చిన విదేశీ దంపతులు.. పెళ్లింట సందడి
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
Video: ఆస్ట్రేలియా గడ్డపై తెలుగోడి వైల్డ్ సెలబ్రేషన్స్‌ చూశారా?
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
లాస్ట్ మినిట్‌లో తప్పించుకున్న కావ్య, రాజ్‌లు.. రుద్రాణి అనుమానం!
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..
ఆ రోజుల్లో టికెట్లు, టోకెన్లు లేని భక్తులు తిరుమలకు వెళ్లొద్దు..