Allu Arjun-Jr NTR: అల్లు అర్జున్, తారక్ రిజెక్ట్ చేశారు.. కట్ చేస్తే.. ఆ హీరో ఏకంగా బ్లాక్ బస్టర్ కొట్టాడు
సినిమా ఇండస్ట్రీలో కథలు చేతులు మారడమనేది కామన్. ఒక హీరో రిజెక్ట్ చేసిన స్టోరీలో మరొకరు హీరోగా నటించడం అనేది ఇక్కడ తరచూ జరుగుతుంటుంది. అలా ఒక్కోసారి రిజెక్ట్ చేసిన సినిమాలు భారీ డిజాస్టర్స్ అవుతుంటాయి..ఇంకో సారి ఎవరూ ఊహించని విధంగాఈ బ్లాక్ బస్టర్స్ అవుతుంటాయి.

అల్లు అర్జున్.. ప్రస్తుతం టాలీవుడ్ ఉన్న టాప్ హీరోస్. ఎన్నో ఏళ్లుగా సినిమాలు చేస్తున్న ఈ మెగా, నందమూరి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు ఉంది. అశేష సంఖ్యలో అభిమానులు కూడా ఉన్నారు. పుష్ప, పుష్ప 2 సినిమాలతో అల్లు అర్జున్ వరల్డ్ ఫేమస్ అయ్యాడు. ఇక ఆర్ఆర్ఆర్, దేవర సినిమాలతో తారక్ కు ప్రపంచ వ్యాప్తంగా అభిమానులు ఏర్పడ్డారు. ప్రస్తుతం అల్లు అర్జున్ అట్లీ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తుంటే, ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ తో ఓ మూవీ చేస్తున్నాడు. ఇవి కూడా పాన్ ఇండియా సినిమాలే. ఇప్పటికే ఈ చిత్రాలపై అంచనాలు పెరిగిపోయాయి. అయితే ఈ ఇద్దరూ టాప్ స్టార్స్ గతంలో ఒక బ్లాక్ బస్టర్ సినిమాను చేజేతులా వదులుకున్నార. చివరకు ఆ సినిమా వేరే హీరో దగ్గరకి వెళ్లిపోయింది. కట్ చేస్తే.. ఆ మూవీ బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ రికార్డులను తిరగరాసేసింది. సదరు హీరోకు ఎనలేని క్రేజ్ తెచ్చింది. ఇప్పటికీ ఈ సినిమా టీవీలో వస్తుంటే.. చాలా మంది ఛానెల్ మార్చకుండా చూసేస్తుంటారు. ఇప్పుడు కూడా ఈ సినిమా ట్రెండ్ అవుతోంది. ఎందుకంటే ఆ బ్లాక్ బస్టర్ మూవీ రిలీజై నేటికి సరిగ్గా 20 ఏళ్లు గడిచాయి. ఆ మూవీ మరేదో కాదు మాస్ మహారాజా నటించిన భద్ర.
ఊర మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను దర్శకత్వంలో తెరకెక్కిన భద్ర మూవీలో రవితేజ, మీరాజాస్మిన్ హీరో, హీరోయిన్లుగా నటించారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మించిన ఈ ఫ్యామిలీ అండ్ యాక్షన్ ఎంటర్ టైనర్ లో రవితేజ, ఈశ్వరి రావు, అర్జాన్ భజ్వా, ప్రదీప్ రావత్, సునీల్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. దేవి శ్రీ ప్రసాద్ అందించిన స్వరాలు సినిమా విజయంలో కీలక పాత్ర పోషించాయి. 2005 మే 12న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. అంటే నేటికి ఈ సినిమా విడుదలై 20ఏళ్లు పూర్తయింది. ఈ క్రమంలోనే భద్ర గురించి కొన్ని ఆసక్తికర విషయాలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. అందులో భాగంగానే అల్లు అర్జున్, తారక్ ఇద్దరూ ఈ సినిమా మిస్ చేసుకోవడంతో రవితేజ అకౌంట్ లోకి వెళ్లింది.
మొదట ఆర్య సినిమాకు కమిట్మెంట్ ఉండడంతో అల్లు అర్జున్ భద్ర సినిమాకు నో చెప్పాడట. ఆ తర్వాత కథ తారక్ దగ్గరికి వెళితే.. కొన్ని కారణాలతో రిజెక్ట్ చేశాడట. అయితే ఈ మూవీని ఎందుకు రిజెక్ట్ చేశానో ఇప్పటికీ బాధపడుతుంటాడట ఎన్టీఆర్.
20 ఏళ్ల భద్ర..
(@RaviTeja_offl) Annayya #Bhadra Cinema Nuvvu Kakunda Inkevaraina Chesunte Sure Ga Cinema ni Modda Gudipinchesetollu 💯 Peak Acting #Ravanna 🙌🔥#20YearsForBhadra #RaviTeja ♥️ pic.twitter.com/KmnqlkRSZg
— మాస్ మహా రాజా సూర్య 😎 (@SuryaHere1_) May 12, 2025
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




