Arya Movie: ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య సినిమాను అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు

కెరీర్ స్టార్టింగ్ లో వివి వినాయక్ దగ్గర అసిస్టెట్ డైరెక్టర్ గా పని చేసి ఆతర్వాత దర్శకుడిగా మారారు సుకుమార్ ఆర్య సినిమాతో సుకుమార్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా విడుదలై నేటికీ 20 ఏళ్లు. దిల్ సినిమా సమయంలో నిర్మాత దిల్ రాజుకు కథను వినిపించిన సుకుమార్ హీరోగా అల్లు అర్జున్ ను ఎంచుకున్నారు. దిల్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారట.

Arya Movie: ఆ హీరో చెయ్యాల్సిన ఆర్య సినిమాను అల్లు అర్జున్ చేసి బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు
Arya
Follow us
Rajeev Rayala

|

Updated on: May 07, 2024 | 11:35 AM

ఎక్కడో కాకినాడలో మ్యాథ్స్‌ లెక్చరర్‌గా పని చేసే సుకుమార్ ఇప్పుడు దర్శకుడిగా తన ప్రతిభను చాటుకుంటూ టాలీవుడ్ లో టాక్ డైరెక్టర్స్ లిస్ట్ లో చేరిపోయారు. ఆయన దర్శకత్వంలో వచ్చిన సినిమాలన్నీ మంచి విజయాలను అందుకున్నాయి. కెరీర్ స్టార్టింగ్ లో వివి వినాయక్ దగ్గర అసిస్టెట్ డైరెక్టర్ గా పని చేసి ఆతర్వాత దర్శకుడిగా మారారు సుకుమార్ ఆర్య సినిమాతో సుకుమార్ ఇండస్ట్రీకి దర్శకుడిగా పరిచయం అయ్యారు. ఈ సినిమా విడుదలై నేటికీ 20 ఏళ్లు. దిల్ సినిమా సమయంలో నిర్మాత దిల్ రాజుకు కథను వినిపించిన సుకుమార్ హీరోగా అల్లు అర్జున్ ను ఎంచుకున్నారు. దిల్ సక్సెస్ సెలబ్రేషన్స్ కు అల్లు అర్జున్ కూడా హాజరయ్యారట. ఆ సెలబ్రేషన్స్ లో బన్నీని చూసిన సుకుమార్. తన కథకు కరెక్ట్ గా సెట్ అవుతాడని దిల్ రాజుకు చెప్పారట.

అప్పటికే గంగోత్రి సినిమా చేసిన అల్లు అర్జున్ చాలా కథలను విని ఏది నచ్చక మంచి కథ కోసం ఎదురుచుస్తున్న సమయంలో సుకుమార్ ఈ కథను చెప్పారట. కథ నచ్చడంతో బన్నీ ఓకే చెప్పాడట.. అలాగే అల్లు అరవింద్, చిరంజీవి కూడా కథ విని ఓకే చెప్పడంతో ఆర్య సినిమా పట్టాలెక్కిందట. అయితే ఈ సినిమాలో ముందు మరో హీరోను అనుకున్నారట సుకుమార్. ఆ హీరో ఎవరో కాదు అల్లరి నరేష్.

గతంలో ఓ ఇంటర్వ్యూలో అల్లరి నరేష్ ఈ విషయాన్నీ తెలిపారు. అతన అల్లరి సినిమా చూసి తాను రాసుకున్న ఆర్య సినిమాకు హీరోగా బాగుంటారని చెప్పారట. కానీ అది కుదరలేదు. ఆతర్వాత బన్నీకి ఆ ఛాన్స్ వచ్చిందట. ఇక ఆర్య సినిమా అందమైన ప్రేమకథగా తెరకెక్కింది. ఈ సినిమాలో అల్లు అర్జున్ క్యారెక్టర్ చాలా డిఫరెంట్ గా ఉంటుంది. ఈ సినిమాలోని పాటలు కూడా సూపర్ హిట్ అయ్యాయి. దేవీ శ్రీ అందించిన సంగీతం సినిమాకే హైలైట్. ఇప్పటికీ ఈ సినిమా సాంగ్స్ వినిపిస్తూనే ఉంటాయి. ఇక అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో ఆర్య 2, పుష్ప సినిమాలు తెరకెక్కాయి. ఇప్పుడు పుష్ప 2 సినిమా చేస్తున్నారు. పుష్ప పాన్ ఇండియా హిట్ గా నిలిచింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.