AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Ramya Krishnan: ఇదేందయ్యా ఇది..! రమ్యకృష్ణ ఆ స్టార్ నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించారా..!!

నటనతో పాటు తన గ్లామర్ తో అప్పటి కుర్రాళ్లను కిర్రెక్కించారు రమ్యకృష్ణ. ఈ ముద్దుగుమ్మ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ కలిపి దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించారు రమ్యకృష్ణ. అప్పటి యూత్ రమ్యకృష్ణ అంటే పడి చచ్చిపోయేవారు. కేవలం రమ్యకృష్ణను చూడటానికే సినిమాకు వెళ్లేవారు కూడా ఉన్నారు.

Ramya Krishnan: ఇదేందయ్యా ఇది..! రమ్యకృష్ణ ఆ స్టార్ నటుడికి కూతురిగా, చెల్లిగా, భార్యగా నటించారా..!!
Ramyakrishna
Rajeev Rayala
|

Updated on: Jul 26, 2024 | 7:19 PM

Share

స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్ లో దూసుకుపోతున్నారు. అప్పటిలో రమ్యకృష్ణ టాలీవుడ్ ను దున్నేశారు. అప్పట్లో ఏ సినిమా చూసినా ఆమె కనిపించేవారు. నటనతో పాటు తన గ్లామర్ తో అప్పటి కుర్రాళ్లను కిర్రెక్కించారు రమ్యకృష్ణ. ఈ ముద్దుగుమ్మ ఎన్నో అద్భుతమైన సినిమాల్లో నటించి మెప్పించారు. తెలుగు, తమిళ్ కలిపి దాదాపు అందరు స్టార్ హీరోలతో సినిమాలు చేసి మెప్పించారు రమ్యకృష్ణ. అప్పటి యూత్ రమ్యకృష్ణ అంటే పడి చచ్చిపోయేవారు. కేవలం రమ్యకృష్ణను చూడటానికే సినిమాకు వెళ్లేవారు కూడా ఉన్నారు. పాత్ర ఏదైనా తనదైన నటనతో ప్రేక్షకులను మెప్పించారు రమ్యకృష్ణ. ఈ సీనియర్ బ్యూటీ నటనకు ఉదాహరణగా చెప్పాలంటే చాలా సినిమాలు ఉన్నాయి. ముఖ్యంగా నరసింహ సినిమాలో రజినీకాంత్ తో పోటీ పడి నటించారు ఆమె.

ఇది కూడా చదవండి : Tamannaah: అమ్మబాబోయ్..! తమన్నా ఇరగదీసిందిగా.. ఈ సాంగ్ చూస్తే పిచ్చెక్కాల్సిందే

తన కెరీర్ లో ఎన్నో వైవిధ్యమైన పాత్రలు చేసి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు రమ్యకృష్ణ. ఇదిలా ఉంటే ఈ స్టార్ హీరోయిన్ ఓ నటుడికి కూతురిగా, చెల్లెలిగా, అలాగే భార్యగా కూడా నటించారు. సినిమాల్లో ఇలాంటి చాలా కామన్ మనం అక్కడ ఉన్న పాత్రను బట్టే నటించాలి. అలాగే రమ్యకృష్ణ కూడా ఓ నటుడికి ఇలా కూతురిగాఎం చెల్లెలిగా, భార్య గా నటించి మెప్పించారు. ఆయన ఎవరో కాదు వర్సటైల్ నటుడు నాజర్.

ఇది కూడా చదవండి : Bigg Boss Telugu 8: బిగ్ బాస్‌లోకి అమ్మాయిల డ్రీమ్ బాయ్.. ఈ స్టార్ హీరో ఎంట్రీ పక్క అంటగా..!

అవును నాజర్ తో రమ్యకృష్ణ చాలా సినిమాల్లో నటించారు. తమిళ్ సినిమా వంత రాజవతాన్ వరువేన్ లో రమ్యకృష్ణ నాజర్ కూతురిగా నటించారు. అలాగే సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటించిన నరసింహ సినిమాలో నాజర్ చెల్లెలు నీలాంబరిగా అద్భుతంగా నటించారు. అలాగే దర్శక ధీరుడు రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన బాహుబలి సినిమాలో రమ్యకృష్ణ శివగామి పాత్ర చేయగా ఆమె భర్త బిజ్జల దేవుడుగా నటించారు. ఇలా రమ్యకృష్ణ నాజర్ కు కూతురిగా, చెల్లిగా, అలాగే భార్యగా నటించి మెప్పించారు.ఇక ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ లో రమ్యకృష్ణ అమ్మగా, వదినగా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. రీసెంట్ గా గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబు అమ్మగా నటించారు. అటు నాజర్ కూడా విలక్షణమైన పాత్రలు చేస్తూ రాణిస్తున్నారు.

Actor Nassar

Actor Nassar

రమ్యకృష్ణ ఇన్ స్టా..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి