AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా అవకాశాల్లేని తెలుగు బోల్డ్ హీరోయిన్

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండూ ఉండాల్సిందే. వీటికి తోడు ఆవగింజంతైనా అదృష్టం ఉండాల్సిందే. ముఖ్యంగా సినిమా హీరోయిన్ల విషయంలో ఈ లెక్కలు కచ్చితంగా ఉంటాయి. లేకుంటే అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అవకాశాల్లేక ఇబ్బంది పడతారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది

Tollywood: ఈ అమ్మాయిని గుర్తు పట్టారా? అందం, అభినయం ఉన్నా అవకాశాల్లేని తెలుగు బోల్డ్ హీరోయిన్
Tollywood Actress Childhood Photo
Basha Shek
|

Updated on: Jul 26, 2024 | 7:22 PM

Share

సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో రాణించాలంటే అందం, అభినయం రెండూ ఉండాల్సిందే. వీటికి తోడు ఆవగింజంతైనా అదృష్టం ఉండాల్సిందే. ముఖ్యంగా సినిమా హీరోయిన్ల విషయంలో ఈ లెక్కలు కచ్చితంగా ఉంటాయి. లేకుంటే అందం, అభినయం పుష్కలంగా ఉన్నా అవకాశాల్లేక ఇబ్బంది పడతారు. పై ఫొటోలో ఉన్న హీరోయిన్ సరిగ్గా ఈ కోవకే చెందుతుంది. తెలుగునాటకు చెందిన ఈ ముద్దుగుమ్మకు అందం, అభినయం రెండూ ఉన్నాయి. కానీ సినిమా ఛాన్సులు మాత్రం రావడం లేదు. అందుకే సినిమాల్లో ఎక్కువగా హీరోయిన్ ఫ్రెండ్ గానో, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది. కొన్ని సినిమాల్లో సెకెండ్ హీరోయిన్ రోల్స్ పోషించినా గుర్తింపు రాలేదు.ఇప్పుడు అ అరకొర అవకాశాలు కూడా రావట్లేదు. అయితే ఈ అమ్మడికి సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ క్రేజ్ ఉంటోంది. తన గ్లామరస్ ఫొటోలు, వీడియోలతో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం టీవీషోలకే పరిమితమైన ఈ తెలుగందాన్ని గుర్తు పట్టారా? కష్టంగా ఉందా? అయితే సమాధానం మేమే చెబుతాం లెండీ.. ఈ క్యూటీ మరెవరో కాదు తేజస్విని మదివాడ. ఇది ఆమె చిన్న నాటి ఫొటో. ఇటీవల పుట్టిన రోజు సందర్భంగా తేజస్విని కి సంబంధించిన చిన్ననాటి, అరుదైన ఫొటోలు నెట్టింట దర్శనమిచ్చాయి. అందులోదే ఈ ఫొటో.

ఇవి కూడా చదవండి

తేజస్విని డ్యాన్సర్ గా చేస్తూనే.. సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. మహేశ్ బాబు నటించిన సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో ఈ భామకు ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు వచ్చింది. ఆర్జీవీ తెరకెక్కించిన ఐస్ క్రీమ్ సినిమాలో సోలో హీరోయిన్ గా నటించినా, ఆ తర్వాత సెకెండ్ ఫీమెల్ లీడ్, క్యారెక్టర్ ఆర్టిస్టుగానే ఎక్కువగా కనిపించింది. అయితే గత రెండేళ్లుగా ఈ ముద్దుగుమ్మ ఒక్క సినిమాలోనూ కనిపించలేదు.

బిగ్ బాస్ హౌజ్ లో  లో అడుగు పెట్టి బుల్లితెర ఆడియెన్స్ కు చేరువైన తేజస్వి మదివాడ ప్రస్తుతం టీవీ షోలతో బిజీబిజీగా ఉంటోంది. అలాగే పలు సినిమా ఫంక్షన్లలోనూ సందడి చేస్తోంటోంది. ఇక సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్ గా ఉంటుందీ అమ్మడు. నిత్యం తన లేటెస్ట్ ఫొటోస్, వీడియోలను షేర్ చేస్తూ ఫాలోవర్లతో టచ్ లో ఉంటోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us