AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే ఆ హీరో సంచలనం..

ఎప్పుడూ నటుడు కావాలని కలలు కనేవాడు. మధ్యతరగతి వారికి రంగుల ప్రపంచం కలలు కనడం కాస్త ఖరీదైంది. కాలేజ్ పూర్తి చేసిన వెంటనే సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీ రోజుల్లో చదువుతో పాటు పలు ఉద్యోగాలు చేశాడు. నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు వాటర్ బాటిల్స్ అమ్మేవాడు. అంతేకాదు హోటళ్లలో కూడా పనిచేశాడు. ఎన్నో అడ్డంకులు.. కష్టాలు ఎదుర్కొని సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

Tollywood: వాటర్ బాటిల్స్ అమ్మి.. హోటల్లో పనిచేసిన కుర్రాడు.. కట్ చేస్తే.. ఇండస్ట్రీలోనే ఆ హీరో సంచలనం..
Actor
Rajitha Chanti
|

Updated on: Apr 18, 2024 | 8:55 PM

Share

మూడేళ్ల క్రితం కన్నడ ప్రజలకు మాత్రమే తెలిసిన నటుడు రిషబ్ శెట్టి ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా మారిపోయాడు. ‘కాంతార’ మూవీలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకుల హృదయాల్లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నాడు. స్వీయ దర్శకత్వంలో రిషబ్ శెట్టి నటన దేశవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులను కట్టిపడేసింది. ముందుగా కన్నడ ఇండస్ట్రీలో భారీ విజయాన్ని అందుకున్న ఆ సినిమా.. ఆ తర్వాత తెలుగు, తమిళం, మలయాళం, హిందీ భాషలలో రిలీజ్ అయి భారీగా వసూళ్లు రాబట్టింది. అయితే ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఎంతో మంది అభిమాన హీరోగా మారిన రిషబ్ సినిమా ప్రయాణం అంత ఈజీ కాదు. ఈ స్థాయికి రావడానికి చాలా కష్టపడ్డాడు. రిషబ్ శెట్టి ఎప్పుడూ నటుడు కావాలని కలలు కనేవాడు. మధ్యతరగతి వారికి రంగుల ప్రపంచం కలలు కనడం కాస్త ఖరీదైంది. రిషబ్ కాలేజ్ పూర్తి చేసిన వెంటనే సినిమా రంగంలోకి రావాలని నిర్ణయించుకున్నాడు. కాలేజీ రోజుల్లో చదువుతో పాటు పలు ఉద్యోగాలు చేశాడు. నటుడిగా సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టకముందు రిషబ్ శెట్టి వాటర్ బాటిల్స్ అమ్మేవాడు. అంతేకాదు హోటళ్లలో కూడా పనిచేశాడు. ఎన్నో అడ్డంకులు.. కష్టాలు ఎదుర్కొని సినిమాల్లోనూ తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు.

రిషబ్ శెట్టి 6వ తరగతి చదువుతున్నప్పుడే ఆర్టిస్ట్‌గా తన ప్రయాణాన్ని ప్రారంభించాడు. అప్పటి నుంచి నా ప్రాంతంలోని జానపద కథలను ప్రజల ముందుకు తీసుకురావాలనేది తన కల అని రిషబ్ శెట్టి చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చారు.6వ తరగతి చదువుతున్నప్పుడే యక్షగానంపై ఆసక్తి పెంచుకున్నాడు. వేదికపై పెయింట్‌తో యక్షగాన ప్రదర్శనలు కూడా చేశారు. మొదట్లో చిన్న చిన్న పాత్రలు పోషించాడు. సినిమాల గురించి తెలుసుకోవడానికి తెరవెనుక పనిచేయడం మొదలుపెట్టాడు. అలాగే అనేక చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. 2019లో బెల్ బాటమ్ సినిమాతో హీరోగా పరిచయమయ్యాడు. రిషబ్ శెట్టి ప్రతిభావంతుడైన కన్నడ కళాకారుడు. రచయితగా, దర్శకుడిగా, నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నాడు.

2016లో రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కిరిక్ పార్టీ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది. ఇందులో రష్మిక మందన్నా, రక్షిత్ శెట్టి జంటగా నటించారు. 2022లో కాంతార సినిమాతో సూపర్ హిట్ అందుకున్నారు. రిషబ్ నటనపై ప్రశంసలు కురిపించారు. ప్రేక్షకులే కాకుండా భారతీయ సినిమాకు చెందిన పలువురు స్టార్ నటీనటులు రిషబ్ శెట్టిని ప్రశంసించారు. ఈ సినిమా కన్నడలోనే కాకుండా హిందీ, తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో కూడా మంచి విజయం సాధించింది. ప్రస్తుతం కాంతార 2 మూవీని తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే భారీ హైప్ నెలకొంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.