Shruti Haasan: బ్రేకప్ స్టోరీ.. మరోసారి ప్రియుడితో తెగదెంపులు చేసుకున్న శ్రుతి హాసన్.?
ఇలా లవ్, బ్రేకప్.. పెళ్లి, విడాకులు అంటూ ఎదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. కొంతమంది చక్కగా పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీస్ తో సెటిల్ అవుతుంటే చాలా మంది బ్రేకప్స్ అంటూ విడిపోతున్నారు.
రీసెంట్ డేస్ లో లవ్, బ్రేకప్.. పెళ్లి, విడాకులు అనేవి చాలా కామన్ అయ్యాయి. సినిమా తరాల విషయంలో మరీనూ.. చాలా మంది సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వారు ఇలా లవ్, బ్రేకప్.. పెళ్లి, విడాకులు అంటూ ఎదో రకంగా వార్తల్లో నిలుస్తున్నారు. కొంతమంది చక్కగా పెళ్లిళ్లు చేసుకొని ఫ్యామిలీస్ తో సెటిల్ అవుతుంటే చాలా మంది బ్రేకప్స్ అంటూ విడిపోతున్నారు. ఈ విషయంలో లోకనాయకుడు కుమార్తె శ్రుతిహాసన్ కూడా ఉన్నారు. కమల్ వారసురాలిగా ఇండస్ట్రీకి పరిచయమైనా శ్రుతి. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటించిన గబ్బర్ సింగ్ సినిమాతో హీరోయిన్ గా హిట్ అందుకుంది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. ఇక ఈ అమ్మడు ఇప్పటికే పలుసార్లు లవ్ లో పడింది. అప్పుడెప్పుడో స్కూల్ డేస్ లో ఒక అబ్బాయిని లవ్ చేశాను అని తెలిపింది శ్రుతి. ఇక కెరీర్ స్టార్టింగ్ లో హీరో సిద్దార్థ్ తో ప్రేమలో పడిందని వార్తలు జోరుగా ప్రచారం అయ్యాయి.
ఆ తర్వాత లండన్ బేస్డ్ మైకేల్ కోర్సల్‌తో ప్రేమలో పడింది. అతడితో చట్టపట్టాలేసుకు తిరిగింది. అంతే కాదు. అతడిని ఇండియాకు తీసుకువచ్చి తన ఫ్యామిలీకి కూడా పరిచయం చేసింది. ఆ తరవాత అతడితో తెగదెంపులు చేసుకుంది. సడన్ గా బ్రేకప్ అంటూ ట్విస్ట్ ఇచ్చింది. ఇక కొంతకాలానికి మరోసారి ప్రేమలో పడింది శ్రుతి హాసన్.
ఈసారి డూడుల్ ఆర్టిస్ట్ శాంతను హజారికా అనే వ్యక్తిని ప్రేమించింది. కొంతకాలంగా ఈ ఇద్దరు కలిసి ఉంటున్నారు. తన ప్రియుడితో కలిసి ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హంగామా చేసింది శ్రుతి. ఇక ఇప్పుడు ఇతగాడితో కూడా బ్రేకప్ అయినట్టు తెలుస్తోంది. ఈ అమ్మడు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన పోస్ట్ చూస్తే అది అర్ధమవుతోంది. ఇటీవల తన ఇన్స్టాలో ‘నాతో నేను ఉంటేనే సంతోషం.. నా విలువైన సమయాన్ని, ఒంటరితనాన్ని ప్రేమిస్తున్నాను.. జీవితంలో ఇక్కడి వరకూ రావడమే గొప్ప అదృష్టం.. అందుకు థ్యాంక్స్.. ఎట్టకేలకు నాకు ఆ విషయం అర్ధమైంది’’ అంటూ రాసుకొచ్చింది. దాంతో శ్రుతి మరోసారి ప్రేమలో విఫలమైందని అంటున్నారు నెటిజన్లు.
View this post on Instagram
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.