Vishal: స్టార్ హీరో సినిమాను రిజక్ట్ చేసిన విశాల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.

ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ లాఠీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచాయి

Vishal: స్టార్ హీరో సినిమాను రిజక్ట్ చేసిన విశాల్.. కారణం తెలిస్తే షాక్ అవుతారు.
Vishal
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 13, 2022 | 7:23 AM

విశాల్ ఇప్పటికే స్టార్ హీరోగా కంటిన్యూ అవుతున్నాడు. హిట్లు ఫ్లాప్ లతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేస్తూ రాణిస్తున్నాడు. సినిమా సినిమాకు ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా పనిచేస్తూ పోతున్నాడు. ఇక విశాల్ నటించిన లేటెస్ట్ మూవీ లాఠీ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో విశాల్ పోలీస్ కానిస్టేబుల్ గా కనిపించనున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్ సినిమా పై ఆసక్తిని పెంచాయి. ఇక ఈ సినిమా షూటింగ్ లో పలుసార్లు గాయపడ్డాడు కూడా. ఇదిలా ఉంటే విశాల్ ఓ భారీ ఆఫర్ ను రిజక్ట్ చేశాడని కొంతకాలంగా వార్తలు వస్తున్నాయి. విశాల్ ఓ స్టార్ హీరో సినిమాలో విలన్ గా నటించమని సంప్రదిస్తే ఆయన నో చెప్పారట. పెద్ద హీరో, స్టార్ డైరెక్టర్ మూవీ అయినా కూడా విశాల్ ఒప్పుకోలేదని టాక్ కోలీవుడ్ లో వినిపిస్తోంది. ఇంతకు ఆ హీరో ఎవరో తెలుసా..?

విశాల్ వదులుకున్న సినిమా ఎవరిదో కాదు దళపతి విజయ్ మూవీ. లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విజయ్ త్వరలో ఓ సినిమా చేయనున్నారు.  ‘ఖైదీ, మాస్టర్, విక్రమ్ వంటి సూపర్ హిట్ సినిమాలు తెరకెక్కించిన లోకేష్ కానగరాజ్ ఇప్పుడు దళపతి విజయ్ తో మరో సినిమా చేయడానికి రెడీగా ఉన్నారు. ఈ సినిమాలో పాత్ర కోసం విశాల్ ను సంప్రదించారట.

ఇవి కూడా చదవండి

లోకేష్ సినిమాల్లో విలన్ పాత్రలు చాలా పవర్ ఫుల్ గా ఉంటాయి. ఇందుకోసమే స్టార్ హీరోలను తన సినిమాల్లో విలన్స్ గా పెట్టుకుంటూ ఉంటాడు. ఈ క్రమంలోనే విజయ్ సినిమాలో విశాల్ ను విలన్ పాత్ర కోసం సంప్రదించాడట. అయితే దానికి విశాల్ నో చెప్పాడని తెలుస్తోంది. ప్రస్తుతం వరుస సినిమాలు లైనప్ చేయడంతో డేట్స్ అడ్జెస్ట్ కాకపోవడంతోనే నో చెప్పాల్సి వచ్చిందట. అయితే  విశాల్ ఇప్పటికే  నిర్మాతగా, హీరోగానే కాకుండా దర్శకుడిగానూ  తన టాలెంట్ చాటుకున్న విషయం తెలిసిందే. అయితే  త్వరలో ఆయన విజయ్ తో ఒక మూవీని డైరెక్ట్ చేయాలనీ అనుకుంటున్నారట. ప్రస్తుతం విశాల్ లైనప్ చేసిన సినిమాలు పూర్తయిన వెంటనే విజయ్ తో విశాల్ సినిమా చేస్తారట.

ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రధాని మోదీ తొలి పాడ్‌కాస్ట్‌లో పంచుకున్న ఆసక్తికర విషయాలు
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
ప్రమాణ స్వీకారానికి ముందు ట్రంప్‌కు బిగ్‌ రిలీఫ్‌.. దోషే కానీ..
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
కేవలం 4 గంటల్లోనే పర్సనల్ లోన్.. ప్రభుత్వ ఈ పథకం గురించి తెలుసా?
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
అవిసె గింజలతో ఆరోగ్యమే కాదు, రెట్టింపు అందం మీ సొంతం..!ఇలా వాడితే
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
153 కిమీల వేగంతో బౌలింగ్.. రిటైర్మెంట్‌తో షాకిచ్చిన ధోని దోస్త్
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
రాజకీయాల్లోకి రావాలంటే బాగా డబ్బుండాలా? ప్రధాని మోడీ ఆన్సర్ ఇదిగో
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
జాలి లేదా భయ్యా.. 6 సిక్సర్లు, 4 ఫోర్లు.. 38 బంతుల్లో ఆగమాగం
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
మోకాళ్ల మీద తిరుమల మెట్లు ఎక్కిన టాలీవుడ్ హీరోయిన్..
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
ఇటిఎఫ్‌లో ఎందుకు పెట్టుబడి పెట్టాలి? ప్రయోజనాలు ఏంటి?
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..
Team India: మిథాలీ రికార్డ్ బ్రేక్ చేసిన లేడీ కోహ్లీ..