HIT 2 : కలెక్షన్స్ కంటిన్యూ.. దుమ్మురేపుతున్న హిట్2.. ఇప్పటివరకు ఎంత వసూల్ చేసిందంటే
రీసెంట్ గా హిట్2 సినిమా తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్2 సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది.
యంగ్ హీరో అడవి శేష్ బ్యాక్ టు బ్యాక్ హిట్స్ తో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఇప్పటికే మేజర్ సినిమాతో పాన్ ఇండియా రేంజ్ హిట్ అందుకున్న శేష్. రీసెంట్ గా హిట్2 సినిమా తో మరో హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు. హిట్2 సినిమా ఈ నెల 2న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ఈ సినిమా సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. ఈ మూవీకి నేచురల్ స్టార్ నాని నిర్మాతగా వ్యవహరించారు. శైలేష్ కుమార్ హిట్ 2ని డైరెక్ట్ చేశారు. గతంలో వచ్చిన హిట్ సినిమాకు ఇది కొనసాగింపు. ఇక ఈ సినిమాతో సాలిడ్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు శేష్. సినిమా హిట్ కావడంతో చిత్రయూనిట్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఓ సక్సెస్ ఫుల్ సినిమాకు సీక్వెల్ అన్నపుడు కచ్చితంగా ఆ ప్రెజర్ ఉంటుంది. దాన్ని సరిగ్గా హ్యాండిల్ చేసి.. అంచనాలు అందుకుంటేనే రిజల్ట్ పాజిటివ్‌గా ఉంటుంది. ఈ విషయంలో ‘హిట్’ దర్శకుడు శేలేష్ కొలను సక్సెస్ అయ్యాడు. ఈ సినిమా తర్వాత హిట్ 3 కూడా రాబోతోంది.
వరల్డ్ వైడ్ ఓపెనింగ్ డే కలెక్షన్ రూ.11.8 కోట్లతో గ్రాండ్‌గా పోటీలో నిలిచిన హిట్-2 మూవీ.. వీకెండ్స్‌లో రూ.8.05 కోట్లు, రూ.7.15 కోట్లని కలెక్ట్ చేసింది. హిట్ -2 మూవీ వరల్డ్‌వైడ్ శని, ఆదివారం రూ.1.40 కోట్లు, రూ.1.45 కోట్లతో అదరగొట్టింది. ఓవరాల్‌గా ఇప్పటికే హిట్-2 మూవీ కలెక్ట్ చేసిన మొత్తం గ్రాస్ రూ.39 కోట్లు వసూల్ చేసిందని ట్రేడ్ వర్గాలు చెప్తున్నాయి. అలాగే తెలుగు రాష్ట్రాల్లో రూ.24 కోట్లని కలెక్ట్ చేసిన హిట్-2 మూవీ.. ఓవర్సీస్‌లో రూ.10 కోట్లు, ఇతర ప్రాంతాల్లో రూ. 5 కోట్ల వరకూ కలెక్ట్ చేసినట్లు బాక్సాఫీస్ లెక్కలు చెప్తున్నాయి.