Nora Fatehi-Jacqueline Fernandez: మనీలాండరింగ్ వివాదంలో ముద్దుగుమ్మలు.. జాక్వెలిన్ పై పరువునష్టం దావా వేసిన నోరా ఫతేహి
ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్ర శేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి
బాలీవుడ్ బ్యూటీ జాక్వెలిన్ ఫెర్నాండేజ్ ను మనీలాండరింగ్ వివాదం వదిలేలా లేదు. ఈ కేసులో చిక్కుకున్న ఈ బ్యూటీ ఇప్పటికే పలుసార్లు విచారణకు హాజరయ్యింది. రూ.200 కోట్ల బెదిరింపు కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పేరును ఛార్జ్‌షీట్‌లో దాఖలు చేశారు. ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ నమోదు చేసిన సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌లో జాక్వెలిన్ పేరును చేర్చారు. ఆర్థిక నేరస్థుడు సుకేశ్ చంద్ర శేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన గిఫ్ట్‌లు అందుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇప్పటికే జాక్వెలిన్‌కు చెందిన 7 కోట్ల ఆస్తుల్ని ఈడీ అటాచ్ చేసింది. మనీల్యాండరింగ్ కేసులో ప్రధాన నిందితుడైన సుకేశ్ నుంచి నటి జాక్వెలిన్ పలు ఖరీదైన వస్తువుల్ని తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈడీ విచారణలో మరో నటి నోరా ఫతేహి పేరుకూడా చెప్పింది జాక్వలిన్ . అలాగే సుకేశ్ నుంచి ఖరీదైన బహుమతులు అందుకున్నానని కూడా ఒప్పుకుంది . ఇదిలా ఉంటే ఇప్పుడు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ పై నోరా ఫతేహి పరువు నష్టం దావా వేసింది.
కాగా ఈడీ అధికారులు జాక్వెలిన్ ఫెర్నాండేజ్ విచారించగా..నటి నోరా ఫతేహి కూడా సుఖేష్ నుంచి బహుమతులు తీసుకున్న వారిలో ఉందని స్టేట్‌మెంట్ ఇచ్చింది. దాంతో నోరా ఫతేహిని కూడా ఈడీ విచారించింది. సుకేష్ చంద్రశేఖర్ నుంచి తాను ఎలాంటి బహుమతుల్ని తీసుకోలేదని నోరా అంటుంది. కావాలనే జాక్వెలిన్ తనను ఈ కేసులోకి లాగుతుందని నోరా ఆరోపించింది.
కాగా జాక్వెలిన్ ఇచ్చిన స్టేట్‌మెంట్ ఆమె కెరీర్ పై ఎఫెక్ట్ చూపుతుందని ఇప్పటికి కొన్ని షోలు, యాడ్స్ చేసే అవకాశం తనకి చేజారినట్లు నోరా ఫతేహి ఆవేదన వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో ఢిల్లీ కోర్టులో జాక్వెలిన్ పై రూ.200 కోట్లకి పరువు నష్టం దాఖలు చేసింది నోరా. మరి ఈ వివాదం ఇంకేంత ముదురుతుందో చూడాలి.