AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nora VS Jacqueline: ఇరువురి భామల గొడవలో ఇరుక్కున్న బాలీవుడ్ కండల వీరుడు.. సల్మాన్ మధ్య వర్తిత్వంకి నో అన్న నోరా..

ఇటీవల ఈడీ అధికారులు ఈ బ్యూటీకి క్లీన్ చీట్ ఇవ్వడంతో.. కోలుకున్న నోరా.. తాజాగా జాక్వెలిన్ కావాలనే తనను ఈ కేసులో విచారించారని ఆరోపించింది. ఆరోపించడమే కాదు.. ఆమెపై పరువు నష్టం దావాను కూడా ఫైల్ చేసింది.

Nora VS Jacqueline: ఇరువురి భామల గొడవలో ఇరుక్కున్న బాలీవుడ్ కండల వీరుడు.. సల్మాన్ మధ్య వర్తిత్వంకి నో అన్న నోరా..
Nora Fatehi Vs Jacqueline
Surya Kala
|

Updated on: Dec 13, 2022 | 6:39 PM

Share

బాలీవుడ్ ఐటెం భామ నోరా తీరు.. ఇప్పుడందర్నీ నోరెళ్ల బెట్టేలా చేస్తోంది. మరో స్టార్ హీరోయిన్ జాక్వెలిన్ పై పెట్టిన కేసు ఇప్పుడు బీ టౌన్‌లో హాట్ టాపిక్‌గా మారింది. వీరిద్దరి మధ్య తీవ్ర గొడవ రగిలేలా చేస్తూనే.. మధ్యలో కండల వీరుడు సల్మాన్ ఖాన్ మెడకు చుట్టుకునే వరకు వెళ్లింది. ఈ ఇయర్ బిగినింగ్‌ లోనే… 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో దోషిగా తేలారు సుఖేష్ చంద్ర. ఆయనతో పాటే.. ఆయన గర్ల్‌ ఫ్రెండ్ బాలీవుడ్ హీరోయిన్ జాక్వెలిన్ కూడా ఇదే కేసులో ఇరుక్కున్నది.  ఈడీ నుంచి విచారణ కూడా ఎదుర్కొంటూనే కోర్టుల చుట్టూ తిరుగుతోంది.

ఈ క్రమంలోనే ఈడీ అధికారులు మరో బాలీవుడ్ బ్యూటీ నోరా ఫతేహీని కూడా ఇదే కేసులో విచారించారు. తమ విచారణలో జాక్వెలిన్.. నోరా పేరు చెప్పబట్టే విచ్చారించామనే చిన్న హింట్ కూడా ఈ అధికారులు ఇచ్చారు. దీంతో నోరా కూడా ఈ కేసులో దోషి అనే న్యూస్ త్రూ అవుట్ ఇండియా తెగ వైరల్ అయింది. ఆమెను డిప్రరెషన్‌కు గురయ్యేలా.. ఆమె ఛాన్సులు దెబ్బతీసేలా చేసింది.

అయితే ఇటీవల ఈడీ అధికారులు ఈ బ్యూటీకి క్లీన్ చీట్ ఇవ్వడంతో.. కోలుకున్న నోరా.. తాజాగా జాక్వెలిన్ కావాలనే తనను ఈ కేసులో విచారించారని ఆరోపించింది. ఆరోపించడమే కాదు.. ఆమెపై పరువు నష్టం దావాను కూడా ఫైల్ చేసింది. ఇప్పుడు ఇదే బాలీవుడ్‌ను స్టన్‌ అయ్యేలా చేసింది.

ఇవి కూడా చదవండి

అయితే బీ టౌన్‌ ఇంటర్నల్ సోర్స్‌ ప్రకారం.. నోరాను కాస్త కూల్ చేసేందుకు.. తనపై ఫైల్ చేసిన కేసును విత్ డ్రా చేసుకునేందుకు జాక్వెలిన్ సల్మాన్ దగ్గరకు వెళ్లారట. మధ్యే వర్తిగా ఈ సమస్యను సాల్వ్ చేయాలని కోరరట. కాని సల్మాన్ మాటను నోరా సున్నితంగా తిరస్కరిస్తున్నట్టు బీ టౌన్‌ లో పుకార్ . ఇక ఈ విషయం బయటికి రావడంతో.. హీరోయిన్ల కొట్లాటలో.. సల్మాన్ ఇరుక్కుపోయాడనే కామెంట్స్ కాస్త గట్టిగానే వినిపిస్తున్నాయి. ఈ బాబును కూడా తలపట్టుకునేలా చేస్తున్నాయి.

మరిన్ని ఎంటర్టైన్‌మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..