OTT Movie : సినిమా ఆశ చూపి హత్యలు.. రియల్ స్టోరీతో తెరకెక్కిన మూవీ.. ఎక్కడ చూడొచ్చంటే
ఎప్పటిలాగే ఈ వారం కూడా ఓటీటీల్లోకి పలు సూపర్ హిట్ సినిమాలు, వెబ్ సిరీస్ లు రానున్నాయి. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడం, మలయాళం తదితర ప్రధాన భాషలకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్ లు ఓటీటీ ఆడియెన్స్ కు వినోదం పంచుతున్నాయి.

వారం వారం ఓటీటీల్లో ఎన్నో సినిమాలు, వెబ్ సిరీస్లువిడుదలై విడుదలై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. కానీ వాటిలో కొన్ని క్రేజీ సినిమాలు, సిరీస్‌లు మాత్రమే ప్రేక్షకులకు నచ్చి ట్రెండింగ్ జాబితాలోకి చేరతాయి. ముఖ్యంగా హారర్, రొమాంటిక్, థ్రిల్లర్ సినిమాలు ప్రేక్షకులను విశేషంగా అలరిస్తున్నాయి. ఇక థ్రిల్లర్ సినిమాలు ఇప్పటికే చాలా ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. ఇక వాటిలో సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఆడియన్స్ ను అలరిస్తుంది. ఈ సినిమాలో థ్రిల్లర్ అంశాలు మాత్రమే కాదు.. రొమాన్స్, హారర్, కామెడీ, సస్పెన్స్ ఎలిమెంట్స్ కావాల్సినన్ని ఉన్నాయి. అంతే కాదు ఈ సినిమా కథ రియల్ గా జరిగిన క్రైమ్ స్టోరీ. 2021లో కేరళలో జరిగిన ఒక యదార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు. ఒరిజినల్ తమిళ్ వెర్షన్ అయినప్పటికీ ఓటీటీలో తెలుగు తో పాటు వివిధ భాషల్లోనూ అందుబాటులో ఉంది.
ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ పేరు ‘స్టీఫెన్’. ఈ సినిమా ఒక్కసారి చూడటం మొదలుపెడితే, సినిమా మొత్తం పూర్తయ్యే వరకు కూర్చున్న చోట నుంచి కదిలారు. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాలో గోమతి శంకర్ ప్రధాన పాత్రలో నటించాడు.. మిథున్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ట్విస్ట్ లు, ఊహించని సన్నివేశాలు ఆడియన్స్ ఆశ్చర్యపరుస్తాయి. ఇక ఈ మూవీ క్లైమాక్స్ అయితే ఎవరూ ఊహించలేరు. ఊహించని ట్విస్ట్ ఉంటుంది. ఇక సినిమా కథ విషయానికి వస్తే.. స్టీఫెన్ జబరాజ్ అనే కుర్రాడు.. సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానని ఏకంగా తొమ్మిది మంది అమ్మాయిలని దారుణంగా హత్య చేస్తాడు. తీరా పోలీసులు ఇతడిని పట్టుకుందామని అనుకునేసరికి దగ్గరలోని పోలీస్ స్టేషన్ కు వెళ్లి లొంగిపోతాడు. కోర్టుల్లోనూ ఇదే విషయాన్ని ఒప్పుకొంటాడు. దీంతో పోలీసులు విచారణ మొదలు పెడతారు.
అస్సలు ఈ స్టీఫెన్ ఎవరు? అతని కథ ఏంటి.? తొమ్మిది హత్యలు ఎందుకు చేశాడు.? అన్నది తెలుసుకోవాలంటే ఈ సినిమా చూడాల్సిందే. ఈ సినిమా నెట్‌ఫ్లిక్స్ ఓటీటీ ప్లాట్ఫామ్లో విడుదలైంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, మలయాళం, ఇంగ్లీష్ వంటి వివిధ భాషలలో ఓటీటీలో అందుబాటులో ఉంది. ఈ చిత్రంలో గోమతి శంకర్‌తో పాటు, మైఖేల్ తంగదురై స్మృతి వెంకట్ తదితరులు ముఖ్య పాత్రలు పోషించారు. ఈ సైకలాజికల్ క్రైమ్ థ్రిల్లర్ సినిమాను అస్సలు మిస్ అవ్వకండి.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




