AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

14 సిక్సర్లు, 9 ఫోర్లు.. 75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..

Sarfaraz Khan 157 Runs, 14 Sixes in Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ముంబై బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ ఆకాశమే హద్దుగా చెలరేగిపోయాడు. జైపూర్‌ వేదికగా గోవాతో జరిగిన మ్యాచ్‌లో కేవలం 75 బంతుల్లోనే 157 పరుగులు చేసి విధ్వంసం సృష్టించాడు. ఈ అద్భుత ఇన్నింగ్స్‌లో ఏకంగా 14 సిక్సర్లు ఉండటం గమనార్హం.

14 సిక్సర్లు, 9 ఫోర్లు.. 75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
Sarfaraz Khan Century
Venkata Chari
|

Updated on: Dec 31, 2025 | 1:40 PM

Share

Sarfaraz Khan 157 Runs, 14 Sixes in Vijay Hazare Trophy: టీమ్ ఇండియా సెలెక్టర్లకు తన బ్యాట్‌తోనే సమాధానం చెప్పే సర్ఫరాజ్ ఖాన్ మరోసారి రెచ్చిపోయాడు. బుధవారం (డిసెంబర్ 31, 2025) గోవాతో జరిగిన విజయ్ హజారే ట్రోఫీ గ్రూప్-సి మ్యాచ్‌లో సర్ఫరాజ్ సిక్సర్ల వర్షం కురిపించాడు. అర్జున్ టెండూల్కర్ ప్రాతినిధ్యం వహిస్తున్న గోవా జట్టుపై విరుచుకుపడి, ముంబై జట్టు భారీ స్కోరు సాధించడంలో కీలక పాత్ర పోషించాడు.

జైపూర్‌లో సర్ఫరాజ్ ఊచకోత.. ముంబై, గోవా జట్ల మధ్య జరిగిన ఈ మ్యాచ్‌లో సర్ఫరాజ్ ఖాన్ టీ20 తరహాలో బ్యాటింగ్ చేశాడు. కేవలం 56 బంతుల్లోనే శతకాన్ని పూర్తి చేసిన ఆయన, ఆ తర్వాత మరింత వేగంగా ఆడాడు. మొత్తం 75 బంతులు ఎదుర్కొన్న సర్ఫరాజ్, 14 భారీ సిక్సర్లు, 9 ఫోర్ల సాయంతో 157 పరుగులు చేసి ఔటయ్యాడు. ఆయన స్ట్రైక్ రేట్ 200 కంటే ఎక్కువగా ఉండటం విశేషం.

రికార్డుల ముంబై..

సర్ఫరాజ్ ఖాన్ విధ్వంసానికి తోడు ముషీర్ ఖాన్ (60), హార్దిక్ తమోర్ (58) కూడా రాణించడంతో ముంబై జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 448 పరుగుల భారీ స్కోరు సాధించింది. విజయ్ హజారే ట్రోఫీ చరిత్రలోనే ఇది నాలుగో అత్యధిక టీమ్ స్కోరుగా నమోదైంది. గత వారం అరుణాచల్ ప్రదేశ్‌పై బీహార్ చేసిన 574 పరుగుల రికార్డు తర్వాత ఈ సీజన్‌లో నమోదైన మరో భారీ స్కోరు ఇదే.

ఇవి కూడా చదవండి

ఇది కూడా చదవండి: Virat Kohli: విరాట్ కోహ్లీ రీప్లేస్ మెంట్ వచ్చేశాడ్రోయ్.. 83 సగటుతో బడితపూజే..

అర్జున్ టెండూల్కర్‌పై దాడి..

గోవా తరఫున ఆడుతున్న అర్జున్ టెండూల్కర్‌కు ఈ మ్యాచ్ చేదు జ్ఞాపకంగా మిగిలిపోయింది. సర్ఫరాజ్ ఖాన్ తన ఇన్నింగ్స్‌లో అర్జున్ బౌలింగ్‌ను లక్ష్యంగా చేసుకుని భారీ షాట్లు ఆడాడు. గోవా బౌలర్లలో ఒక్కరు కూడా సర్ఫరాజ్ వేగాన్ని అడ్డుకోలేకపోయారు. న్యూజిలాండ్‌తో జరగనున్న వన్డే సిరీస్‌కు ముందు సర్ఫరాజ్ ఇలాంటి మెరుపు ఇన్నింగ్స్ ఆడటం సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించింది.

సెలెక్టర్లకు బలమైన సంకేతం..

టెస్టుల్లో ఇప్పటికే తన సత్తా చాటిన సర్ఫరాజ్, పరిమిత ఓవర్ల క్రికెట్‌లోనూ తాను తక్కువ కాదని నిరూపించుకున్నాడు. రోహిత్ శర్మ వంటి సీనియర్లు ఈ మ్యాచ్‌కు దూరం కాగా, సర్ఫరాజ్ బాధ్యతాయుతంగా ఆడి జట్టుకు తిరుగులేని ఆధిక్యాన్ని అందించాడు.

ఈ విజయంతో ముంబై జట్టు గ్రూప్-సి పాయింట్ల పట్టికలో అగ్రస్థానాన్ని మరింత సుస్థిరం చేసుకుంది. సర్ఫరాజ్ ఖాన్ ఫామ్ చూస్తుంటే త్వరలోనే ఆయన భారత్ తరఫున వన్డే అరంగేట్రం చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి.

75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
75 బంతుల్లో సెలెక్టర్లకు ఇచ్చిపడేసిన టీమిండియా బ్యాడ్ లక్కోడు..
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
న్యూ ఇయర్ స్పెషల్ విషెస్ చెప్పాలా..? హెల్మెట్ బొకేలు ట్రై చేయండి
Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
Late Night Sleep: రాత్రి నిద్ర ఆలస్యం చేస్తున్నారా? ఐతే డేంజర్‌
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
స్మార్ట్ టీవీ హ్యాక్ అయ్యే అవకాశం ఉందా? ఈ 5 ప్రమాదకరమైన సంకేతాలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
ఒరిస్సా తీసుకున్న నిర్ణయంతో భగ్గుమంటున్న కొటియా గ్రామాల ప్రజలు
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
Video: క్రికెట్‌ హిస్టరీలో కొత్త షాట్.. ఏకంగా స్టాండ్ మార్చుకుని
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
టాటా సుమో మళ్లీ తిరిగి వస్తుందా? నెట్టింట్లో కారు డిజైన్లు!
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
బాక్సాఫీస్ దగ్గర మెరిసిన స్టార్స్.. 2025లో ఊపిరిపోసిన హిట్స్‌
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
న్యూ ఇయర్‌ వేడుకలకు ఇబ్బందులు తప్పవా?
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..
అంతవరకు కోలాహలం, ఆనందం.. అంతలోనే ఊహకందని విషాదం..