AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Raayan Movie: రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో

తుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటువంటి లుక్ తో నటించాడు. ధనుష్‌కి ఇది 50వ సినిమా. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు.

Raayan Movie: రాయన్ టీమ్‌కు ధనుష్ స్పెషల్ పార్టీ.. వైరల్ అవుతోన్న వీడియో
Danush
Rajeev Rayala
|

Updated on: Aug 13, 2024 | 10:29 AM

Share

విభిన్న కథలను ఎంచుకుంటూ సినిమాలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు నటుడు ధనుష్. ఈ వర్సటైల్ యాక్టర్ నటించిన లేటెస్ట్ మూవీ రాయన్. తుషార విజయన్, సందీప్ కిషన్, కాళిదాస్ జయరామ్, ఎస్జే సూర్య, సెల్వరాఘవన్, అపర్ణ బాలమురళి నటించారు. నార్త్ చెన్నై కథాంశంతో ఈ సినిమా రూపొందింది. ఇక ఈ సినిమాలో ధనుష్ ఇప్పటి వరకు ఏ సినిమాలో చేయనటువంటి లుక్ తో నటించాడు. ధనుష్‌కి ఇది 50వ సినిమా. ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకు ధనుష్ స్వీయ దర్శకత్వం వహించారు. యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఈ సినిమా సూపర్ హిట్ గా నిలిచింది.

ఇది కూడా చదవండి : Naga Chaitanya: నాగ చైతన్య, శోభిత కూడా విడిపోతారు.. వేణు స్వామికి నాగ చైతన్య అదిరిపోయే కౌంటర్

రాయన్ సినిమా విషయానికొస్తే.. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన హీరో(ధనుష్) , గ్రామంలో తమకు భద్రత లేదని తెలుసుకొని తన ఇద్దరు తమ్ముళ్లు, చెల్లెలితో చెన్నైకి వస్తాడు. ధనుష్ అక్కడ సెల్వరాఘవన్‌ని కలుస్తాడు. అతని సహాయంతో ధనుష్ తన సోదరులు చెల్లిని చూసుకుంటూ ఉంటాడు. చిన్నతనంలోనే తల్లిదండ్రులను కోల్పోయిన ధనుష్ తన సోదరులు చెల్లిని తండ్రిలా  కాపాడుతున్నాడు. ఎలాంటి సమస్య వచ్చినా వారిని కాపాడేందుకు ధనుష్ సిద్ధంగా ఉంటాడు.

ఇది కూడా చదవండి : ఈ నటుడి భార్య, కూతురు స్టార్ హీరోయిన్స్.. ఇద్దరూ బాలయ్య బాబుతో నటించారు

ఊహించని విధంగా, అతని మొదటి సోదరుడు సందీప్ కిషన్ ఆ ప్రాంతానికి పెద్దన్న అయిన శరవణన్ కొడుకును చంపుతాడు. దాంతో అతడి నుంచి తమ్ముడిని, కుటుంబాన్ని ధనుష్ ఎలా కాపాడాడు.? ఆ తర్వాత ఏం జరిగింది.? అనేది సినిమా కథ. సినిమా కథ కుటుంబం, ఆప్యాయత, ద్రోహం, పగ చుట్టూ తిరుగుతుంది ఈ సినిమా. ఇక ఈ సినిమా బ్లాక్ బస్టర్ సాధించడంతో మూవీ టీమ్ కు ధనుష్ పార్టీ ఇచ్చాడు. తన మూవీ టీమ్ కు బిర్యానీ పార్టీ ఇచ్చాడు ధనుష్. ఇందుకు సంబందించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా మంచి వసూళ్లు రాబడుతోంది.

మరిన్ని సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి..

Follow Us