AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Devi Sri Prasad: పూనకాలు లోడింగ్ సాంగ్ వెనక ఇంత కథ ఉందా..? దేవీ శ్రీ.. నిజంగా మీరు తోప్

ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించి అలరించనున్నారు.

Devi Sri Prasad: పూనకాలు లోడింగ్ సాంగ్ వెనక ఇంత కథ ఉందా..? దేవీ శ్రీ.. నిజంగా మీరు తోప్
Devi Sri Prasad
Rajeev Rayala
|

Updated on: Jan 04, 2023 | 3:51 PM

Share

ప్రస్తుతం సోషల్ మీడియాను షేక్ చేస్తున్న సాంగ్స్ లో పూనకాలు లోడింగ్ సాంగ్ ఒకటి. మెగాస్టార్ చిరంజీవి , రవితేజ నటిస్తోన్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమా కోసం మెగా అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చాలా రోజుల తర్వాత చిరంజీవి వింటేజ్ లుక్ లో కనిపించి అలరించనున్నారు. అలాగే ఈ సినిమా మాస్ మసాలా ఎంటర్టైనర్ గా తెరకెక్కుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, పాటలు, గ్లిమ్ప్స్, ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా రాక్ స్టార్ దేవీశ్రీ ప్రసాద్ అందించిన పాటలు ప్రస్తుతం ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. రీసెంట్ గా రిలీజ్ అయిన పూనకాలు లోడింగ్ సాంగ్ నెట్టింట దుమ్మురేపుతోంది. అయితే ఈ పాటలో దేవీ ఒక బూర ఊదుతూ కనిపించాడు. పాటలో ఆ బూర సౌండే మెయిన్.

అయితే పీపీని  దేవీ గోవా నుంచి తెప్పించారట. మాములుగా దేవీశ్రీ ప్రసాద్ పాటలు కొత్తగా ఉండేలా ట్రై చేస్తూ ఉంటారు. అందుకోసం ఆయన వాడే ఇన్‌స్ట్రూమెంట్స్‌ కూడా కొత్తగా ఉంటాయి. ఇతర ప్రదేశాలకు వెళ్లినప్పుడు ఆయన అక్కడి లోకల్‌ మ్యూజికల్‌ ఇన్‌స్ట్రూమెంట్స్‌ కొంటూ ఉంటారు. అలాగే ఆయన గోవాలో మ్యూజిక్‌ సిట్టింగ్స్‌ చేస్తున్నప్పుడు ఓ ఇన్‌స్ట్రూమెంట్ కోసం తిరిగారట. ఒక షాప్‌లో పిల్లల సెక్షన్‌ లో ఒక బూర లాంటి ఇన్‌స్ట్రూమెంట్ కనిపించిందట. దాన్ని కొని ఇంటికి తీసుకొచ్చుకున్నారట.దాన్నే ఇప్పుడు ‘పూనకాలు లోడింగ్‌..’ పాటలో వాడారు.

పాటకు మెయిన్‌ ట్యూన్‌ అందించిన ఆ బూర ధర కేవలం రూ. 250 రూపాయిలేనట. దాంతోనే ఇప్పుడు సెన్సేషన్ క్రియేట్ చేశారు దేవి శ్రీ ప్రసాద్. ఇదిలా ఉంటే వాల్తేరు వీరయ్య సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 13న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమాలో చిరంజీవి సరసన శ్రుతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది.

ఇవి కూడా చదవండి

రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
రెండు కోట్లు లేవు అన్నవారికి 26 బంతుల్లోనే సమాధానం చెప్పాడు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
క్రిస్మస్ పర్వదినాన కాలిఫోర్నియాను ముంచెత్తిన వరదలు
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
సీన్ గురించి చెప్పాలని గదిలోకి అలా ప్రవర్తించాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
ఈజీగా డబ్బులు వస్తాయనుకున్నాడు.. కానీ చివరకు ఇలా బలైపోయాడు..
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
శ్రేయస్ అయ్యర్ రిటర్న్ గిఫ్ట్.. నెట్స్‌లో బ్యాటింగ్ షురూ
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
చివరిశనివారం-ఈ పరిహారాలతో వచ్చే ఏడాది పొడవునా డబ్బుకు కొరత ఉండదు!
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
అతడంటే పిచ్చి.. క్రష్ ఎవరో చెప్పిన కాజల్..
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
2026లో మీ అదృష్టాన్ని మార్చే ప్రత్యేక ఉపవాసాలు!సంపన్న జీవితం కోసం
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
రైతులకు గుడ్‌న్యూస్.. ఇక దళారుల టెన్షన్ లేనట్టే..
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్
పిల్లల్ని కంటే ప్రోత్సాహకాలు.. జనాభా పెంచడానికి ప్రభుత్వం ప్లాన్