Deepika Padukone: ఓయమ్మో.. ఒక్క డ్రెస్ అన్ని లక్షల.. కల్కి ఈవెంట్లో దీపికా ధరించి డ్రెస్ ధర వింటే గుండె గుభేల్..
ఈరోజు సాయంత్రం కల్కి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఇటీవల ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ ఈవెంట్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్, ప్రభాస్ పాల్గొనగా.. భల్లాలదేవ రానా కల్కి గురించి ప్రశ్నలు అడుగుతూ ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. అయితే ఈ ఈవెంట్లో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి.

ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో కల్కి సినిమా మరో వారం రోజుల్లో సందడి చేయనుంది. జూన్ 27న గ్రాండ్గా ఈ సైన్స్ ఫిక్షన్ డ్రామా రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. దీంతో ప్రమోషన్స్ వేగవంతం చేసింది చిత్రయూనిట్. ఓవైపు ఈ సినిమాలోనే హైలెట్ అయిన ప్రభాస్ బుజ్జి కారు దేశమంతా తిరుగుతుండగా.. మరోవైపు చిత్రయూనిట్ వరుస ఇంటర్వ్యూలు ఇస్తుంది. అలాగే ఈమూవీ స్టోరీ గురించి చెబుతూ డైరెక్టర్ నాగ్ అశ్విన్ స్పెషల్ వీడియోస్ రిలీజ్ చేస్తున్నాడు. అలాగే ఈరోజు సాయంత్రం కల్కి సెకండ్ ట్రైలర్ రిలీజ్ చేయనున్నారు మేకర్స్. ఇదిలా ఉంటే.. ఇటీవల ముంబైలో కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్ అంటూ ఓ చిన్న పార్టీ ఏర్పాటు చేసింది మూవీ టీం. ఈ ఈవెంట్లో అమితాబ్ బచ్చన్, దీపికా పదుకొణే, కమల్ హాసన్, ప్రభాస్ పాల్గొనగా.. భల్లాలదేవ రానా కల్కి గురించి ప్రశ్నలు అడుగుతూ ఆసక్తికర విషయాలు తెలుసుకున్నారు. అయితే ఈ ఈవెంట్లో చాలా ఫన్నీ ఇన్సిడెంట్స్ జరిగాయి.
ముఖ్యంగా ప్రభాస్ కష్టాల గురించి చెప్పక్కర్లేదు. మైక్ తీసుకున్న దగ్గర్నుంచి దీపికాకు సాయం చేయడం వరకు అన్ని విషయాలపై ఫన్నీగా రియాక్ట్ అవుతున్నారు ఫ్యాన్స్. ఈ సినిమాలో కథానాయికగా నటించిన దీపికా.. ప్రస్తుతం ప్రెగ్నెంట్ అన్న సంగతి తెలిసిందే. త్వరలోనే అమ్మగా ప్రమోషన్ పొందనుంది. ఇటీవల ముంబైలో జరిగిన కల్కి ప్రీ రిలీజ్ ఈవెంట్లో దీపికా పాల్గొనగా ఆమె బేబీ బంప్ ఫోటోస్ వైరల్ గా మారాయి. అంతేకాదు.. ఈ ఈవెంట్లో దీపికా లుక్స్ ఆకట్టుకున్నాయి. కాస్త బొద్దుగా బ్లాక్ డ్రెస్ లో మరింత అందంగా కనిపించింది. అయితే ఈ ఈవెంట్లో దీపిక ధరించిన డ్రెస్ ధర తెలిసి షాకవుతున్నారు నెటిజన్స్.
లోవే బ్రాండ్ కు చెందిన సింపుల్ బ్లాక్ ట్రెండీ డ్రెస్ సెలక్ట్ చేసుకుంది దీపికా. ఆ డ్రెస్ ధర రూ.1.14 లక్షలు అని సమాచారం. అంతేకాకుండా ఆమె Magda Butrym బ్రాండ్ స్టైలీష్ చెప్పులు ధరించింది. వాటి విలువ రూ.41.500. ఇక దీపిక ధరించిన కార్టియర్ ఆభరణాల విలువ రూ.1.16 కోట్లు. ఆమె మణికట్టుకు ధరించిన మూడు డైమండ్స్ ఉన్న బ్రాస్ లెట్ అందరి దృష్టిని ఆకర్షించింది. పాంథెర్ డి కార్టియర్ బ్రాస్‌లెట్ అద్భుతమైన భాగం. పచ్చలు, వజ్రాలతోపాటు 18k తెల్ల బంగారంతో తయారు చేసిన ఈ అద్భుతమైన బ్రాస్ లెట్ విలువ రూ.53,50,000. ఇలా దీపికాకు సంబంధించిన స్టైలీష్ లుక్ ఫోటోస్ వీడియోస్ నెట్టింట వైరలవుతున్నాయి.
డైరెక్టర్ నాగ్ అశ్విన్ తెరకెక్కిస్తున్న కల్కి 2898 ఏడీ చిత్రంలో ప్రభాస్, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, శోభన, దీపికా పదుకొణే, దిశా పటానీ, అన్నా బెన్ కీలకపాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్ సినిమాపై మరిన్న అంచనాలను పెంచేశాయి. ఈ చిత్రాన్ని జూన్ 27న రిలీజ్ చేయనున్నారు.
View this post on Instagram
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




