ప్రస్తుతం సూపర్ స్టార్ మహేష్ బాబు డైరెక్టర్ త్రివిక్రమ్ దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ఈ ప్రాజెక్ట్.. త్వరలోనే సెకండ్ షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఎస్ఎస్ఎంబీ 28 అనే వర్కింగ్ టైటిల్‌తో రాబోతున్న ఈ సినిమాలో మహేష్ సరసన పూజా హెగ్డే కథానాయికగా నటిస్తోంది. ఇక ఈ మూవీ తర్వాత మహేష్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో నటించనున్నాడు. ఇటీవల ఆర్ఆర్ఆర్ చిత్రంతో బాక్సాఫీస్ వద్ద ప్రభంజనం సృష్టించిన జక్కన్న…తదుపరి సినిమా మహేష్‌తో చేయనుండడంతో ఈ ప్రాజెక్ట్ పై ఇప్పటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఇక టోరంటో ఫిల్మ్ ఫెస్టివల్లో జక్కన్న మాట్లాడుతూ.. యాక్షన్ అడ్వెంచర్ చిత్రంగా ఉండనుందని చెప్పడంతో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది. అంతేకాదండోయ్.. వీరి కాంబోలో రాబోతున్న సినిమా రియల్ లైఫ్ ఇన్సిడెంట్ ఆధారంగా రాబోతుందని రచయిత కెవి విజయేంద్ర ప్రసాద్ తెలిపారు. ఇక తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ఫిల్మ్ సర్కిల్లో చక్కర్లు కొడుతుంది.
లేటేస్ట్ సమాచారం ప్రకారం ఈ సినిమాలో కథానాయికగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణె నటించనుందట. ప్రస్తుతం ఆమెతో చర్చలు జరుపుతున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటివరకు ఎలాంటి అనౌన్మెంట్ రాలేదు. త్రివిక్రమ్ సినిమా పూర్తైన తర్వాత వచ్చే ఏడాది మహేష్, రాజమౌళి సినిమా పట్టాలెక్కనున్నట్లు తెలుస్తోంది. భారీ బడ్జెట్‌తో అంతర్జాతీయ స్థాయిలో మహేష్ చిత్రాన్ని రూపొందించాలని భావిస్తున్నారట జక్కన్న. ప్రస్తుతం దీపికా.. డైరెక్టర్ నాగ్ అశ్విన్.. ప్రభాస్ కాంబోలో తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ కె చిత్రంలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీలో అమితాబ్ కీలకపాత్రలో నటిస్తున్నారు.
ఇక మరోవైపు రాజమౌళి జపాన్ లో ఆర్ఆర్ఆర్ ప్రమోషన్లలో బిజీగా ఉన్నారు. రాజమౌళితో కలిసి పనిచేయాలనే తన కల నిజమైందని.. జక్కన్నతో సినిమా చేయడం అంటే ఒకేసారి 25 సినిమాలు చేయడం లాంటిదని.. శారీరకంగా చాలా కష్టమవుతుందని.. కానీ ఈ సినిమా కోసం చాలా ఉత్సాహంగా ఉన్నట్లు గతంలో మహేష్ తెలిపారు.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.