AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

షాలినీపై ఛీటింగ్ కేసు..మ్యాటరేంటంటే బాసూ..!

‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌కు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది యువ హీరోయిన్ షాలినీ పాండే. కానీ ఆ తర్వాత ఆమె నటించిన ఏ మూవీ అమ్మడి కెరీర్‌కి అంతగా బూస్ట్ ఇవ్వలేదు.  ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  లాంటి  సినిమాల్లో అతిథి పాత్రలకే షాలినీ పరిమితమైంది. అర్జున్ రెడ్డిలో హద్దులు మీరి ముద్దు సన్నివేశాల్లో నటించిన ఈ భామకు..మంచి అవకాశాలే కరువయ్యాయి. రీసెంట్‌గా ఈ భామ రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ‘ఇద్దరి లోకం ఒకటే’ త్వరలో రిలీజ్‌కు సిద్దమవుతోంది. […]

షాలినీపై ఛీటింగ్ కేసు..మ్యాటరేంటంటే బాసూ..!
Ram Naramaneni
| Edited By: |

Updated on: Dec 24, 2019 | 3:33 PM

Share

‘అర్జున్ రెడ్డి’తో టాలీవుడ్‌కు అదిరిపోయే ఎంట్రీ ఇచ్చింది యువ హీరోయిన్ షాలినీ పాండే. కానీ ఆ తర్వాత ఆమె నటించిన ఏ మూవీ అమ్మడి కెరీర్‌కి అంతగా బూస్ట్ ఇవ్వలేదు.  ‘మహానటి’, ‘ఎన్టీఆర్ కథానాయకుడు’  లాంటి  సినిమాల్లో అతిథి పాత్రలకే షాలినీ పరిమితమైంది. అర్జున్ రెడ్డిలో హద్దులు మీరి ముద్దు సన్నివేశాల్లో నటించిన ఈ భామకు..మంచి అవకాశాలే కరువయ్యాయి. రీసెంట్‌గా ఈ భామ రాజ్ తరుణ్‌తో కలిసి నటించిన ‘ఇద్దరి లోకం ఒకటే’ త్వరలో రిలీజ్‌కు సిద్దమవుతోంది.

అయితే అనూహ్యంగా షాలినీ పాండేపై ఛీటింగ్ కేసు నమోదవ్వడం ఇప్పుడు ఫిల్మ్ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. ఇటీవల తమిళ సినిమా ‘  ‘అగ్ని సిరగుగల్’ అనే మూవీని సైన్ చేసింది ఈ హీరోయిన్.  అమ్మ క్రియేషన్స్ బ్యానర్‌పై  నిర్మాత శివ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  27 రోజుల షూటింగ్ కంప్లీట్ అయ్యాక డేట్స్ ఇవ్వకుండా టీంని ఇబ్బంది పెడుతోందట ఈ హాట్ భామ. దీంతో పలువురు నటుల డేట్స్ తీసుకున్న కాంబినేషన్స్ అన్నీ మిస్ అయ్యాయట.  ఈ విషయమై సదరు ప్రొడక్షన్ హౌస్ ప్రొడ్యూసర్ కౌన్సిల్‌కు ఫిర్యాదు చేసింది. అంతేకాకుండా పోలీసు స్టేషన్‌లో కంప్లైంట్ ఇవ్వడంతో ఛీటింగ్ కేసు నమోదు చేశారు. కాగా షాలినీ పాండే..ప్రజంట్ బాలీవుడ్‌లో బంపర్ ఆఫర్ పట్టేసింది. సూపర్ స్టార్ రణ్‌వీర్ సింగ్ సరసన ‘జయేష్ భాయ్ జోర్దార్’  అనే సినిమాలో నటించబోతోంది. ఆ మూవీ కోసమే తమిళ మూవీకి హ్యండిచ్చినట్టు తెలుస్తోంది. మరి ఈ వివాదంపై షాలిని పాండే ఏ విధంగా రెస్పాండ్ అవుతుందో చూడాలి. 

Follow Us