మరో ప్రాజెక్ట్‌కు ఓకే చెప్పిన స్టార్ కమెడియన్.. ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ రీమేక్‌లో హీరోగా …
తమిళ ఇండస్ట్రీలో తన కమెడీతో టైమింగ్‌తో టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్నాడు సంతానం. ఇటీవలే హీరోగా మారి తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు ఈ నటుడు.
Agent Sai Srinivasa Atreya Movie tamil Remake Update: తమిళ ఇండస్ట్రీలో తన కమెడీతో టైమింగ్‌తో టాప్ కమెడియన్‌గా దూసుకుపోతున్నాడు సంతానం. ఇటీవలే హీరోగా మారి తన లక్‌ను పరీక్షించుకుంటున్నాడు ఈ నటుడు. ఇప్పటివరకు హీరోగా తమిళంలో వరుస ఆఫర్లను అందుకుంటూ తెగ బిజీగా ఉన్నాడు సంతానం.
తెలుగులో డిటెక్టివ్ థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ‘ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ’ మంచి విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇందులో ‘చిచోర్’ ఫేం నవీన్ పొలిశెట్టి హీరోగా నటించాడు. తాజాగా ఈ మూవీని తమిళంలో రీమేక్ చేయబోతున్నారు. ఇందులో కమెడియన్ నుంచి హీరోగా మారిన సంతానం డిటెక్టివ్ పాత్రలో నటించనున్నట్లుగా సమాచారం. ఈ సినిమాకు బీధా దర్శకత్వం వహించనున్నట్లుగా తెలుస్తోంది. ఇందులో సంతానం సరసన రియా సుమన్ నటించనున్నట్లుగా టాక్. ఇక త్వరలోనే ఈ మూవీకి సంబంధించిన పూర్తి వివరాలను ప్రకటించనున్నారు.
Also Read:
Uppena Movie : విజయ్ దేవరకొండ చేతులమీదుగా ‘ఉప్పెన’ మూవీ సాంగ్.. ఆకట్టుకుంటున్న మెలోడీ