Racha Ravi: నవ్వించే కళ్ల వెనకాల గుండెల్ని పిండేసే బాధ.. చెల్లెలి రాక కోసం రచ్చరవి ఎదురుచూపులు..
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి.. తన మనసులోని బాధను బయటపెట్టాడు. తన చెల్లెలు తనతో మాట్లాడం లేదని.. తన ఇంటికి రావడం లేదంటూ బోరున ఏడ్చేశాడు. తన చెల్లి ఇచ్చిన రూ. 123లతో ఇండస్ట్రీకి వచ్చానని.. ఇప్పుడు తను ఇంత సంపాదించుకున్నా.. తన చెల్లెలు నా ఇంటికి రావట్లేదంటూ బోరున ఏడ్చాడు రవి.

రచ్చ రవి.. జబర్దస్త్ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమే. ఈ షోలో చమ్మక్ చంద్ర టీంలో మెయిన్ కామెడియన్గా ఆడియన్స్ ను అలరించాడు రచ్చ రవి. ముఖ్యంగా తీసుకోలేదా రెండు లక్షల కట్నం అన్న డైలాగ్తో రచ్చ రవికి వచ్చిన క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. దీంతో సినిమాల్లో బిజీ అయ్యాడు. స్టార్ హీరోస్ సినిమాల్లో మంచి మంచి పాత్రలు చేస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద భారీగా కలెక్షన్స్ రాబడుతున్న బలగం సినిమాలోనూ రచ్చ రవి మంచి పాత్ర పోషించాడు. ప్రతి ఒక్కరి హృదయాలను తాకిన ఈ సినిమాలో ప్రియదర్శి స్నేహితుడి పాత్రలో నటించాడు రచ్చ రవి. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రవి.. తన మనసులోని బాధను బయటపెట్టాడు. తన చెల్లెలు తనతో మాట్లాడం లేదని.. తన ఇంటికి రావడం లేదంటూ బోరున ఏడ్చేశాడు. తన చెల్లి ఇచ్చిన రూ. 123లతో ఇండస్ట్రీకి వచ్చానని.. ఇప్పుడు తను ఇంత సంపాదించుకున్నా.. తన చెల్లెలు నా ఇంటికి రావట్లేదంటూ బోరున ఏడ్చాడు రవి.
రచ్చ రవి మాట్లాడుతూ.. “ప్రతీ పండక్కి నేను నా చెల్లి దగ్గరకు వెళ్లి రాఖీ కట్టించుకుంటాను. కానీ కొన్ని సంవత్సరాలుగా మా చెల్లెలు మా ఇంటికి రావడం లేదు. 2016లో నా ఇంటి గృహ ప్రవేశానికి వచ్చిన తర్వాత నుంచి ఇంటికి రాలేదు. నేను ఇంత సంపాదించుకున్నాను అంటే అందుకు కారణం నా చెల్లి రజితనే. తను ఇచ్చిన రూ.123 రూపాయాలు తీసుకుని హైదరాబాద్ వచ్చాను. ఇప్పుడు ఇంతా సంపాదించి.. ఈ స్థాయిలో ఉన్నాను అంటే అందుకు కారణం తనే. కానీ ఇప్పుడు నా చెల్లి నా ఇంటికి రావడం లేదు. నా మీద ఎందుకు అలిగిందో తెలీదు. ఇంటికి వస్తే బాగుండు” అంటూ బోరున ఏడ్జేశాడు.




తప్పు ఉంటే తిట్టాలని.. కానీ సంవత్సరాలు గడుస్తున్నా ఇంటికి మాత్రం రావడం లేదని.. తనే రాఖీ పండగకు చెల్లె ఇంటికి వెళ్లి రాఖీ కట్టించుకుంటున్నట్లు చెప్పాడు. సినిమాల్లోకి వచ్చాక సమయం సరిగా లేక తనతో మాట్లాడలేదని.. కానీ అది ఆమె తప్పుగా అర్థం చేసుకుందని.. దీంతో తన ఇంటికి రావడం మానేసిందని.. ఎన్నిసార్లు బతిమాలినా ఇంటికి రాననే చెప్తుందంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు.



