TS Theatres: థియేటర్లు అప్పటిదాకా తెరవబోము.. నిర్మాతలకు గట్టి వార్నింగ్ ఇచ్చిన ఎగ్జిబిటర్లు..
ఓటీటీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్నట్లు కనిపిస్తోంది. పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫారంలలో విడుదల చేస్తుండగా..
ఓటీటీ వివాదం చిలికి చిలికి గాలివానలా మారుతున్నట్లు కనిపిస్తోంది. పలువురు నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీ ప్లాట్‌ఫారంలలో విడుదల చేస్తుండగా.. అలా చేయడాన్ని ఎగ్జిబిటర్లు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇప్పటికే కేసీఆర్ సర్కార్ థియేటర్లను పూర్తిస్థాయి సామర్ధ్యంతో తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చిన సంగతి తెలిసిందే.అయితే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సినిమా థియేటర్లను తెరిచేందుకు మాత్రం ఎగ్జిబిటర్లు నిరాకరిస్తున్నారు. తాజాగా హైదరాబాద్‌లో నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, ఇతర సినిమా ప్రముఖుల మధ్య జరిగిన సర్వసభ్య సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు.
ఓటీటీల్లో సినిమాల విడుదల ఆపేవరకూ థియేటర్లు తెరవబోమని ఎగ్జిబిటర్లు తేల్చి చెప్పారు. పరిస్థితి చక్కబడేవరకు నిర్మాతలు ఆగాలని.. ఓటీటీ నుంచి సినిమా థియేటర్లను బ్రతికించాలని కోరారు. ఎగ్జిబిటర్లు తీసుకున్న ఈ నిర్ణయంతో టాలీవుడ్ నిర్మాతలు సందిగ్దంలో పడ్డారు.
మరోవైపు ఓటీటీ వేదికగా తమ సినిమాలను విడుదల చేయాలనుకుంటున్న నిర్మాతలు ఈ ఏడాది అక్టోబర్ వరకూ వేచి చూడాలని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ కోరిన విషయం తెలిసిందే. అప్పటికీ పరిస్థితి చక్కబడకపోతే అప్పుడు ఓటీటీలో సినిమాలు విడుదల చేసుకోవాలని చెప్పింది. కాగా, నిర్మాతల మండలి నిర్ణయాన్ని కాదని సినిమాలు ఓటీటీలో విడుదల చేస్తే త్వరలోనే తమ భవిష్యత్తు కార్యాచరణ వెల్లడిస్తామని నిర్మాతలకు ఎగ్జిబిటర్లు హెచ్చరికలు జారీ చేశారు.
Also Read:
ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం అప్పుడే.. క్లారిటీ ఇచ్చిన విద్యాశాఖ మంత్రి!
సినీ పరిశ్రమకు షాక్ ఇచ్చిన జగన్ సర్కార్.. ప్రభుత్వం నిర్దేశించిన రేట్లకు టికెట్ ధరలు.!
కాబోయే భర్త రేప్ చేశాడంటూ మహిళ కేసు.. హైకోర్టు సంచలన తీర్పు.!
ఏపీ ఇంటర్ విద్యార్ధులకు అలెర్ట్.. అకడమిక్ క్యాలెండర్ షెడ్యూల్ ఖరారు.. మొత్తం 213 పనిదినాలు.!