Pooja Hegde: రెమ్యునరేషన్ పెంచిన పూజా హెగ్డే.. అయినా తగ్గని ఆఫర్లు.. రెండు సినిమాలకు ఓకే..

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలను చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూజా..

Pooja Hegde: రెమ్యునరేషన్ పెంచిన పూజా హెగ్డే.. అయినా తగ్గని ఆఫర్లు.. రెండు సినిమాలకు ఓకే..
Pooja Hegde
Follow us

|

Updated on: Jul 08, 2021 | 8:46 AM

తెలుగు, హిందీ, తమిళ భాషల్లో వరుస సినిమాలను చేస్తూ.. ఫుల్ బిజీగా మారిపోయింది పూజా హెగ్డే. ఒక లైలా కోసం సినిమాతో తెలుగులోకి ఎంట్రీ ఇచ్చిన పూజా.. ఆ తర్వాత అగ్రహీరోల సరసన నటించే ఛాన్స్ అందుకుంది. అరవింద సమేత, మహర్షి, దువ్వాడ జగన్నాథం, సాక్ష్యం వంటి సినిమాలతో టాప్ హీరోయిన్ ప్లేస్‏లో దూసుకుపోతున్న బుట్టబొమ్మ.. గతేడాది అల్లు అర్జున్ నటించిన అల వైకుంఠపురం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ఇక కేవలం తెలుగులోనే కాకుండా.. బాలీవుడ్‏లోనూ సత్తా చాటుతుంది. బాలీవుడ్ హీరో రణవీర్ సింగ్, డైరెక్టర్ రోహిత్ శెట్టి కాంబోలో వస్తున్న సర్కాస్ మూవీలో పూజా నటిస్తోంది. అలాగే స్టార్ హీరో సల్మాన్ ఖాన్‏కు జోడిగా పూజా నటిస్తోంది.

ఇక అటు తమిళ స్టార్ విజయ్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న బీస్ట్ చిత్రంతో కోలీవుడ్‏లోకి ఎంట్రీ ఇస్తుంది పూజా హెగ్డే. ఇవే కాకుండా.. మెగాస్టార్ చిరంజీవి , కాజల్ హీరోహీరోయిన్లుగా నటిస్తున్న ఆచార్య సినిమాలోనూ పూజా హెగ్డే కీలక పాత్రలో కనిపించబోతుంది. ఇలా వరుస ఆఫర్లతో ఫుల్ బిజీగా ఉన్న పూజా… తన రెమ్యునరేషన్ కూడా భారీగానే పెంచినట్లుగా టాక్. ఒక్కో సినిమాకు రూ. 3.5 కోట్ల వరకు తీసుకుంటుందట పూజా. ఇక పారితోషికం పెంచినా కూడా పూజా హెగ్డేకు ఆఫర్లు మాత్రం తగ్గడం లేదట. తాజాగా మరో రెండు సినిమాలకు ఓకే చెప్పినట్లుగా సమాచారం.

యూత్ స్టార్ నితిన్.. డైరెక్టర్ వక్కంతం వంశీ కాంబోలో రాబోతున్న సినిమాలో పూజా హీరోయిన్ గా నటించబోతుందట. ఈ మూవీని యూత్ స్టార్ హోమ్ నిర్మించనుంది. ప్రస్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్ ఈ మూవీ తర్వాత వక్కంతం వంశీ డైరెక్షన్‏లో రాబోయే చిత్రాన్ని స్టార్ట్ చేయనున్నాడట. అలాగే త్రివిక్రమ్ శ్రీనివాస్, మహేష్ బాబు కలయికలో రాబోతున్న అప్ కమింగ్ మూవీలో కూడా పూజా నటించనున్నట్లుగా టాక్… ఇక ఈ అమ్మడు నటించిన రాధేశ్యామ్, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి.

Also Read: Jagapathi Babu: రాజకీయ నాయకుడిగా జగ్గుభాయ్ న్యూలుక్.. పొలిటికల్ ఎంట్రీపై క్లారిటి ఇచ్చిన హీరో..

Krithi Shetty: టాలీవుడ్‏లో బేబమ్మ హావా.. మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన కృతి శెట్టి ?