Cinema Bandi : సినిమా బండి మేకింగ్ ఇంట్రస్టింగ్ వీడియో.. సోషల్ మీడియాలో వైరల్..
ఓటీటీల హవాతో లోకల్ కంటెంట్ కూడా నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమా తీయాలంటే కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్..
Cinema Bandi : ఓటీటీల హవాతో లోకల్ కంటెంట్ కూడా నేషనల్ లెవల్‌లో ట్రెండ్ అవుతోంది. సినిమా తీయాలంటే కాస్ట్‌లీ ఎక్విప్‌మెంట్.. మోస్ట్ టాలెంటెడ్ స్టార్స్ అవసరం లేదని ప్రూవ్ చేసే కంటెంట్ డిజిటల్‌లో చాలా వస్తోంది. అలాంటి ఇంట్రస్టింగ్ మూవీనే సినిమా బండి. పూర్తిగా లోకల్ ఆర్టిస్ట్‌లతో ప్రతీ ఒక్కరిలో ఓ ఫిలిమ్ మేకర్ ఉన్నాడన్న సింపుల్ కాన్సెప్ట్‌ను ఎంటర్‌టైనింగ్‌గా ఎమోషనల్‌గా వెండితెర మీద చూపించింది సినిమా బండి టీమ్. ఫ్యామిలీ మ్యాన్ మేకర్స్ రాజ్ అండ్ డీకే ప్రొడ్యూస్ చేయటంతో ఈ చిన్న సినిమాకు మరింత హైప్ వచ్చింది. తాజాగా సినిమా బండి మేకింగ్‌కు సంబంధించి ఇంట్రస్టింగ్ వీడియో షేర్ చేశారు మేకర్స్.
ఇంటర్నేషల్ ఫిలిం మేకింగ్ టెక్నిక్స్‌ను సినిమా బండి మేకర్స్‌తో కంపార్ చేస్తూ రాజ్ అండ్ డీకే రిలీజ్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. `ఫిలిం మేకింగ్ టెక్నిక్స్ ఆఫ్ సినిమా బండి ది జుగాడ్ వే` అంటూ రిలీజ్ చేసిన వీడియో ఇండస్ట్రీ జనాలను కూడా ఎట్రాక్ట్ చేస్తోంది.
View this post on Instagram
మరిన్ని ఇక్కడ చదవండి :