Jani Master: అవేవీ నమ్మకండి..! క్లారిటీ ఇచ్చిన జానీ మాస్టర్.. ఎవ్వరూ ఆపలేరు అంటూ..

లేడీ క్రియోగ్రాఫర్ పై లైంగిక వేధింపుల ఆరోపణ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ ను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. లైంగిక ఆరోపణల నేపథ్యంలో జానీ జైలుకు కూడా వెళ్ళాడు. ప్రస్తుతం అతను బెయిల్ పై బయటకు వచ్చారు.

Jani Master: అవేవీ నమ్మకండి..! క్లారిటీ ఇచ్చిన జానీ మాస్టర్.. ఎవ్వరూ ఆపలేరు అంటూ..
Jani Master
Follow us
Rajeev Rayala

|

Updated on: Dec 09, 2024 | 5:47 PM

లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో టాలీవుడ్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ జైలు పాలైన విషయం తెలిసిందే. ప్రస్తుతం జానీ బెయిల్ పై బయటకు వచ్చారు. తాజాగా జానీ మాస్టర్ ను డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ నుంచి శాశ్వతంగా తొలగించారు. డిసెంబర్ 08జరిగిన డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ డైరెక్టర్స్ అసోసియేషన్ ఎన్నికల్లో జోసెఫ్ ప్రకాశ్ అధ్యక్షుడిగా గెలిచారు. తాజాగా జానీ మాస్టర్ తాజాగా ఓ వీడియో విడుదల చేశారు. ఆ వీడియోలో ఆయన మాట్లాడుతూ.. “నిర్ధారణవ్వని ఆరోపణలని కారణంగా చూపిస్తూ నన్ను శాశ్వతంగా యూనియన్ నుండి తొలగించినట్టు మీడియాలో పుకార్లు పుట్టిస్తున్నారు. అవేవీ నమ్మకండి!! నా పదవీ కాలం ఇంకా ఉన్నా కూడా అనధికారికంగా, అనైతికంగా ఎలక్షన్లు నిర్వహించి వారికి వారే నిర్ణయాలు, హోదాలు తీసుకునే హక్కు ఎవరికీ లేదు. దీనికి కారణమైన వారిపై చట్టపరంగా వెళుతున్నాను. టాలెంట్ ఉన్నవారికి పనివ్వకుండా, దొరక్కుండా ఎవ్వరూ ఆపలేరు. నా కొరియోగ్రఫీలో గేమ్ ఛేంజర్  నుండి ఓ మంచి పాట రాబోతుంది, మీ అందరికీ కచ్చితంగా నచ్చుతుంది” అని జానీ చెప్పుకొచ్చారు.

ఇవి కూడా చదవండి