Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Chiranjeevi: మెగా మేనియా.. చిరంజీవి చేయలేనివి చరణ్ చేసి చూపిస్తున్నాడు..!

చిరంజీవి, రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇలాగే జరుగుతుంది. అప్పుడు చిరు చేయాలనుకుని కుదరని కొన్ని పనులను ఇప్పుడు చరణ్ వచ్చి కంప్లీట్ చేస్తున్నాడు. అది చూసి అదిరా మా మెగా వారసుడు అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అలా జరుగుతుంది అనుకుంటున్నారా..?

Chiranjeevi: మెగా మేనియా.. చిరంజీవి చేయలేనివి చరణ్ చేసి చూపిస్తున్నాడు..!
Chiranjeevi , Ram Charan
Follow us
Praveen Vadla

| Edited By: Rajeev Rayala

Updated on: Jan 07, 2024 | 9:28 PM

సినిమాల్లో ఓ కామన్ డైలాగ్ ఉంటుంది.. నేను చేయకపోయినా ఆ పని నా కొడుకు వచ్చి పూర్తి చేస్తాడు.. కచ్చితంగా ఆ పని పూర్తి చేస్తాడు అంటూ చాలా సినిమాల్లో హీరోల తండ్రులు డైలాగులు చెప్తుంటారు. అప్పుడు కొడుకు వచ్చి అనుకున్నట్లుగానే తండ్రి కోరిక నెరవేరుస్తుంటాడు. అక్కడ స్క్రిప్ట్ కాబట్టి ఏం చేసినా చెల్లుతుంది. కానీ నిజ జీవితంలో కూడా ఇలా జరుగుతుందా.. సినిమా కాదు కదా జీవితం ఇది..! అందుకే ఇక్కడ అలా తండ్రి వదిలేసిన పనులు కొడుకు పూర్తి చేయడం అనేది జరుగుతుందా అంటే ఏమో అనే సమాధానమే వస్తుంది. కానీ చిరంజీవి, రామ్ చరణ్ విషయంలో మాత్రం ఇలాగే జరుగుతుంది. అప్పుడు చిరు చేయాలనుకుని కుదరని కొన్ని పనులను ఇప్పుడు చరణ్ వచ్చి కంప్లీట్ చేస్తున్నాడు. అది చూసి అదిరా మా మెగా వారసుడు అంటూ ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తున్నారు. ఇంతకీ ఏ విషయంలో అలా జరుగుతుంది అనుకుంటున్నారా..?

అసలు మ్యాటర్ ఏంటంటే.. చిరంజీవి 155 సినిమాలు చేసాడు.. ఎన్నో రికార్డులు తిరగరాసాడు.. ఇంకా చెప్పాలంటే ఆయన చూడని సక్సెస్ లేదు.. క్రియేట్ చేయని రికార్డ్ లేదంటే అతిశయోక్తి కాదేమో..? అలాంటి చిరంజీవికి కూడా కొన్ని కోరికలు అలాగే ఉండిపోయాయి. కొందరితో పని చేయాలని ప్లాన్ చేసుకున్నాడు కానీ కుదర్లేదు. అదిప్పుడు చరణ్ పూర్తి చేస్తున్నాడు. తన ఇన్నేళ్ల కెరీర్‌లో దర్శకుడు శంకర్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని చాలా ఏళ్లు ప్రయత్నించాడు చిరు. కానీ కుదర్లేదు.. అయితే ఆయన మొదటి సినిమా జెంటిల్‌మెన్‌ను హిందీలో మరో దర్శకుడితో రీమేక్ చేసాడు మెగాస్టార్. ఇప్పుడు అదే శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమా చేస్తున్నాడు రామ్ చరణ్. తను పని చేయలేకపోయిన దర్శకుడితో కొడుకు పని చేస్తుండటంతో హ్యాపీగా ఉన్నాడు చిరు.

అలాగే లెజెండరీ మ్యుజిషియన్ ఏఆర్ రెహమాన్‌తో ఒక్క సినిమా అయినా చేయాలని ప్రతీ హీరో కోరుకుంటాడు. అది చాలా మందికి కలగానే మిగిలిపోయింది. ఎందుకంటే తెలుగులో రెహ్మాన్ ఎక్కువ సినిమాలు చేయలేదు కాబట్టి చాలా మంది హీరోలతో ఆయన పని చేయలేదు. అందులో చిరంజీవి కూడా ఉన్నాడు. రెహ్మాన్‌తో ఒక్కసారి కూడా ఆయన పని చేయలేదు.. ఈ ఇద్దరి కాంబినేషన్ మూడు నాలుగు సార్లు వర్కవుట్ అయినట్లే అయి తప్పిపోయింది. తెలుగులో బాలకృష్ణ నిప్పురవ్వకి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చిన రెహ్మాన్.. వెంకటేష్ సూపర్ పోలీస్, నాగార్జున రక్షకుడు, రాజశేఖర్ గ్యాంగ్ మాస్టర్, కృష్ణంరాజు పల్నాటి పౌరుషం లాంటి సినిమాలకు మ్యూజిక్ ఇచ్చాడు. అలాగే పవన్ కళ్యాణ్ కొమరం పులి, మహేష్ బాబు నాని సినిమాలకు కూడా ఈయన పని చేసాడు.

నాగ చైతన్య ఏ మాయ చేసావే, సాహసం శ్వాసగా సాగిపో.. తరుణ్ నీ మనసు నాకు తెలుసు లాంటి సినిమాలకు కూడా రెహ్మాన్ సంగీతం అందించాడు. కానీ చిరుతో మాత్రం ఒక్క సినిమాకు పని చేయలేదు. అప్పట్లో ఓసారి అబు బాగ్దాద్ గజదొంగ కోసం రెహమాన్‌ను తీసుకున్నారు కానీ ఆ సినిమా ఆదిలోనే ఆగిపోయింది. సైరా నరసింహారెడ్డి కోసం అడిగారు కానీ డేట్ల సమస్య వల్ల కుదర్లేదు. ఇలా చిరు అనుకుని పని చేయలేకపోయిన ఏఆర్ రెహమాన్‌తో ఇప్పుడు చరణ్ పని చేయబోతున్నాడు. ఉప్పెన ఫేమ్ బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందబోయే సినిమాకు ఏఆర్ రెహమాన్ పేరు ప్రకటించారు. అనౌన్స్ చేయడం ఏంటి.. ఆల్రెడీ రెండు పాటలకు మ్యూజిక్ సిట్టింగ్స్ పూర్తయ్యాయని తెలుస్తుంది. ఈ సినిమాలో శివరాజ్ కుమార్, విజయ్ సేతుపతి లాంటి స్టార్స్ నటిస్తున్నారు. మార్చ్ లేదంటే ఎప్రిల్ నుంచి షూటింగ్ మొదలు కానుంది. స్పోర్ట్స్ నేపథ్యంలో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు బుచ్చిబాబు సన. దీనికి ‘పెద్ది’ అనే టైటిల్ ప్రచారంలో ఉంది. ప్రీ ఇండిపెండెన్స్ నేపథ్యంలో సినిమా వస్తుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.