Mahesh Babu’s Mother Death: ఇందిరాదేవి మృతికి సంతాపం తెలుపుతోన్న సినీ రాజకీయ ప్రముఖులు
ఘట్టమనేని ఇందిరాదేవి మృతితో ఒక్కసారిగా కృష్ణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ సతీమణి , మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు కన్నుమూశారు.
ఘట్టమనేని ఇందిరాదేవి మృతితో ఒక్కసారిగా కృష్ణ కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. కృష్ణ సతీమణి , మహేష్ బాబు తల్లి ఇందిరాదేవి గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ నేడు కన్నుమూశారు. ఇందిరాదేవి మృతితో కుటుంబసభ్యులంతా కన్నీరుమునీరవుతున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ ప్రముఖులుఇందిరాదేవి మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటికే వెంకటేష్, నాగార్జున, మోహన్ బాబు, అడవి శేష్ లాంటి హీరోలు ఇందిరాదేవి భౌతకకాయాన్ని సందర్శించుకున్నారు. పలువురు సోషల్ మీడియా వేదికగా సంతాపాన్ని తెలుపుతున్నారు. నారా లోకేష్ స్పందిస్తూ.. ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు.
ఇందిరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ.. అంటూ బండ్లగణేష్ ట్వీట్ చేశారు. “మీకెంతో ఇష్టమైన ప్రాణానికి ప్రాణమైన అమ్మగారు వెళిపోయారన్న వార్త చాలా బాధాకరం మహేష్ బాబు గారు . వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను అని ప్రముఖ లిరిసిస్ట్ రామజోగయ్య శాస్త్రి రాసుకొచ్చారు. మెగాస్టార్ చిరంజీవి స్పందిస్తూ.. శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను అంటూ ట్వీట్ చేశారు చిరు. యంగ్ టైగర్ మహేష్ తల్లి ఇందిరా దేవి మృతికి సంతాపం తెలిపారు. “ఇందిరాదేవి గారు మృతి చెందడం చాలా బాధాకరం. ఈ దుఃఖ సమయంలో కృష్ణ గారికి, మహేష్ అన్నకు మరియు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి అని ట్వీట్ చేశారు తారక్.
Deeply saddened by the passing away of Indira Devi Garu. Deepest condolences to Krishna garu, Mahesh anna and family in this time of grief.
— Jr NTR (@tarak9999) September 28, 2022
ప్రముఖ నటులు, సూపర్ స్టార్ కృష్ణ గారి సతీమణి ఇందిరాదేవి గారి మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నాను. ఆమె ఆత్మకు శాంతి కలగాలని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/oAZlHNKR3l
— Lokesh Nara (@naralokesh) September 28, 2022
శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మ కి శాంతి చేకూరాలని కోరుకుంటూ ?, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబు కి , కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను.
— Chiranjeevi Konidela (@KChiruTweets) September 28, 2022
మీకెంతో ఇష్టమైన ప్రాణానికి ప్రాణమైన అమ్మగారు వెళిపోయారన్న వార్త చాలా బాధాకరం @urstrulyMahesh గారు . వారి పవిత్రాత్మకు శాంతి చేకూరాలని ప్రార్ధిస్తున్నాను??? pic.twitter.com/5MtnZsPRQA
— RamajogaiahSastry (@ramjowrites) September 28, 2022
ఇందిరమ్మ పవిత్ర ఆత్మకు శాంతి కలగాలని భగవంతుని ప్రార్థిస్తూ ? pic.twitter.com/Dgkiorz6Yh
— BANDLA GANESH. (@ganeshbandla) September 28, 2022
I was devastated by the tragedies in Super Star Krishna garu’s family and the demise of Srimathi Indiramma garu struck me very hard. I have great admiration for this affectionate family and highest respect for Indiramma garu.
— Sreenu Vaitla (@SreenuVaitla) September 28, 2022
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.