Chiranjeevi : “ఆ అంజనా దేవి కుమారుడే.. నాకు ఆహ్వానం పంపినట్టుంది”.. మెగాస్టార్ ఎమోషనల్

సోషల్ మీడియాలో ఇప్పటికే బాలరాముని విగ్రహ రూపం వైరల్ అవుతుంది. రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే సినీ సెలబ్రెటీలతో పాటు చాలా మందికి ఆహ్వానం అందింది. టాలీవుడ్ తరుపున మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు మరికొంతమందికి అయోధ్యకు ఆహ్వానం అందింది.

Chiranjeevi : ఆ అంజనా దేవి కుమారుడే.. నాకు ఆహ్వానం పంపినట్టుంది.. మెగాస్టార్ ఎమోషనల్
Chiranjeevi
Follow us
Rajeev Rayala

|

Updated on: Jan 22, 2024 | 7:23 AM

నేడే ఆ రోజు.. ఎన్నో ఏళ్లుగా అయోధ్య రామమందిర నిర్మాణం కోసం ఎదురుచూసిన భక్తిల కల నెరవేరే రోజు. . శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠ మహా ఘట్టాం నేడు అంగరంగవైభవంగా జరగనుంది. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. అలాగే రామమందిరాన్ని సర్వాంగసుందరంగా ముస్తాబు చేశారు. సోషల్ మీడియాలో ఇప్పటికే బాలరాముని విగ్రహ రూపం వైరల్ అవుతుంది. రామమందిర ప్రారంభోత్సవానికి ఇప్పటికే సినీ సెలబ్రెటీలతో పాటు చాలా మందికి ఆహ్వానం అందింది. టాలీవుడ్ తరుపున మెగాస్టార్ చిరంజీవి, ప్రభాస్, రామ్ చరణ్ తో పాటు మరికొంతమందికి అయోధ్యకు ఆహ్వానం అందింది. ఇప్పటికే అందరూ అయోధ్యకు చేరుకున్నారు.

మెగాస్టార్ చిరంజీవి, రామ్ చరణ్ కూడా అయోధ్యకు చేరుకున్నారు. తాజాగా చిరంజీవి సోషల్ మీడియాలో ఓ పోస్ట్ షేర్ చేశారు. రేపటి బంగారు క్షణాల కోసం ఎదురుచూస్తున్నా.. అంటూ చిరంజీవి రాసుకొచ్చారు. “చరిత్ర సృష్టిస్తుంది.  చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయే ఘటం ఇది. నిజంగా అద్భుతమైన అనుభూతి.. అయోధ్యలో రామ్‌లల్లా పట్టాభిషేకాన్ని చూసేందుకు ఈ ఆహ్వానాన్ని భగవంతుడిచ్చిన అవకాశంగా భావిస్తున్నాను. ఐదు వందల సంవత్సరాలకు పైగా తరతరాలుగా భారతీయుల నిరీక్షణ ఫలించబోతున్న ఆ మహత్తర అధ్యాయం. ఆ దివ్యమైన ‘చిరంజీవి’ హనుమంతుడు, అంజనా దేవి కుమారుడే స్వయంగా ఈ భూలోక అంజనా దేవి కొడుకు చిరంజీవికి ఈ అమూల్యమైన క్షణాలను చూసే బహుమతిని ఇచ్చినట్లు నాకు అనిపిస్తుంది.

ఇది నిజంగా వర్ణించలేని అనుభూతి. నాకు, నా కుటుంబ సభ్యులకు ఎన్నో జన్మల పుణ్యఫలం ఇది. గౌరవనీయులైన ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారికి హృదయపూర్వక అభినందనలు. ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ యోగి జీకి హృదయపూర్వక అభినందనలు. ఈ మహత్తర సందర్భంలో ప్రతి భారతీయునికి హృదయపూర్వక అభినందనలు!  ఆ బంగారు క్షణాల కోసం ఎదురు చూస్తున్నా .. జై శ్రీరామ్ ” అంటూ ట్విటర్ లో రాసుకొచ్చారు మెగాస్టార్. ప్రస్తుతం ఈ పోస్ట్ వైరల్ అవుతుంది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి