Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- మెగాపవర్ స్టార్.. ఏ సినిమాలో అంటే..

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా పైన ఫోకస్ పెట్టారు. జక్కన చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే..

Chiranjeevi: మరోసారి కలిసి నటించనున్న మెగాస్టార్- మెగాపవర్ స్టార్.. ఏ సినిమాలో అంటే..
Megastar
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2021 | 11:12 AM

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ ను కంప్లీట్ చేసి నెక్స్ట్ సినిమా పైన ఫోకస్ పెట్టారు. జక్కన చెక్కుతున్న ఆర్ఆర్ఆర్ లో చరణ్ అల్లూరి సీతారామరాజుగా కనిపించనున్న విషయం తెలిసిందే.. ఈ సినిమాతర్వాత చరణ్ శంకర్ తో చేయి కలిపారు. టాప్ డైరెక్టర్ శంకర్ చెర్రీ కోసం ఓ భారీ బడ్జెట్ ప్రాజెక్ట్ ను రెడీ చేశాడు. ఇప్పటికే ఒక షడ్యూల్ కూడా పూర్తి చేశాడు ఈ రోబో డైరెక్టర్. ఆర్ ఆర్ ఆర్ తో పాన్ ఇండియా సినిమాలపై కన్నేసిన వరుసగా భారీ బడ్జెట్ సినిమాలనే పట్టాలెక్కిస్తున్నాడు. ఈక్రమంలోనే కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తో ఓ సినిమా చేయబోతున్నాడని టాక్ . ఇటీవలే చిరంజీవి , చరణ్ తో కలిసిఉన్న ఫోటోను షేర్ చేసి చిన్న హింట్ ఇచ్చాడు ప్రశాంత్ నీల్. దాంతో అభిమానులు ఫిక్స్ అయ్యిపోయారు. తాజాగా ఈ సినిమా కాంబో గురించి ఓ ఇంట్రస్టింగ్ వార్త చక్కర్లు కొడుతుంది.

ప్రశాంత్ నీల్ డైరెక్ట్ చేయబోతున్న చరణ్ సినిమాలో మెగాస్టార్ కూడా ఉండనున్నారట . గతంలో చరణ్ నటించిన మగధీర, బ్రుస్ లీ సినిమాల్లో చిన్న రోల్ లో కనిపించిన మెగాస్టార్.. ‘ఖైదీ నెంబర్ 150’ సినిమాలో ‘అమ్మడు లెట్స్ డూ కుమ్ముడు’ సాంగ్ లో తండ్రితో కలిసి చరణ్ స్టెప్పులేసి అదరగొట్టారు. ఇప్పుడు   మెగాస్టార్ నటిస్తున్న ఆచార్య సినిమాలో ఇద్దరు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో చరణ్  చేస్తున్న సినిమాలో కీలకమైన ఒక పాత్రను మెగాస్టార్ చేయనున్నట్టు చెప్పుకుంటున్నారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా ప్రస్తుతం సెకండ్ షెడ్యూల్ షూటింగును జరుపుకుంటోంది. కియారా అద్వాని హీరోయిన్ గా నటిస్తుంది.

మరిన్ని ఇక్కడ చదవండి :

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..