Evaru Meelo Koteeswarulu: మహేష్ గెలుచుకున్న మనీ ఎంతో తెలుసా.. ఆ మొత్తాన్ని ఏంచేశారంటే..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు హోస్ట్ గా టీవీ షోలను విజయవంతంగా నడిపిస్తున్నారు.

Evaru Meelo Koteeswarulu: మహేష్ గెలుచుకున్న మనీ ఎంతో తెలుసా.. ఆ మొత్తాన్ని ఏంచేశారంటే..
Mahesh
Follow us
Rajeev Rayala

|

Updated on: Nov 27, 2021 | 10:19 AM

Evaru Meelo Koteeswarulu: యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఓ వైపు హీరోగా సినిమాలు చేస్తూనే మరో వైపు హోస్ట్ గా టీవీ షోలను విజయవంతంగా నడిపిస్తున్నారు. ఇప్పటికే రియాలిటీ షో బిగ్ బాస్‌‌‌కు హోస్ట్‌‌‌గా వ్యవహరించి అందరిని ఆకట్టుకున్నారు తారక్. ఇప్పుడు ఎవరు మీలో కోటీశ్వరులు అంటూ ప్రేక్షకులముందుకు రావడానికి సిద్దమయ్యారు. ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్‌‌‌‌ ను కంప్లీట్లో చేసిన తారక్ నెక్స్ట్ సినిమా పనుల్లో బిజీగా ఉన్నారు. ప్రముఖ ఛానల్‌‌‌‌లో ప్రసారం అయ్యే ఈ గేమ్ షోకు తారక్ హోస్ట్‌‌‌‌గా వ్యవహరిస్తున్నారు. గతంలో స్టార్ మాలో టెలికాస్ట్ అయిన ‘మీలో ఎవ‌రు కోటీశ్వ‌రుడు’ గేమ్ షో ఇప్పుడు ‘ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు’గా మారి మరో ఛానల్‌‌‌‌లో ప్రసారం కాబోతుంది. ఎవ‌రు మీలో కోటీశ్వ‌రులు షోకు కింగ్ నాగార్జున, మెగాస్టార్ చిరంజీవి హోస్ట్‌‌‌‌లుగా చేశారు. ఇప్పుడు తారక్ తనదైన స్టైల్‌‌‌‌లో ఈ షోను హోస్ట్  చేస్తున్నారు.

ఇక ఈ షోకు ఇప్పటికే సినిమా తారలు హాజరయ్యారు. మొదటి గెస్ట్‌గా తారక్ మిత్రుడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ గెస్ట్‌గా హాజరయ్యారు. ఆతర్వాత టాప్ డైరెక్టర్స్ రాజమౌళి, కొరటాల శివ కలిసి ఎవరు మీలో కోటీశ్వరులు ప్రోగ్రాం కు వచ్చి సందడి చేశారు. ఆతర్వాత బ్యూటీఫుల్ హీరోయిన్ సమంత, మ్యూజిక్ సెన్సేషన్స్ తమన్ – దేవీశ్రీ హాజరయ్యారు. ఇక ఈ షోకు సూపర్ స్టార్ మహేష్ బాబు హాజరు కానున్నారని ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది. ఇటీవలే ఆ వార్తలను నిజం చేస్తూ పోస్టర్ ను వదిలారు. అలాగే రీసెంట్ గా ప్రోమోను కూడా విడుదల చేశారు. మహేశ్‌ బాబు పాల్గొన్న ఎపిసోడ్‌ త్వరలో ప్రసారం కానుంది. అయితే ఇప్పుడు మహేష్ బాబు ఈ గేమ్ షోలో ఎంత గెలుచుకున్నారు అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సూపర్‌ స్టార్‌ మహేశ్‌ బాబు రూ. 25 లక్షలు గెలుచుకున్నాడని ప్రచారం జరుగుతోంది. అంతేకాకుండా ఆ మొత్తాన్ని అంతా ఛారిటీ కోసం  కేటాయించారని తెలుస్తుంది. మహేష్ మరోసారి మంచి మనసు చాటుకున్నారంటూ ఫాన్స్ ఖుష్ అవుతున్నారు.

మరిన్ని ఇక్కడ చదవండి : 

Sree Leela : నవ్వే నిండు చందమామ.. ఈ పుత్తడిబొమ్మ.. అందాల శ్రీలీల లేటెస్ట్ ఫొటోస్..

Ramya Krishna: తమిళ బిగ్‌బాస్‌ హోస్ట్‌గా శివగామి!.. కోలీవుడ్‌లో చక్కర్లు కొడుతున్న ఆసక్తికర వార్త..

Akhanda : రికార్డుల మోత మోగాల్సిందే.. డిసెంబర్‌ 2 కోసం ఎదురుచూస్తున్న నందమూరి ఫ్యాన్స్..

అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
అప్పటి వరకు చెప్పులు వేసుకోను.. అన్నామలై సంచలన ప్రకటన
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఫ్రిజ్ వాడుతున్నారా? అయితే ఈ పొరపాట్లు అస్సలు చేయకండి!
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
ఈ పండు క్యాన్సర్‌ని కూడా నయం చేస్తుంది..! రోజుకు రెండు తింటే చాలు
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
గోల్డ్ లోన్ కంపెనీలు మీ బంగారాన్ని ఎందుకు వేలం వేస్తున్నాయి?
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
పెళ్లిళ్లలో క్యాటరింగ్ గర్ల్.. ఇప్పుడు నెట్టింట ఫేమస్..
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
చెప్పులు లేకుండా 20కిలోమీటర్లు నడిచిన గురుకుల విద్యార్థులు..కారణం
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
అరంగ్రేటంలోనే రూల్స్ అతిక్రమించిన సామ్ కొంస్టాస్
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
భారతీయులు కొత్త ఏడాదిలో వీసా లేకుండా ఈ 12 దేశాల్లో పర్యటించవచ్చు!
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
ఎముకలు కొరికే చలిలో.. ఒళ్లు గగుర్పొడిచే సాహసం చేసిన రొనాల్డో
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్
అరెస్ట్ పేరుతో డబ్బు కొట్టేస్తున్న కేటుగాళ్లు..ఈ జాగ్రత్తలు మస్ట్