Godfather : సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతోన్న గాడ్ ఫాదర్.. పదిరోజుల్లో ఎంత వసూల్ చేసిందంటే
ఇక ఈ ఏడాది ఆచార్య సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. భారీగా అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది.
మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ మూవీ ప్రస్తుతం థియేటర్స్ దగ్గర సూపర్ హిట్ గా దూసుకుపోతోంది. మోహన్ రాజా దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో మెగా అభిమానులంతా ఆనందంలో తేలిపోతున్నారు. ఇక ఈ ఏడాది ఆచార్య సినిమాతో చిరంజీవి ప్రేక్షకుల ముందుకు వచ్చారు. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర బోల్తాకొట్టింది. భారీగా అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా దారుణంగా నిరాశపరిచింది. దాంతో ఎలాగైనా సాలిడ్ హిట్ కొట్టాలన్న కసితో మెగాస్టార్ గాడ్ ఫాదర్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఇక ఈ సినిమా మంచి హిట్ అందుకొని బాస్ ఈస్ బ్యాక్ అని నిరూపించారు. ఇక ఈ సినిమాలో కీలక పాత్రలో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ నటించారు. అలాగే లేడీ సూపర్ స్టార్ నయనతార మెగాస్టార్ చెల్లెలిగా నటించి మెప్పించారు.మలయాళ మూవీ లూసీఫర్ సినిమాకు రీమేక్ గా వచ్చిన ఈ సినిమాలో చాల మార్పులు చేర్పులు చేశారు.
ఇక ఈ సినిమా థియేటర్స్ దగ్గర పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడమే కాదు కలెక్షన్స్ కూడా బాగానే రాబడుతుంది. దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచింది నేటితో ఈ సినిమా 10 రోజులు పూర్తి చేసుకుంది. పదిరోజుల్లో గాడ్ ఫాదర్ సినిమా ఎంత వసూల్ చేసిందంటే.
నైజాం 11.80 కోట్లు, సీడెడ్ 9.17 కోట్లు, ఉత్తరాంధ్ర 5.51కోట్లు, ఈస్ట్ 3.53 కోట్లు, వెస్ట్ 2.16 కోట్లు, గుంటూరు 3.80 కోట్లు, కృష్ణా 2.55 కోట్లు, నెల్లూరు 1.92 కోట్లు, ఏపీ- తెలంగాణ (టోటల్) 40.44 కోట్లు, రెస్ట్ ఆఫ్ ఇండియా 4.57 కోట్లు, హిందీ 4.78కోట్లు, ఓవర్సీస్ 4.97 కోట్లు, వరల్డ్ వైడ్ (టోటల్) 54.76కోట్లు (షేర్) రాబట్టింది. ఇక గాడ్ ఫాదర్’ చిత్రానికి అన్ని వెర్షన్లు కలుపుకుని కు రూ.91.2 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.