Balakrishna: బాలయ్య సినిమాలో మరోసారి ఆ స్టార్ హీరోయిన్ కు ఛాన్స్ దక్కిందా.?
ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా..

నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీదున్నారు. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు లైనప్ చేసిన బాలయ్య ఆయా షూటింగ్స్ తో బిజీ అయ్యారు. ఇక ప్రస్తుతం గోపిచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ ఓ సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలో బాలయ్య చాలా పవర్ ఫుల్ గా కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా స్టిల్స్, టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమాలో బాలయ్యకు జోడీగా అందాల భామ శ్రుతిహాసన్ నటిస్తోంది. అలాగే మరో పవర్ ఫుల్ పాత్రలో వరలక్ష్మీ శరత్ కుమార్ కనిపించనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ చివరి దశకు వచ్చేసింది. త్వరలోనే ఈ సినిమా నుంచి టైటిల్ ను అనౌన్స్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిన వెంటనే సక్సెస్ ఫుల్ దర్శకుడు అనిల్ రావిపూడితో సినిమా చేస్తున్నారు బాలయ్య.
ఇటీవలే అనిల్ ఎఫ్3 సినిమాతో మంచి హిట్ ను అందుకున్నాడు. ఇక ఇప్పుడు నటసింహం తో కలిసి సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా స్క్రిప్ట్ పనిలో ఫుల్ బిజీగా ఉన్నాడు అనిల్. ఇదిలా ఉంటే ఈ సినిమాలో బాలయ్య కూతురుగా క్రేజీ హీరోయిన్ శ్రీలీల నటిస్తోందని టాక్ వినిపిస్తోంది. అయితే ఇప్పుడు ఈ సినిమాలో హీరోయిన్ గురించి ఆసక్తికర చర్చ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య సరసన ఓ స్టార్ హీరోయిన్ నటించనుందని తెలుస్తోంది.
బాలయ్య సినిమా కోసం అనీల్ ఏకంగా స్టార్ హీరోయిన్ త్రిషను రంగంలోకి దింపనున్నారట. గతంలో బాలకృష్ణ నటించిన లయన్ సినిమాలో హీరోయిన్ గా చేసింది త్రిష. ఇక ఇప్పుడు మరోసారి బాలయ్యతో కలిసి ఈ చిన్నది నటించనుందని టాక్ ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఇటీవలే త్రిష మణిరత్నం డ్రీమ్ ప్రాజెక్ట్ పొన్నియన్ సెల్వన్ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ఐశ్వర్య రాయ్ తో పోటీగా నటించింది త్రిష. ఇదిలా ఉంటే ఇప్పుడు ఈ అమ్మడు బాలయ్య సినిమాకు ఓకే చెప్తుందా అన్నది సందేహంగా మారింది. దానికి కారణం ఈ సినిమాలో బాలకృష్ణ పక్కన హీరోయిన్ అంటే కథ ప్రకారం శ్రీలీలకు తల్లిగా నటించాలి. మరి తల్లి పాత్రకు త్రిష ఓకే చెప్తుందా లేదా అన్నది తెలియాల్సి ఉంది.
మరిన్ని ఎంటర్టైన్మెంట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.