AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jayam Ravi: ‘ఓసారి అలా ప్రయత్నించండి’.. జయం రవి విడాకుల కేసులో ట్విస్ట్.. కోర్టు కీలక సూచనలు

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి, ఆర్తి 2009లో వివాహం చేసుకున్నారు. వీరి దాంపత్య బంధానికి ప్రతీకగా ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే 18 ఏళ్లు కలిసి కాపురం చేసిన జయం, రవి ఇప్పుడు విడిపోవాలని నిర్ణయించుకున్నారు.

Jayam Ravi: 'ఓసారి అలా ప్రయత్నించండి'.. జయం రవి విడాకుల కేసులో ట్విస్ట్.. కోర్టు కీలక సూచనలు
Jayam Ravi Family
Basha Shek
|

Updated on: Nov 15, 2024 | 6:45 PM

Share

కోలీవుడ్ స్టార్ హీరో జయం రవి విడాకుల కేసులో బిగ్ ట్విస్ట్. ఈ కేసును విచారించిన న్యాయ స్థానం శుక్రవారం (నవంబర్ 15) కీలక ఆదేశాలు జారీ చేసింది. కొద్ది రోజుల క్రితమే తన భార్య ఆర్తితో విడాకులు కావాలని న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు హీరో జయం రవి. అంతకు ముందు ఇదే విషయంపై ఓ బహిరంగ లేఖను కూడా విడుదల చేశాడు. అయితే జయం రవి భార్య ఆర్తి మాత్రం తన భార్యపై సంచలన ఆరోపణలు చేసింది. అసలు విడాకుల విషయం తనకు తెలియదని, రవి చేసిన ప్రకటనతో తాను ఆశ్చర్యపోయానని ఆర్తి కూడా సోషల్ మీడియాలో ఒక లేఖ విడుదల చేసింది. దీంతో తనకు వెంటనే విడాకులు కావాలని జయం రవి కోర్టు మెట్లెక్కాడు. ఈ మేరకు ఫ్యామిలీ కోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేశాడు. తాజాగా రవి పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం.. రాజీ చేసుకునేందుకు ప్రయత్నించాలని రవి, ఆర్తిలకు సూచించింది. శుక్రవారం జరిగిన విచారణకు రవి కోర్టుకు హాజరు కాగా.. ఆయన భార్య ఆర్తి మాత్రం వర్చువల్‌గా హాజరైంది. వీడియో కాల్‌లో అందుబాటులోకి వచ్చింది. విచారణలో భాగంగా ఇరు వర్గాల వాదనలు విన్న న్యాయస్థానం.. మరోసారి ఇద్దరూ కలిసి మాట్లాడుకోవాలని.. రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించాలని జయం రవి- ఆర్తిలకు సూచించింది. మరి కోర్టు సూచనలతో రవి, ఆర్తిలు విడాకులపై వెనక్కు తగ్గుతారా? లేదా? అన్నది తెలియాల్సి ఉంది.

కాగా కోలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ బ్యూటిఫుల్ కపుల్ గా జయం రవి, ఆర్తిలకు మంచి పేరుంది. కానీ ఇప్పుడు విడాకుల కావాలంటూ కోర్టు మెట్లెక్కడం అందరినీ ఆశ్చర్యపరిచింది. సుమారు 18 ఏళ్ల పాటు ఎంతో అన్యోన్యంగా ఉండే వీరిద్దరు విడాకులు తీసుకుంటున్నారని తెలిసి సినీ ప్రముఖులు, అభిమానులు షాక్ అయ్యారు.

ఇవి కూడా చదవండి

కాగా జయం రవి, ఆర్తి విడిపోవడానికి ఓ సింగర్ కారణమని ప్రచారం సాగుతోంది. కొన్నాళ్లుగా ఆమెతో జయం రవి రిలేషన్ షిప్‏లో ఉన్నాడంటూ రూమర్స్ నెట్టింట చక్కర్లు కొట్టాయి. ఈ క్రమంలోనే సింగర్ తో జయం రవి కలిసి ఉన్న ఫొటోలు కూడా నెట్టింట వైరలయ్యాయి. అయితే ఈ వార్తలను జయం రవి ఖండించాడు. ఇక ప్రముఖ నిర్మాత ఎడిటర్ మోహన్ కుమారుడైన జయం రవి ఛైల్డ్ ఆర్టిస్టుగా పలు సినిమాల్ల నటించాడు. ఆ తర్వాత జయం సినిమాతో హీరోగా మారాడు. ఇప్పటివరకు 30కు పైగా సినిమాల్లో నటించిన జయం రవి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. అతను నటించిన పలు సినిమాలు తెలుగులో కూడా విడుదలయ్యాయి.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.