Martin OTT: ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?

యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు ధృవ్ స‌ర్జా కన్నడలో స్టార్ హీరోగా వెలుగొందుతున్నాడు. గతంలో అతను నటించిన పొగరు సినిమా తెలుగులోనూ సూపర్ హిట్ గా నిలిచింది. దీని తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న ఈ యాక్షన్ హీరో లేటెస్ట్ గా మార్టిన్ అనే పాన్ ఇండియా సినిమాతో మన ముందుకు వచ్చాడు.

Martin OTT: ఓటీటీలోకి వచ్చేసిన కన్నడ లేటెస్ట్ యాక్షన్ థ్రిల్లర్.. తెలుగులోనూ చూడొచ్చు.. ఎక్కడంటే?
Martin Movie
Follow us
Basha Shek

|

Updated on: Nov 15, 2024 | 7:15 PM

ఈ ఏడాది క‌న్నడ‌ ప్రేక్ష‌కుల్లో భారీ అంచ‌నాలు రేకెత్తించిన సినిమాల్లో మార్టిన్ ఒక‌టి. ధృవ్ స‌ర్జా ఇందులో హీరోగా నటించాడు. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మూవీ తెరకెక్కింది. యాక్షన్ కింగ్ , సీనియ‌ర్ హీరో అర్జున్ ఈ సినిమాకు క‌థ‌ను అందించడం విశేషం. రిలీజ్ కు ముందు ఈ మూవీ నుంచి రిలీజైన పోస్టర్స్, టీజర్స్ , ట్రైలర్లు మార్టిన్ పై అంచనాలను అమాంతం పెంచేశాయి. ‘కేజీఎఫ్’ తరహా యాక్షన్ సీక్వెన్సులు, ఎలివేషన్లు ఉండడంతో ఈ మూవీపై పాజిటివ్ బజ్ క్రియేట్ అయ్యింది. అందుకు తగ్గట్టుగానే దసరా కానుకగా అక్టోబర్ 11న గ్రాండ్ గా మార్టిన్ మూవీ థియేటర్లలో రిలీజైంది. కన్నడ, తెలుగుతో సహా ఐదు భాషల్లో రిలీజైన ఈ సినిమాకు మొదటి షో నుంచే నెగెటివ్ టాక్ వచ్చింది. బెదరగొట్టే యాక్షన్ సీక్వెన్సలు తప్ప సినిమాలో కొత్త దనం ఏమీ లేదంటూ ప్రేక్షకులు మార్టిన్ పై పెదవి విరిచారు. రివ్యూలు కూడా నెగెటివ్ గా వచ్చాయి. దాదాపు 120 కోట్ల బ‌డ్జెట్‌తో రూపొందిన మార్టిన్ మూవీ ఐదు భాష‌ల్లో క‌లిపి కేవలం 25 కోట్ల‌లోపే వ‌సూళ్ల‌ను రాబ‌ట్టిందని సమాచారం. ఇలా థియేటర్లలో డిజాస్టర్ గా నిలిచిన మార్టిన్ మూవీ సడెన్ గా ఓటీటీలో ప్రత్యక్షమైంది. మార్టిన్ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో శుక్రవారం (నవంబర్ 15) అర్ధరాత్రి నుంచే ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీ స్ట్రీమింగ్ కు అందుబాటులోకి వచ్చింది. . కన్నడతో పాటు తెలుగు, తమిళ, మలయాళ భాషల్లోనూ మార్టిన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది.

మార్టిన్ సినిమాలో ధృవ్ స‌ర్జాకు జోడీగా వైభ‌వి శాండిల్య‌, అన్వేషి జైన్ హీరోయిన్లుగా న‌టించారు. అచ్యుత్ కుమార్, చిక్కన్న, ప్రతాప్ నారాయణ, మాళవిక అవినాష్, వజ్రంగ్ షెట్టి, నవాబ్ షా, రోహిత్ పాఠక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. కేవీఎన్ ప్రొడక్షన్స్ సంస్థ నిర్మించిన ఈ సినిమాకు కేజీఎఫ్ ఫేమ్ రవి బ్రసూర్ స్వరాలు సమకూర్చారు. యాక్షన్ సినిమాలను ఇష్టపడే వారు మార్టిన్ సినిమాను ఒకసారి చూడొచ్చు.

ఇవి కూడా చదవండి

అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్..

మార్టిన్ సినిమా ట్రైలర్..

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.