Check Movie : రెగ్యులర్ సినిమాలకు భిన్నంగా వచ్చిన నితిన్ ‘చెక్’.. మూవీ ఎలా ఉందంటే..
లవర్ బాయ్ నేమ్ కమాయించిన నితిన్.. తన కెరీర్‌లో ఎన్నో లవ్ స్టోరీల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఆ మధ్య వరస ఫ్లాపులతో సతమతమైన నితిన్ ఆతర్వాత మంచి కథలను ఎంచుకుంటూ నిలదొక్కుకున్నాడు.
Check Movie Review:
నటీ నటులు: నితిన్,ప్రియా ప్రకాశ్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్, సాయిచంద్, సంపత్ రాజ్, పోసాని కృష్ణ మురళి, మురళీ శర్మ
దర్శకుడు: చంద్రశేఖర్ యేలేటి
మ్యూజిక్ : కల్యాణిమాలిక్
నిర్మాత : వి. ఆనంద ప్రసాద్
లవర్ బాయ్ నేమ్ కమాయించిన నితిన్.. తన కెరీర్‌లో ఎన్నో లవ్ స్టోరీల్లో నటించి ఆకట్టుకున్నాడు. ఆ మధ్య వరస ఫ్లాపులతో సతమతమైన నితిన్ ఆతర్వాత మంచి కథలను ఎంచుకుంటూ నిలదొక్కుకున్నాడు. ఇప్పుడు తన పందాను మార్చుకుని చంద్రశేఖర్ ఏలేటి డైరెక్షన్‌లో ఓ డిఫరెంట్ కథతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు నితిన్.
చాలా సంవత్సరాల గ్యాప్ తరువాత చంద్రశేఖర్ యేలేటి చెక్ సినిమాని డైరెక్ట్ చేయడం.. ప్రేమ కథలతో అభిమానుల దిల్ ఖుష్ చేసే నితిన్.. తన పంథాను మార్చుకుని డిఫరెంట్ కథను ఎంచుకోండం. చెస్ గేమ్ నేపథ్యంలో ఈ సినిమా సాగుతుందడడంతో.. ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు.. జనాల్లో విపరీతమైన హైప్ క్రియేట్ అయింది. మరి ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందా..? ఖైదీగా నితిన్ నటన ఎలా ఉంది? చంద్రశేఖర్ యేలేటి టేకింగ్ ఏవిధంగా ఉందో.. తెలుసుకుందాం…!
కథ :
ఉగ్రవాదిగా ముద్రపడిన ఆదిత్య అలియాస్ నితిన్, ఉరిశిక్ష పడటంతో రోజులు లెక్కపెడుతుంటాడు. ఉగ్రవాదిని కాదని తానెలాంటి నేరం చేయలేదని చెప్పినా ఎవరూ వినకపోవడంతో కోర్టులో పిటిషన్ వేస్తాడు. దీంతో ఈ కేసును వాదించడానికి ముందుకొస్తుంది న్యాయవాది మానస అలియాస్ రకుల్‌ప్రీత్ సింగ్. ఇలా కోర్టులో కేసు కొనసాగుతుండగా, నితిన్ జైలులో సహ ఖైదీ శ్రీమన్నారాయణ (సాయిచంద్) దగ్గర చెస్ నేర్చుకుంటాడు. కోర్టులో దారులన్నీ మూసుకుపోవడం.. చివరికి రాష్ట్రపతి క్షమాభిక్ష కూడా నోచుకోకపోవడంతో… ఉరి కంబం నుంచి ఆదిత్య ఎలా బయటపడ్డాడు? అందుకు తాను నేర్చుకున్న చెస్ ఎలా సాయపడింది? ఈ కథలో యాత్ర అసలు ప్రియా ప్రకాశ్ వారియర్ ఎవరు? లాంటి విషయాలతో డైరెక్టర్ ఈ స్టోరీని తీర్చిదిద్దాడు.
వివరణ :
అసుల ఈ సినిమా మొత్తం కథకు అనుగుణంగానే తెరకెక్కింది. హీరో కోసం ఫైట్‌లు.. అభిమానుల కోసం ఐటెం సాంగులు డ్యాన్స్‌లంటూ.. ఎలాంటి కమర్షల్ ఆర్భాటాలు ఈ సినిమాలో లేవు. ఇక సినిమాలో హీరో జైలు ముందు జీవితం చూపించేందుకు ప్రియా వారియర్‌తో తనకున్న సంబంధాన్ని ప్రేక్షకులకు చెప్పేందుకు మాత్రమే ఓ పాటను వాడుకున్నాడు డైరెక్టర్. ఫస్ట్ ఆఫ్‌లో ఆదిత్య అలియాస్ నితిన్ ప్రపంచంలోకి తీసుకెళతాడు డైరెక్టర్. ఆ తరువాత మెళ్లి మళ్లీ కథ ఇంట్రెస్టింగ్ గా సాగుతూ.. జైలు లోకి వెళ్లగానే టాప్ గేర్‌ను అందుకుంటుంది. జైలులో ఆధిత్య చెస్ గేమ్‌ను నేర్చుకోవండం.. ఆ ఆటలో నిష్ణాతుడై.. ఉరిశిక్ష నుంచి బయట పడేందుకు ట్రై చేయడం దగ్గర నుంచి ప్రేక్షకుడు ఈ స్టోరీకి విపరీతంగా కనెక్ట్ అవుతాడు. ఇక ఈ సినిమా అంతా ఒకెత్తైతే, పతాక సన్నివేశాలు మరో ఎత్తు.. డైరెక్టర్ మార్క్ టేకింగ్.. నితిన్ యాక్టింగ్ స్పష్టంగా కనిపించేలా చేస్తుంది.
ఎవరు ఎలా చేసారంటే :
ఇక ఈ సినిమాకి నితినే వన్ మేన్ షో. ఉరిశిక్ష పడిన ఖైదీగా సహజసిద్దంగా యాక్ట్ చేస్తూనే.. తన క్లైమాక్స్‌లో తన ఎమోషనల్ నటించి అందరిని ఆక్టుకుంటాడు. రకుల్‌ప్రీత్ సింగ్ మానస అనే న్యాయవాదిగా కనిపించి తన పాత్రకు న్యాయం చేస్తుంది. ఇక తెలుగులో ఫస్ట్ టైం నటిస్తున్న ప్రియా ప్రకాశ్ వారియర్ కథని మలుపు తిప్పే ఓ చిన్న పాత్రలో సూపర్‌గా యాక్ట్ చేసింది. ఉన్న ఒక్క పాటతో కుర్రకారును ఆకట్టుకునే ప్రయత్నం చేసింది. కల్యాణిమాలిక్ నేపథ్య సంగీతం చిత్రానికి ప్లస్‌గా మారగా… నరేశ్ అందించిన మాటలు కథకి బలాన్నిచ్చాయి. ఇక డైరెక్టర్ చంద్రశేఖర్ యేలేటి మరోసారి ఓ కొత్త రకమైన కథని తెలుగు ప్రేక్షకులకు అందించి మరో సారి హిట్ట కొట్టాడనేలా ఈ సినిమా అనుభూతినిస్తుంది.
చివరిగా :
ఆసక్తిగా సాగే గేమ్ ‘చెక్‘