Karate Kalyani: నా భర్త చిత్రహింసలు పెట్టేవాడు.. తాగొచ్చి రోజు కొట్టేవాడు.. కరాటే కళ్యాణి షాకింగ్ కామెంట్స్
కరాటే కళ్యాణి పలు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తూనే నిత్యం ఎదో ఒక విషయంలో ఆమె వార్తల్లో నిలుస్తున్నారు.

క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రాణించిన నటీమణుల్లో కరాటే కళ్యాణి ఒకరు. చాలా సినిమాల్లో కళ్యాణి నటించి మెప్పించారు. లేడీ కమెడియన్ గాను ఆమె అలరించారు. ఇక కరాటే కళ్యాణి పలు వివాదాలతోనూ వార్తల్లో నిలుస్తూ ఉంటారు. సినిమా ఇండస్ట్రీలో నటిగా రాణిస్తూనే నిత్యం ఎదో ఒక విషయంలో ఆమె వార్తల్లో నిలుస్తున్నారు. ఇటీవలే రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ కంపోజ్ చేసిన పాట పై కూడా ఆమె అభ్యంతరం వ్యక్తం చేసి.. ఆ పాట పై పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు. ఇదిలా ఉంటే తాజాగా ఆమె తన వైవాహిక జీవితం గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు. జీవితంలో కరాటే కళ్యాణి ఎన్ని ఒడిడుకులు చూశారు. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని స్ట్రాంగ్ ఉమెన్ గా నిలబడ్డారు కళ్యాణి. అయితే ఆమె వైవాహిక జీవితం మాత్రం అంత సజావుగా సాగలేదు. తాజాగా కళ్యాణి మాట్లాడుతూ.. తన భర్త నిత్యం తాగివచ్చి కొట్టేవాడని అన్నారు.
అలాగే.. కరాటే కళ్యాణి మాట్లాడుతూ.. నన్ను చాలా మంది తప్పుగా అర్ధం చేసుకుంటూ ఉంటారు. అందరితో ఎప్పుడూ గొడవలు పెట్టుకుంటూ ఉంటానని అనుకుంటూ ఉంటారు. కానీ నాణేనికి మరో ఒకవైపే చూడకూడాదు మరో వైపు కూడా చూడాలి. నేను మంచిదాని నలుగురికి సాయం చేసే గుణం నాది. ఎవరైనా కష్టాల్లో ఉంటే నేను తట్టుకోలేను అన్నారు ఆమె.
ఇక వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుతూ.. పెళ్లి జరిగిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని.. తన భర్త చిత్రహింసలు పెట్టేవాడిని.. రోజు తాగొచ్చి తనను కొట్టేవాడని అన్నారు. అలాగే ఒకసారి తాగి నడి రోడ్డుపై అందరూ చూస్తుండగానే నా బట్టలు లాగారని షాకింగ్ కామెంట్స్ చేశారు.ఇక అతని చిత్రహింసలు భరించలేక విడిపోయానని అన్నారు. ఇక ఇంట్లో ఆమె తల్లి రెండో పెళ్లి చేసుకోమని అంటున్నారని.. జీవితంలో ఒక తోడు అవసరం అని తన తల్లి చెప్తున్నారని.. తాను కూడా ఆ దిశగా అడుగులువేస్తున్నాని తెలిపారు కరాటే కళ్యాణి.








