Kaikala Satyanaryana: కైకాల సత్యనారాయణ చివరి కోరిక అదే.. కానీ ఇంతలోనే ఇలా
యముడి పాత్రకు కైకాల పెట్టింది పేరు. యమధర్మ రాజు ఇలానే ఉంటారా అనేంతలా మెప్పించారు కైకాల. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి డూప్ గా మారి.. ఆ తర్వాత హీరోగా.. విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు.

తెలుగు సినిమా గర్వించదగ్గ నటుడు కైకాల సత్యనారాయణ. ఆయన గతకొంతకాలంగా అనారోగ్యంతో భాదపడుతూ నిన్న (23)న తెల్లవారుజామున కనుమూశారు. కైకాల మరణవార్తతో సినీ ఇండస్ట్రీ శోకసంద్రంలో మునిగిపోయింది . దాదాపు 777 ల సినిమాల్లో నటించి మెప్పించారు కైకాల. ముఖ్యంగా యముడి పాత్రకు కైకాల సత్యనారాయణ పెట్టింది పేరు. యమధర్మ రాజు ఇలానే ఉంటారా అనేంతలా మెప్పించారు కైకాల. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి డూప్ గా మారి.. ఆ తర్వాత హీరోగా.. విలన్ గా .. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మెప్పించారు. వైవిధ్య పాత్రలకు కైకాల కేరాఫ్ అడ్రస్. నాలుగు తరాల నటులతో నటించి అలరించారు కైకాల.. ఇటీవల కాలంలో వయోభారంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు ఆయన. చివరిగా మహేష్ బాబు నటించిన మహర్షి సినిమాలో కనిపించారు. కైకాల కన్నుమూతతో సినీలోకం శోకసంద్రంగా మారింది.
అయితే కైకాలకు ఓ బలమైన కోరిక ఉందట.. అది తీరకుండానే ఆయన కన్నుమూశారు. ఓ మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలని కైకాల అనుకున్నారట. గతంలో ఎన్టీఆర్, సూపర్ స్టార్ కృష్ణ కలిసి నటించిన దేవుడు చేసిన మనుషులు సినిమాలో కైకాల కీలక పాత్రలో కనిపించారు. 1973లో విడుదలైన దేవుడు చేసిన మనుషులు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యింది.




ఆ తరువాత జనరేషన్ చిరంజీవి-బాలకృష్ణ కలిసి మల్టీస్టారర్ చేస్తే చూడాలని.. ఆ చిత్రంలో నటించాలని కైకాల ఆశపడ్డారట. కానీ ఆ కోరిక తీరకుండానే కన్నుమూశారు. ఇటీవల యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటించిన ఆర్ఆర్ఆర్ సినిమా చూసి చాలా ఆనందించారట కైకాల సత్యనారాయణ. ఇక నేడు ఆయన అంత్యక్రియలు హైదరాబాద్ లోని మహాప్రస్థానంలో జరగనున్నాయి. అధికార లాంఛనాలతో కైకాల అంత్యక్రియలు నిర్వహించనున్నారు.




