Tollywood : అదృష్టం అంటే ఈ అమ్మాడిదే.. ఒకప్పుడు ఇన్ స్టాలో రీల్స్ చేసింది.. ఇప్పుడు హీరోయిన్గా క్రేజ్..
ఒకప్పుడు సినీరంగంలో అడుగుపెట్టాలంటే ఎంతో కష్టతరమే. అవకాశాల కోసం ప్రతి నిర్మాణ సంస్త వద్దకు వెళ్లి అడగాల్సి వచ్చేది. ఎన్నో అవమానాలు, విమర్శలు తీసుకుని వచ్చిన ప్రతి ఆఫర్ సద్వినియోగం చేసుకున్నవారు ఉన్నారు. కానీ ఇప్పుడు సోషల్ మీడియా ప్రపంచంలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఇన్ స్టాలో రీల్స్ చేసి పాపులర్ అయిన తారలు చాలా మంది ఉన్నారు.

సినీరంగంలో అడుగుపెట్టి నటీనటులుగా గుర్తింపు తెచ్చుకున్నవారు చాలా మంది ఉన్నారు. అవమానాలు, విమర్శలను భరించి తమ ప్రతిభతో మంచి మార్కులు కొట్టేసినవారు ఉన్నారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సినిమాల్లో నటీనటులుగా అవకాశాలు అందుకోవడానికి ఇప్పుడు సోషల్ మీడియా సహాయపడుతుంది. ఇన్ స్టాలో రీల్స్ చేసి పాపులర్ అయినవారు.. ఇప్పుడు హీరోయిన్లుగా సినిమాల్లో అవకాశాలు అందుకుంటున్నారు. అలాంటి వారిలో ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న హీరోయిన్ ఒకరు. ఒకప్పుడు సినిమా ప్రమోషన్స్ కోసం రీల్స్ చేసిన ఆ బ్యూటీ.. ఇప్పుడు హీరోయిన్ అయ్యింది. ఆమె మరెవరో కాదండి.. నిహారిక ఎన్ఎమ్. ఆమెకు ఇన్ స్టాలో 3.5 మిలియన్ల మంది ఫాలోవర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి : Actress: కేకపెట్టిందిరోయ్.. గ్లామర్ ఫోజులతో సెగలు పుట్టించిన సీరియల్ బ్యూటీ.. హీటెక్కిస్తోన్న వయ్యారి..
ఒకప్పుడు ఇన్ స్టాలో రీల్స్ చేస్తూ తనకంటూ ఓ రేంజ్ ఫాలోయింగ్ సొంతం చేసుకుంది. పెరుసు సినిమాతో కథానాయికగా తమిళంలోకి తెరంగేట్రం చేసింది. కార్తీక్ సుబ్బరాజు నిర్మించిన ఈ చిత్రానికి ఇళంగో రామ్ దర్శకత్వం వహించారు. ఇందులో వైభవ్ ప్రధాన పాత్ర పోషించారు. ఈ సినిమాతో నటిగా మంచి మార్కులు కొట్టేసింది. దీంతో ఆమెకు సౌత్ ఇండస్ట్రీలో వరుస అవకాశాలు తలుపు తట్టాయి. ఇటీవలే మిత్రమండలి సినిమాలో నటించింది. ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటించిన ఈచిత్రంతో తెలుగు తెరకు పరిచయమైంది. తర్వాత ఆమె తెలుగులో ఆల్కహాల్ చిత్రంలో కనిపించనున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 1న థియేటర్లలో విడుదల కానుంది.
ఇవి కూడా చదవండి : Cinema : 64 ఏళ్ల హీరో సరసన 27 ఏళ్ల హీరోయిన్.. కట్ చేస్తే.. బాక్సాఫీస్ షేక్ చేసిన సినిమా..
ఆకాష్ భాస్కరన్ దర్శకత్వంలో అథర్వ నటిస్తున్న ‘ఇదయం మురళి‘ చిత్రంలో కూడా నిహారిక కీలక పాత్ర పోషిస్తోంది. తెలుగు, తమిళం భాషలలో వరుస చిత్రాల్లో నటిస్తుంది. మొదట్లో ఇన్ స్టాలో సినిమా ప్రమోషన్స్ కోసం రీల్స్ చేసేది. కేజీఎఫ్ సినిమా కోసం యష్ తో కలిసి చేసిన రీల్ పాపులర్ కావడంతో ఒక్కసారిగా ఫేమస్ అయ్యింది నిహారిక. ఇప్పుడు కథానాయికగా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజీగా ఉంటుంది.
View this post on Instagram
ఇవి కూడా చదవండి : Meenakshi Chaudhari: ఆ హీరో సినిమాలో నటించి తప్పు చేశాను.. వారం రోజులు అలాంటి బాధ.. మీనాక్షి చౌదరి..




