
పైన ఫోటోలో తలకిందులుగా వేలాడుతున్న అమ్మాయి ఎవరో తెలుసా.. ? ఒకప్పుడు తెలుగులో తోపు హీరోయిన్. నార్త్ నుంచి సౌత్ ఎంట్రీ ఇచ్చి.. తక్కువ సమయంలోనే స్టార్ డమ్ సంపాదించుకుంది. ఆమె మరెవరో కాదు.. హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్. కెరటం సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుసగా అవకాశాలు దక్కించుకుంది. లౌక్యం, నాన్నకు ప్రేమతో, ధృవ, సరైనోడు వంటి హిట్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. తెలుగుతోపాటు తమిళంలోనూ పలు సినిమాల్లో నటించింది. అయితే కొన్నాళ్లుగా బాక్సాఫీస్ వద్ద ఈ అమ్మడు నటించిన సినిమాలు డిజాస్టర్స్ కావడంతో నెమ్మదిగా అవకాశాలు తగ్గిపోయాయి. దీంతో బాలీవుడ్ షిఫ్ట్ అయ్యింది.
హిందీలోనూ ఈ బ్యూటీకి అంతగా అవకాశాలు రాలేదు. దీంతో కొద్ది రోజుల క్రితం తన ప్రియుడు జాకీ భగ్నానీని పెళ్లి చేసుకుని ఫ్యామిలీ లైఫ్ ఎంజాయ్ చేస్తుంది. చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న రకుల్.. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను అలరిస్తుంది. తాజాగా తలకిందులుగా వేలాడుతూ యోగా ఆసనాలు వేస్తున్న ఫోటోస్ పంచుకుంది.
ప్రస్తుతం ఈ అమ్మడు దే దే ప్యార్ దే 2 చిత్రంలో నటిస్తుంది. ఇందులో అజయ్ దేవగణ్, మాధవన్ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. ఈ ఏడాది ఈ చిత్రాన్ని విడుదల చేయనున్నారు మేకర్స్.
ఇవి కూడా చదవండి :
Kota Srinivasa Rao: సినిమాలంటే ఆసక్తి లేకుండానే 750 పైగా చిత్రాలు.. ఎలా చేశారో తెలుసా..?
Tollywood: ఒక్క సినిమా చేయకుండానే క్రేజీ ఫాలోయింగ్.. నెట్టింట గ్లామర్ అరాచకమే ఈ అమ్మడు..