Tollywood: జిమ్లో స్టార్ హీరో కష్టాలు.. బాక్సాఫీస్ షేక్ చేసేందుకు రెడీ అయిన స్టార్.. ఎవరంటే..
సినీరంగంలో స్టార్ హీరోగా వెలిగిపోవాలంటే యాక్టింగ్ మాత్రమే కాదు..అందుకు తగిన లుక్స్ సైతం ఇంపార్టెంట్. అందుకే స్టార్ హీరోహీరోయిన్స్ తమ ఫిట్నెస్ కాపాడుకోవడానికి ఎంతగా కష్టపడతారో చెప్పక్కర్లేదు. నిత్యం జిమ్లో కష్టతరమైన వ్యాయమాలు చేస్తుంటారు. తాజాగా ఓ హీరో జిమ్ లో తెగ కష్టపడుతున్న ఫోటో నెట్టింట వైరలవుతుంది. అందులో ఆ స్టార్ హీరో లుక్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఫ్యాన్స్.

సాధారణంగా హీరో అంటే అందం మాత్రమే కాదు కటౌట్ కూడా ముఖ్యమే. అద్భుతమైన యాక్టింగ్.. అందుకు తగినట్లుగా తమ ఫిట్నెస్ కాపాడుకుంటారు. ప్రతిరోజు జిమ్ లో వ్యాయమాలు, వర్కౌట్స్ చేస్తూ ఎంతో కష్టపడుతుంటారు. అటు హీరోయిన్స్ సైతం జిమ్ లో కష్టతరమైన వర్కవుట్స్ చేస్తుంటారు. తాజాగా టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఓ స్టార్ హీరో జిమ్ ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో కనిపిస్తున్న ఆ హీరో ఇప్పుడు బాక్సాఫీస్ ఏలేందుకు రెడీ అవుతున్నాడు. ఇప్పటికే ఎన్నో హిట్ చిత్రాల్లో నటించి తనకంటూ సెపరేట్ ఫ్యాన్ బేస్ క్రియేట్ చేసుకున్నాడు. ఇక ఇప్పుడు తన కొత్త ప్రాజెక్ట్ కోసం రెడీ అవుతున్నాడు. ఇంతకీ ఆ స్టార్ ఎవరో తెలుసా..? తనే సాయి ధరమ్ తేజ్ అలియాస్ సాయి దుర్గా తేజ్. ప్రస్తుతం జిమ్ లో తెగ కష్టపడుతున్నట్లు తెలుస్తోంది.
సాయి దుర్గా తేజ్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా సంబరాల ఏటి గట్టు. ఈ సినిమా కోసం తేజ్ ఎంతో కష్టపడుతున్నాడు. ఇప్పటికే తన బాడీని పూర్తిగా మార్చేశాడు. కండలు తిరిగిన దేహంతో కనిపిస్తున్నాడు. సంబరాల ఏటి గట్టు టైటిల్ గ్లింప్స్ లో తేజ్ కనిపించిన తీరు చూసి ఇటు ఫ్యాన్స్ సైతం షాకయ్యారు. మొదటిసారిగా తేజ్ సరికొత్త లుక్ లో కనిపిస్తున్నాడని.. దీంతో ఈసారి బాక్సాఫీస్ షేక్ చేయడం ఖాయమంటున్నారు. కొన్ని నెలలుగా ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతుంది.
ఇదిలా ఉంటే.. తాజాగా తేజ్ జిమ్ లో కష్టపడుతున్న ఫోటోను ట్రైనర్ షేర్ చేశాడు. ఆ ఫోటోలో తేజ్ దండం పెడుతూ..ఇక నా వల్ల కాదురా బాబోయ్ అన్నట్లుగా కనిపిస్తుంది. అలాగే ఆ ఫోటోలో తేజ్ బాడీ చూసి షాకవుతున్నారు. చివరిసారిగా విరూపాక్ష, బ్రో చిత్రాల్లో కనిపించిన తేజ్ కు.. ఇప్పుడు ఫోటోలో కనిపిస్తున్న తేజ్ కు చాలా డిఫరెన్స్ ఉందని అంటున్నారు. ఇప్పుడిప్పుడే విభిన్నమైన కంటెంట్ కథలను ఎంచుకున్నాడని కామెంట్స్ చేస్తున్నారు.
View this post on Instagram
ఇది చదవండి : Tollywood: తస్సాదియ్యా.. గ్లామర్ బ్యూటీలో ఈ టాలెంట్ కూడా ఉందా..? ఎవరో తెలుసా..
Tollywood: 7 సంవత్సరాల్లో 3 పెళ్లిళ్లు చేసుకున్న హీరోయిన్.. ఇప్పటికీ ఒంటరిగానే జీవితం.. ఎవరంటే..
Tollywood: వారెవ్వా.. మెంటలెక్కిస్తోన్న మల్లీశ్వరి చైల్డ్ ఆర్టిస్ట్.. ఎంతగా మారిపోయింది.. ?
Tollywood: ఇండస్ట్రీలోనే అత్యంత ఖరీదైన విడాకులు.. ఆ స్టార్ హీరో భార్యకు ఎంత భరణం ఇచ్చాడంటే..




