Tollywod: రామ్ చరణ్‌తో ఉన్న ఈ అమ్మాయిని గుర్తుపట్టారా..? తను ఇప్పుడు చాలా ఫేమస్..
ఈ త్రో బ్యాక్ ఫోటోలో రామ్ చరణ్‌తో ఉన్న అమ్మాయిని గుర్తుపట్టారా..? తను ఇప్పుడు తెలుగు ఇండస్ట్రీలో సెలబ్రిటీ. అంతేకాదు బిగ్ బాస్ షోలో కూడా పార్టిసిపేట్ చేసింది. తనెవరో మీరు గుర్తుపట్టగలరా..? ఎనీ గెస్ .. .. . ..

బ్యాగ్రౌండ్ ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అవ్వాలని లేదు. ఇండస్ట్రీ వారి ఫ్యామిలీ వాళ్లు ఉంటే ఎంట్రీ ఈజీ అవుతుందేమో కానీ.. సక్సెస్ అయి నిలదొక్కుకుని రాణించాలంటే మాత్రం హార్డ్ వర్క్, డెడికేషన్ కావాలి. అలా చిరు తనయుడిగా ఇండస్ట్రీకి వచ్చి.. తనను తాను ప్రూవ్ చేసుకుని ఈ రోజు గ్లోబల్ స్టార్ అయ్యాడు రామ్ చరణ్ తేజ్. నటుడిగా చెర్రీ ఎదుగుదల చూసి.. చిరుతో పాటు మెగా ఫ్యాన్స్ తెగ ఆనందపడిపోతున్నారు. ప్రస్తుతం బుచ్చిబాబు డైరెక్షన్‌లో పెద్ది సినిమా చేస్తున్నాడు చరణ్. కాగా చరణ్ ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ కనపడుతుంది. ఆ ఫోటోలో రామ్ చరణ్ పక్కన ఓ అమ్మాయి ఉంది. ఇది చాలా ఏళ్ల క్రితం తీసిన ఫోటో. కాగా ఆ ఫోటోలోని అమ్మాయి ఎవరో మీరు కనిపెట్టగలరా…?
తను కూడా ఇప్పుడు తెలుగు నాట మంచి పేరు తెచ్చింది. సీని ఇండస్ట్రీకి చెందిన మహిళే. ఇంకా క్లూ కావాలంటే తను ఫేమస్ డ్యాన్స్ కొరియోగ్రాఫర్. అది ఇప్పుడు పట్టేసి ఉంటారు. అవును తను లేడీ కొరియోగ్రాఫర్‌గా రాణిస్తోన్న అనీ మాస్టర్. చాలామంది పెద్ద హీరోల సినిమాల్లో పాటలకు ఆమె కొరియోగ్రఫీ చేశారు.. చేస్తున్నారు. అలాగే బిగ్ బాస్ 5లో పాల్గొని అలరించారు. కాగా అనీ మాస్టర్.. కెరీర్ ప్రారంభంలో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్‌గా చేశారు. ఆ సమయంలో చరణ్‌తో తీసుకున్న ఫోటో వైరల్‌గా మారింది.
View this post on Instagram




