- Telugu News Photo Gallery Cinema photos Guess This Actress Who Is Famous Tik Tak Videos and Now Crazy Heroine In Telugu, Her Name Is Deepika Pilli
Tollywood : టిక్ టాక్ వీడియోలతో ఫేమస్.. బుల్లితెరపై యాంకర్.. ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ హీరోయిన్..
ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంటున్న తెలుగమ్మాయిలలో ఈ హీరోయిన్ ఒకరు. టెక్ టాక్ వీడియోలతో ఫేమస్ అయ్యింది. తర్వాత యాంకర్ గా బుల్లితెరపై అలరించింది. ఇక ఇప్పుడు కథానాయికగా తెలుగు ప్రేక్షకులకు అలరిస్తుంది. ఇంతకీ ఈ ముద్దుగుమ్మ ఎవరంటే. తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన అమ్మాయి..
Updated on: Nov 16, 2025 | 7:15 PM

పైన ఫోటోలో కనిపిస్తున్న హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.. ? టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యింది. ఆ తర్వాత బుల్లితెరపై యాంకర్ గా గుర్తింపు తెచ్చుకుంది. ఇక ఇప్పుడు తెలుగులో హీరోయిన్ గా ఫేమస్ అయ్యింది. ఇంతకీ ఈ అమ్మడు ఎవరో తెలుసా..

అప్పట్లో టిక్ టాక్ వీడియోలతో పాపులర్ అయ్యింది. ఒకప్పుడు ఆమెకు టిక్ టాక్ ఫాలోవర్ల సంఖ్య దాదాపు 1.1 మిలియన్లు పైగానే ఉండేది. ఆ తర్వాత నెమ్మదిగా బుల్లితెరపైకి అడుగుపెట్టింది. ప్రముఖ డ్యాన్స్ షో ఢీలో యాంకర్ అండ్ మెంటార్ గా అలరించింది.

ఈషోతో గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. తర్వాత కథానాయికగా సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆమె మరెవరో కాదండి.. హీరోయిన్ దీపికా పిల్లి. స్టార్ యాంకర్ ప్రదీప్ మాచి రాజుతో కలిసి అక్కడ అమ్మాయి- ఇక్కడ అమ్మాయి సినిమాలో నటిస్తుంది.

ఈ సినిమాకు మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ ఆశించిన స్థాయిలో అవకాశాలు రాలేదు. దీంతో సినీరంగంలో సైలెంట్ అయ్యింది. కానీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది. నిత్యం ఏదోక పోస్ట్ చేస్తూ నెటిజన్లను ఆకట్టుకుంటుంది.

ప్రస్తుతం ఈ అమ్మడు బ్లాక్ డ్రెస్ లో మిర్రర్ ముందు దిగిన సెల్ఫీ ఫోజులు నెట్టింట తెగ వైరలవుతున్నాయి. చాలా కాలం తర్వాత ఈ క్రేజీ బ్యూటీ ఫోటోస్ చూసి ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ఇప్పుడు నెట్టింట ఈ అమ్మడుకు ఓ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.




