Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tollywood: అజిత్ ఒడిలో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఫేమస్ హీరో..

విభిన్న కంటెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఫస్ట్ మూవీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. మంచి కథాంశం ఉన్న సినిమాలను ఎంచుకుని తమిళ చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇటీవల అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి.

Tollywood: అజిత్ ఒడిలో ఉన్న ఈ కుర్రాడు ఎవరో తెలుసా.. ? ఇప్పుడు ఫేమస్ హీరో..
Actor
Follow us
Rajitha Chanti

|

Updated on: Oct 01, 2024 | 8:35 AM

సెలబ్రిటీల చిన్ననాటి ఫోటోలు తరచుగా ఇంటర్నెట్‌లో వైరల్ అవుతుంటాయి. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ఇండస్ట్రీలకు చెందిన సినీతారల చైల్డ్ హుడ్ ఫోటోస్, త్రోబ్యాక్ పిక్స్ చూసేందుకు నెటిజన్స్ ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే తమిళ్ స్టార్ హీరో అజిత్ త్రోబ్యాక్ ఫోటో ఒకటి నెట్టింట చక్కర్లు కొడుతుంది. పైన ఫోటోను చూశారు కదా.. అందులో అజిత్ ఒడిలో కూర్చున్న ఆ చిన్నోడు ఇప్పుడు సౌత్ ఇండస్ట్రీలో చాలా ఫేమస్ హీరో. ముఖ్యంగా తమిళ్ చిత్రపరిశ్రమలో మంచి ఫాలోయింగ్ ఉన్న స్టార్. విభిన్న కంటెంట్ చిత్రాల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. అతడి ఫస్ట్ మూవీ పేరునే తన ఇంటిపేరుగా మార్చుకున్నాడు. మంచి కథాంశం ఉన్న సినిమాలను ఎంచుకుని తమిళ చిత్రసీమలో తనకంటూ ఓ స్థానాన్ని నిలబెట్టుకుంటున్నాడు. ఇటీవల అతడు నటించిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద మంచి రెస్పాన్స్ అందుకుంటున్నాయి. అతడు మరెవరో కాదండి.. స్టార్ హీరో అట్టకత్తి దినేశ్.

ఈ హీరోకు తెలుగులో అంతగా గుర్తింపు రాలేదు. కానీ కోలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ హీరో. 2012 సంవత్సరంలో విడుదలైన అట్టకత్తి చిత్రంతో తమిళ సినీ ప్రపంచంలోకి అడుగుపెట్టాడు. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్నాడు. అట్టకత్తి దినేష్ అసలు పేరు దినేష్ రవి. కానీ మొదటి సినిమా అట్టకత్తి హిట్ కావడంతో తన పేరును అట్టకత్తి దినేష్ గా మారారు. ఆ తర్వాత కోకిల, తిరుడాన్ పోలీస్, ఇందిర, తమిళనుకు ప్రెస్ నంబర్ 1, కబాలి, ఒరు నార్ కూత్తు, అన్నానుకు జే వంటి సినిమాలతో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యాడు దినేష్.

ఇవి కూడా చదవండి

అట్టకత్తి దినేష్, హీరో విజయ్ సేతుపతి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. దాదాపు ఇద్దరూ ఒకేసారి ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. మొదట్లో వీరిద్దరు సినిమాల్లో చిన్న చిన్న పాత్రలు పోషించి ఆ తర్వాత హీరోలుగా ఎదిగారు. దినేష్ ప్రధాన పాత్రలో నటించిన లబ్బర్ పండు సినిమా ఇటీవలే అడియన్స్ ముందుకు వచ్చింది. తమిళరసన్ పచ్చముత్తు దర్శకత్వం వహించిన ఈఈ సినిమాలో హరీష్ కళ్యాణ్ హీరోగా నటించారు. సరదాగా సాగే ఈ క్రికెట్ డ్రామాకు మంచి రెస్పాన్స్ వచ్చింది.

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.