Tollywood: అమ్మాయిల హృదయాల్లో ఈ కుర్రాడు యువరాజు.. యూత్‏కు ఇష్టమైన స్టార్ హీరోను గుర్తుపట్టగలరా..?

కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు తమ ప్రతిభతో వెండితెరపై హీరోలుగా రాణిస్తున్నారు. మరికొందరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఇప్పుడు కథానాయకులుగా మారారు. ఆ జాబితాలో ఈ చిన్నోడు ఒకరు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఓ స్టార్ హీరో ఉన్నాడు. గుర్తుపట్టారా ?.. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఒంటరిగా సినీ రంగుల ప్రపంచవైపు నడిచాడు. సహాయ దర్శకుడిగా కెరీర్ ఆరంభించి ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. అతడు మరెవరో కాదండి..

Tollywood: అమ్మాయిల హృదయాల్లో ఈ కుర్రాడు యువరాజు.. యూత్‏కు ఇష్టమైన స్టార్ హీరోను గుర్తుపట్టగలరా..?
Actor
Follow us

|

Updated on: May 04, 2024 | 9:59 AM

తెలుగు సినీ పరిశ్రమలో ఎలాంటి యాక్టింగ్ బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండా నటీనటులుగా నిలదొక్కుకున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. నటుడిగా ఓ గుర్తింపు తెచ్చుకోవాలనే లక్ష్యంతో ఎన్నో అడ్డంకులు, మరెన్నో అవమానాలు ఎదుర్కొని ఇప్పుడు స్టార్ హీరోలుగా కొనసాగుతున్నారు. కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు పోషించి ఇప్పుడు తమ ప్రతిభతో వెండితెరపై హీరోలుగా రాణిస్తున్నారు. మరికొందరు అసిస్టెంట్ డైరెక్టర్ గా వర్క్ చేసి ఇప్పుడు కథానాయకులుగా మారారు. ఆ జాబితాలో ఈ చిన్నోడు ఒకరు. పైన ఫోటోను చూశారు కదా.. అందులో ఓ స్టార్ హీరో ఉన్నాడు. గుర్తుపట్టారా ?.. బ్యాగ్రౌండ్ సపోర్ట్ లేకుండానే ఒంటరిగా సినీ రంగుల ప్రపంచవైపు నడిచాడు. సహాయ దర్శకుడిగా కెరీర్ ఆరంభించి ఇప్పుడు హీరోగా ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలుగుతున్నాడు. అతడు మరెవరో కాదండి.. న్యాచురల్ స్టార్ నాని. పైన ఫోటోలో చిరునవ్వులు చిందిస్తూ పక్కకు చూస్తున్న కుర్రాడే మన న్యాచురల్ స్టార్.

న్యాచురల్ స్టార్ నాని. అసిస్టెంట్ దర్శకుడిగా సినీ ప్రయాణం ప్రారంభించాడు. కెరీర్ మొదట్లోనే బాపు, రమణల వద్ద సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఆ తర్వాత అష్టాచమ్మా సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. తొలి చిత్రానికి నటుడిగా మంచి మార్కులు కొట్టేసిన నాని.. ఆ వెంటనే అలా మొదలైంది సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నాడు. ఈ సినిమా తర్వాత నాని వెనుదిరిగి చూడలేదు. ప్రస్తుతం బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకుంటూ స్టార్ హీరోగా దూసుకుపోతున్నాడు. సహజమైన నటనతో పక్కింటి కుర్రాడిలా కనిపిస్తూ తెలుగు ప్రేక్షకులకు దగ్గరయ్యాడు. కామెడీ ఎంటర్టైనర్.. మాస్ యాక్షన్ మూవీస్ అయినా తన పాత్రలో ఒదిగిపోతాడు.

ఇటీవలే హాయ్ నాన్న సినిమాతో మరో విజయం అందుకున్నాడు. అంతకు ముందు జెర్సీ సినిమాతో నాన్నగా మెప్పించిన నాని..ఈసారి హాయ్ నాన్న సినిమాతో తండ్రిగా అలరించారు. ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమాలో నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక అరుళ్ మోహన్ నటిస్తున్నారు. ఇప్పుడు ఈ మూవీ షూటింగ్ వేగంగా జరుగుతుంది.

View this post on Instagram

A post shared by Nani (@nameisnani)

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Latest Articles
తెలంగాణ ఎంసెట్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయ్‌.. ఇలా ఈజీగా చెక్‌ చేసుకోండి
తెలంగాణ ఎంసెట్‌ రిజల్ట్స్‌ వచ్చేశాయ్‌.. ఇలా ఈజీగా చెక్‌ చేసుకోండి
ఆ పాట ఎప్పుడు విన్నా కన్నీళ్ళువస్తాయి..
ఆ పాట ఎప్పుడు విన్నా కన్నీళ్ళువస్తాయి..
ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుత స్కీం.. 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిల
ఆడపిల్లల భవిష్యత్తుకు అద్భుత స్కీం.. 21 ఏళ్లు వచ్చేసరికి మీ చేతిల
నగరవాసులకు అలర్ట్.. పెట్రోలు, డీజిల్ ఇకపై అలా దొరకదు..
నగరవాసులకు అలర్ట్.. పెట్రోలు, డీజిల్ ఇకపై అలా దొరకదు..
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
స్మార్ట్‌ వాచ్‌ కమ్‌ లాకెట్‌.. ఐటెల్‌ నుంచి అదిరిపోయే గ్యాడ్జెట్‌
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
ఈ ప్లేయర్స్ కోహ్లికి తమ్ములబ్బా.. తుఫాన్ బ్యాటింగ్‌తో ఊచకోత
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
అంగన్ వాడీ టీచర్‎ను అడవిలోకి తీసుకెళ్ళి.. ఆపై దారుణం..
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
'డిలీట్‌ ఫర్‌ ఆల్‌'కు బదులు.. 'డిలీట్‌ ఫర్‌ మీ' నొక్కారా.?
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
టాస్ ఓడితే బెంగళూరు మ్యాచ్ ఓడినట్లే.. వెలుగులోకి ఆసక్తికర కారణం
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే
కార్తీ ఖైదీ మూవీ చిన్నారిని ఇప్పుడు చూస్తే ఫిదా అవ్వాల్సిందే