AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

BTS Army: అమ్మాయిలకు గుడ్ న్యూస్.. BTS ఆర్మీ తిరిగి వచ్చేసింది.. సైనిక సేవను పూర్తి చేసుకున్న V, RM..

BTS ప్రపంచవ్యాప్తంగా ఉన్న యువతకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేని పేరు. దక్షిణ కొరియాకు చెందిన ఏడుగురు సాధారణ యువకులు ఏర్పాటు చేసిన బ్యాండ్ ఇది. మొదట్లో కె పాపు గ్రూపుతో చాలా సాదాసీదాగా మొదలైంది. కానీ తక్కువ సమయంలోనే వీరి గ్రూప్ వరల్డ్ వైడ్ విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. ముఖ్యంగా ఈ గ్రూప్ పట్ల యూత్ లో ఉండే ఫాలోయింగ్ గురించి చెప్పక్కర్లేదు.

BTS Army: అమ్మాయిలకు గుడ్ న్యూస్.. BTS ఆర్మీ తిరిగి వచ్చేసింది.. సైనిక సేవను పూర్తి చేసుకున్న V, RM..
Rm, V
Rajitha Chanti
|

Updated on: Jun 11, 2025 | 9:45 AM

Share

అమ్మాయిలకు గుడ్ న్యూస్.. ఫేమస్ బీటీఎస్ ఆర్మీ గ్రూప్ సభ్యులు RM, V ఇద్దరు తమ సైనిక సేవను పూర్తి చేసుకున్నారు. జూన్ 10న వీరిద్దరు తమ సైనిక సేవను కంప్లీట్ చేసుకుని తిరిగి ఇంటికి చేరుకున్నారు. దీంతో ప్రపంచవ్యాప్తంగా BTS ఆర్మీ ఫ్యాన్స్ సంబరాలు చేసుకున్నారు. సోషల్ మీడియాలో RM, V ఇద్దరికి సంబంధించిన వీడియోస్, ఫోటోస్ తెగ షేర్ చేస్తూ తమ సంతోషాన్ని తెలియజేస్తున్నారు. BTS ఆర్మీకి ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా వీరికి మహిళా అభిమానులు అధికంగా ఉన్నారు. అయితే దక్షిణ కొరియాలో జన్మించిన ప్రతి ఒక్కరూ సైన్యంలో పనిచేయాలనే ఒక చట్టం ఉంది. ఇందులో భాగంగా BTS గ్రూపులోని 7గురు సభ్యులలో కొందరు ఇప్పటికే సైనిక శిక్షణ కంప్లీట్ చేసుకున్నారు. ఇక ఇప్పుడు 2023లో ఆర్మీ సేవలోకి ఉన్న RM, V ఇద్దరూ ఇప్పుడు తమ సైనిక సేవను పూర్తి చేసుకుని ఇంటికి వచ్చేశారు.

సాధారణంగా దక్షిణ కొరియాలో జన్మించిన 18-35 సంవత్సరాల మధ్య వయస్సు గల పురుషులు 18-21 నెలలు సైన్యంలో పనిచేయాలనే నిబంధన ఉంది. ఇందులో మహిళలకు మినహాయింపు ఉంది. ఈ క్రమంలోనే RM, V ఇద్దరూ 2023లో ఆర్మీలో చేరి తమ దేశానికి సేవ చేశారు. ఇక ఇప్పుడు సైనిక సేవ పూర్తి చేసుకుని ఇంటికి వెళ్తుండగా, సాక్సోఫోన్ చేతిలోకి తీసుకున్న RM, అందంగా సంగీతం వాయిస్తూ అభిమానులను ఉత్సాహపరిచాడు. ఇక ఎప్పటిలాగే V మరోసారి అందమైన చిరునవ్వుతో మెస్మరైజ్ చేశాడు. ఇద్దరికి అభిమానులు సోషల్ మీడియా వేదికగా స్వాగతం పలుకుతూ తమ సంతోషాన్ని తెలియజేశారు.

ప్రపంచవ్యాప్తంగా అత్యధిక ఫాలోయింగ్ ఉన్న బ్యాండ్ BTS. మొదట్లో కె పాప్ గ్రూప్ పేరుతో సింపుల్ గా ప్రారంభమైన ఈ గ్రూప్.. 2013లో మొదటి ఆల్బమ్ నో మోర్ డ్రీమ్ తోనే విపరీతమైన క్రేజ్ సంపాదించుకుంది. అతికొద్ది కాలంలోనే ఈ గ్రూపుకు భారీగా ఫాలోవర్స్ వచ్చేశారు. BTS ఆర్మీలో ఇప్పటికే జిన్ ఆర్మీ సేవను పూర్తి చేశారు. జూన్ 12, 2024న తన సర్వీసును ముగించారు. ఆ తర్వాత కొద్దికాలానికే జంగ్ హోసియోక్ (జె-హోప్) తన సర్వీస్‌ను అక్టోబర్ 17, 2024న ముగించాడు. ఇక జిమిన్ సైతం జూన్ 11న తన సైనిక సేవను పూర్తి చేశాడు. ఇక సుగా జూన్ 21న బయటకు రానున్నారు. ఈ ఏడాది జూన్ చివరి నాటికి బీటీఎస్ ఆర్మీలోని ఏడుగురు సభ్యులు తిరిగి కలవనున్నారు.

ఇవి కూడా చదవండి :  

Tollywood: హీరోయిన్ దొరికేసిందిరోయ్.. నెట్టింట గత్తరేపుతోన్న టాలీవుడ్ చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood: సీరియల్లో పవర్ ఫుల్ విలన్.. నెట్టింట గ్లామర్ బ్యూటీ.. ఫోటోస్ చూస్తే..

Manasantha Nuvve : మరీ ఇంత అందంగా ఉందేంట్రా.. మతిపోగొట్టేస్తోన్న మనసంతా నువ్వే చైల్డ్ ఆర్టిస్ట్..

Tollywood : అమ్మాయిల డ్రీమ్ బాయ్.. 30 ఏళ్లకే సినిమాలకు దూరం.. కట్ చేస్తే.. ఇప్పుడు ఇలా..